వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ చివరి రోజు హైలైట్స్ : ఏపీ శాసనమండలి రద్దుకు శాసనసభ ఆమోదం.. నిరవధిక వాయిదా

|
Google Oneindia TeluguNews

అమరావతి:ఊహించిందే జరిగింది. ముందు నుండి చెబుతున్నట్లుగా ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ అంశమే ప్రధానం అజెండాగా సమావేశమైన కేబినెట్ తొలి అంశంగా దీని పైనే చర్చ చేసింది. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే మండలి పరిణామాల పైన ముఖ్యమంత్రి మంత్రుల అభిప్రాయాలు సేకరించారు. ప్రజా మేలు కోసం తీసుకొనే నిర్ణయాలకు అడ్డు చెప్పే మండలి అవసరం లేదని పలువురు మంత్రులు సూచించారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. దీంతో..కేబినెట్ ఏపీ శాసనమండలిని రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది.

అసెంబ్లీలో సీఎం జగన్ తీర్మానంను ప్రవేశపెట్టారు. అనంతరం సుదీర్ఘంగా మండలి రద్దు తీర్మానంపై చర్చ జరిగింది. టీడీపీ సభ్యులు సభకు హాజరుకాలేదు. చివరిగా సీఎం తీర్మానంపై ప్రసంగించారు. మండలి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని సీఎం అన్నారు. ప్రజాధనం అనవసరంగా ఖర్చు చేయడం జరుగుతోందన్నారు. ఇక తీర్మానంకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని సీఎం జగన్ కోరారు. అనంతరం డివిజన్ ఓటింగ్ జరిగింది. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ సభలో సభ్యులు కానందున వేరుగా కూర్చోవాలని స్పీకర్ సూచించారు. తీర్మానంకు 133 మంది అనుకూలంగా ఓటు వేశారు.9 మంది మాత్రం న్యూట్రల్‌గా ఉన్నారు. మెజార్టీ సభ్యులు తీర్మానంకు అనుకూలంగా ఓటు వేసినందున తీర్మానం పాస్ చేస్తూ స్పీకర్ ప్రకటించారు. ఇక అసెంబ్లీలో ఆమోదం పొందిన తీర్మానంను రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేయనుంది.

AP Assembly sessions live updates:Cabinet to take a call on abolishing council

సోమవారం శాసనసభ జరిగిన తీరు మినిట్ - టూ-మినిట్ అప్‌డేట్స్

Newest First Oldest First
6:01 PM, 27 Jan

అసెంబ్లీ నిరవధిక వాయిదా
6:01 PM, 27 Jan

శాసన మండలి రద్దు చేయాలంటే 2/3వ వంతు మెజార్టీ ఉండాలని ఆర్టికల్ 169 చెబుతోంది. ఇది ఉంది కాబట్టి శాసనమండలి రద్దు అవుతున్నట్లు స్పీకర్ ప్రకటించారు
5:52 PM, 27 Jan

మండలి రద్దు తీర్మానంకు అనుకూలంగా ఓటు వేసిన 133 మంది సభ్యులు
5:49 PM, 27 Jan

ఏపీ శాసనమండలి రద్దుకు శాసనసభ ఆమోదం
5:36 PM, 27 Jan

తీర్మానంకు అనుకూలంగా ఉన్న సభ్యులు లేచి నిలబడాల్సిందిగా కోరిన స్పీకర్
5:34 PM, 27 Jan

తలపులు మూసివేయాల్సిందిగా స్పీకర్ ఆదేశాలు
5:33 PM, 27 Jan

మోపిదేవి వెంకటరమణ, పిల్లిసుభాష్ చంద్రబోస్‌లు సభలో సభ్యులు కానందున వేరుగా కూర్చోవాలంటూ స్పీకర్ రూలింగ్
5:32 PM, 27 Jan

మండలి రద్దు తీర్మానానికి అందరి ఆశీస్సులు కావాలి: సీఎం జగన్
5:31 PM, 27 Jan

ప్రజాప్రయోజనాల కోసమే మండలి రద్దు నిర్ణయం: సీఎం జగన్
5:29 PM, 27 Jan

ల్యాండ్ పూలింగ్‌లో అసైన్డ్ భూములు ఇచ్చిన వారికి కూడా సమాన రీతిలో రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వబోతున్నాం: సీఎం జగన్
5:27 PM, 27 Jan

