వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీకి గ‌తం గుర్తొస్తుందా: స‌భ‌లో సీఎంగా జ‌గ‌న్ ఇలా..అరుదైన ఘ‌ట్టం : నేటి నుండి అసెంబ్లీ ..!

|
Google Oneindia TeluguNews

స‌రిగ్గా రెండేళ్ల క్రితం. అధికార పార్టీ తీరును..నాటి స్పీక‌ర్ వైఖ‌రిని నిరసిస్తూ ఆనాటి ప్ర‌తిపక్ష వైసీపీ అసెంబ్లీ బ‌హిష్క రించింది. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చి..ప్ర‌తిప‌క్షం నుండి అధికారంలోకి వ‌చ్చి..శాస‌న‌స‌భ‌లో తిరిగి అడుగు పెడుతోం ది. 15వ శాస‌న‌స‌భా స‌మావేశాలు ఈ రోజు నుండి ప్రారంభం కానున్నాయి. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్‌కు స‌భ‌లోకి ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు ఏర్పాట్లు చేసారు. తొలి రోజు స‌భ్యుల ప్ర‌మాణ స్వీకారాలు చేయ‌నున్నారు. ప్రొటెం స్పీక‌ర్‌గా శంబంగి చిన అప్ప‌ల‌నాయుడు వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్..ప్ర‌తిప‌క్ష నేత‌గా చంద్ర‌బాబు స‌భ‌లో ప్ర‌వేశ పెట్టే అరుదైన స‌న్నివేశం నేడు ఆవిష్కృతం కానుంది.

సీఎంగా జ‌గ‌న్ ఇలా..అరుదైన ఘ‌ట్టంతో

సీఎంగా జ‌గ‌న్ ఇలా..అరుదైన ఘ‌ట్టంతో

ఏపీలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత జ‌రుగుతున్న తొలి శాస‌న‌స‌భా స‌మావేశాలు మ‌రి కాసేప‌ట్లో ప్రారంభం కానున్నాయి. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప‌ది గంట‌ల‌కు శాస‌న‌స‌భ‌లోని ముఖ్య‌మంత్రి పేషీలో ప్ర‌వేశిస్తారు. ఆ వెంట‌నే పూజాది కార్యాక్ర‌మాలు నిర్వ‌హిస్తారు. స‌రిగ్గా 11.05 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రి హోదాలో స‌భ‌లో అడుగు పెట్టే స‌మ‌యంలో వైసీపీ స‌భ్యులు క‌ర‌తాళ ధ్వ‌నులు..బ‌ల్ల‌లు చరుస్తూ స్వాగ‌తం ప‌లుకుతారు. జాతీయ గీతానికి ముందుగా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు .. ఆ పార్టీ నేత‌ల‌కు..ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ క‌రచాల‌నం చేసి వారికి అభినంద‌న‌లు తెల‌ప‌నున్నారు.రెండేళ్ల క్రితం త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను టీడీపీలోకి ఫిరాయింపుల ద్వారా చేర్చుకొని వారికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చి..వారి మీద చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌టానికి నిర‌స‌న‌గా ప్ర‌తిప‌క్ష హోదాలో స‌మావేశాల‌ను నాడు బ‌హిష్క‌రించిన వైసీపీ..నేడు అధికారిక హోదాలో స‌భ‌లో ప్ర‌వేశిస్తోంది.

తొలుత జ‌గ‌న్‌..త‌రువాత చంద్ర‌బాబు

తొలుత జ‌గ‌న్‌..త‌రువాత చంద్ర‌బాబు

ఏపీలో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత తొలి అసెంబ్లీ స‌మావేశాలు బుధ‌వారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ స‌మాశాలు ఉద‌యం 11.05 గంట‌ల‌కు ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీక‌ర్ శంబంగి చిన అప్ప‌ల‌నాయుడు స‌భ‌కు ఎన్నికైన ఎమ్మెల్యేల‌తో ప్ర‌మాణం చేయిస్తారు. తొలుత ముఖ్య‌మంత్రి హోదాలో జ‌గ‌న్‌..ఆ త‌రువాత ప్ర‌తిప‌క్ష నేత హోదాలో చంద్ర‌బాబు ప్ర‌మాణం చేస్తారు. ఆ త‌రువాత మొత్తం స‌భ‌లోని ఎమ్మెల్యేలు అక్ష‌ర క్ర‌మంలో ప్ర‌మాణం చేస్తా రు. మ‌ధ్నాహ్నం రెండు గంట‌ల వ‌ర‌కు స‌భ కొన‌సాగ‌నుంది. మిగిలిన ఎమ్మెల్యేల‌తో 13న ప్ర‌మాణం పూర్తి చేయిస్తారు. అదే రోజు కొత్త స్పీక‌ర్‌గా త‌మ్మినేని సీతారం ఏక‌గ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఆయ‌న స‌భాప‌తి స్థానంలో ఆశీనులు అయిన త‌రువాత వైసీపీ..టీడీపీ నుండి స్పీక‌ర్‌ను అభినందిచటంతో స‌భ 14వ తేదీకి వాయిదా ప‌డుతుంది. 14న గ‌వ‌ర్న‌ర్ ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు.

టీడీపీకి గ‌తం గుర్తు వ‌స్తుందా..

టీడీపీకి గ‌తం గుర్తు వ‌స్తుందా..

గ‌త అయిదేళ్ల కాలంలో జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో అధికార పార్టీగా టీడీపీ ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకుంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ప్ర‌తిప‌క్ష నేత‌తో పాటుగా స‌భ్యుల‌కు సైతం మాట్లాడే అవ‌కాశం లేకుండా నాటి స్వీకర్ వ్య‌వ‌హ రించార‌ని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్ప‌డు అదే ప్ర‌తిప‌క్షం అధికారంలోకి వ‌చ్చింది. దీంతో..వైసీపీ ప్ర‌భుత్వం ఇప్పుడు శాస‌న‌స‌భ‌లో త‌మ‌తో ఎలా వ్య‌వ‌హ‌రిస్తుంద‌నే ఉత్కంఠ టీడీపీలో క‌నిపిస్తోంది. దీంతో..ముందుగానే టీడీపీ అధినేత ముంద‌స్తు స‌మావేశం ఏర్పాటు చేసారు. అధికార ప‌క్షం పూర్తిగా డామినేట్ చేసే ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని స‌భ్యులు క‌లిసిక‌ట్టుగా ఉండాల‌ని సూచించారు. అదే విధంగా..ఇప్పటికే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ల‌క్ష్యంగా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు ప్రారంభించారు. దీంతో..ఇప్పుడు స‌మావేశాల పైన ఆస‌క్తి నెల‌కొని ఉంది.

English summary
AP Assembly sessions start to day in Amaravati after new govt form in state. As C M jagan first time entering in Assembly as well as opposition leader Chandra Babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X