వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏప్రిల్ 6వరకు అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు...సెలవులు ఇవే

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను మరి కొన్ని రోజుల పాటు పొడిగించారు. శాసనసభ సమావేశాలను వచ్చే నెల 6 వరకు పొడిగించాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. తాజా నిర్ణయం మేరకు మార్చి 28, 29 తేదీల్లో...ఏప్రిల్ 2, 3, 4, 6 తేదీల్లో మరో ఆరు రోజులు శాసనసభ సమావేశాలు జరగనున్నాయి.

అయితే మార్చి 30, 31, ఏప్రిల్ 1, 5 తేదీల్లో అసెంబ్లీకి సమావేశాలకు సెలవుగా ప్రకటించారు. అలాగే ఈనెల 28న శాసన సభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. బిఏసీ సమావేశానికి టిడిపి నుంచి కెఈ కృష్ణమూర్తి, పల్లె రఘునాథరెడ్డి హాజరుకాగా, బిజెపి నుండి విష్టుకుమార్ రాజు హాజరయ్యారు.

AP Assembly Sessions Extend till April 6, 2018

మరోవైపు వచ్చే నెల 2,3 తేదీల్లో ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు నిర్వహించాలని బిఎసిలో నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 4 వ తేదీ సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంతో పాటు విందు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

English summary
Amaravathi: AP Assembly Meetings will held in addition to another 6 days. The decision was taken at the BAC meeting headed by Speaker Kodela. Assembly meetings will held till April 6.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X