ఏమి అన్యాయం జరిగిందని రైతులను రెచ్చగొడుతున్నారు: సీఎం జగన్
5:23 PM, 27 Jan

నాడు కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగి... తిరిగి అదే కాంగ్రెస్ పార్టీని పొగుడుతూ మాట్లాడిన చంద్రబాబు వీడియోను సభలో ప్రదర్శించిన సీఎం జగన్
5:20 PM, 27 Jan

ప్రధాని మోడీపై నాడు పొగుడుతూ మాట్లాడి... ఆ తర్వాత మోడీని విమర్శిస్తూ చంద్రబాబు మాట్లాడిన వీడియోను సభలో ప్రదర్శించిన సీఎం జగన్
5:19 PM, 27 Jan

ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఎలా మాట మార్చారో సభలో వీడియోను ప్రదర్శించిన సీఎం జగన్
5:17 PM, 27 Jan

విశ్వసనీయత, మాటలు ఎవరు ఎలా మారుస్తారో చెప్పేందుకు సభలో వీడియోను ప్రదర్శించిన సీఎం జగన్
5:16 PM, 27 Jan

మూడు రోజులు సమయం ఇచ్చాము... ఈ మూడు రోజుల్లో పిచ్చి రాతలు రాశాయి కొన్ని పత్రికలు: సీఎం జగన్
5:14 PM, 27 Jan

చంద్రబాబు లాంటి ఆలోచనలు ఉంటే ఈ రోజు చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా వచ్చేది కాదు: సీఎం జగన్
5:13 PM, 27 Jan

దిక్కుమాలిన రాజకీయాలు మేము చేయము: సీఎం జగన్
5:13 PM, 27 Jan

మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే కొన్ని పత్రికలు దిక్కుమాలిన రాతలు రాశాయి: సీఎం జగన్
5:12 PM, 27 Jan

ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసే అర్హత మండలికి లేదు: సీఎం జగన్
5:12 PM, 27 Jan

మండలికి కేబినెట్ జవాబుదారీ కాదు: సీఎం జగన్
5:10 PM, 27 Jan

మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేస్తున్నాం: సీఎం జగన్
5:09 PM, 27 Jan

మండలికి సంబంధించిన అంశం కాదు.. ప్రజాకాంక్షలను నేరవేరుస్తున్నామా లేదా అనేదే ప్రశ్న: సీఎం జగన్
5:09 PM, 27 Jan

మండలి కచ్చితంగా అవసరం అని రాజ్యాంగంలో లేదు: సీఎం జగన్
5:07 PM, 27 Jan

మండలికి ప్రజాధనం దండగ: సీఎం జగన్
5:07 PM, 27 Jan

ప్రజాప్రయోజనాలను కాపాడేందుకే మండలి ఉండేది:సీఎం జగన్
4:39 PM, 27 Jan

అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలంటే ఇలా మండలి ద్వారా బిల్లులను అడ్డుపడటం సరికాదు. అందుకే శాసనమండలి రద్దుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను: పిల్లి సుభాష్ చంద్రబోస్
4:34 PM, 27 Jan

దేశ ప్రజలకు పదునైనటువంటి కత్తిని ఇవ్వడం లేదు.. ఓటుహక్కు అనే ఆయుధం ఇస్తున్నాను అనే అంబేడ్కర్ వ్యాఖ్యలను గుర్తుచేసిన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్
4:27 PM, 27 Jan

రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం మండలిని రద్దు చేయాల్సిందే: డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్
4:27 PM, 27 Jan

శివరామకృష్ణన్ ఇచ్చిన నివేదికను చంద్రబాబు పట్టించుకోలేదు: డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్
READ MORE

English summary
AP cabinet will be meeting today ahead of assembly sessions. Cabinet will take a call on the abolishment of Council and then pass a resolution regarding the same in the assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X