వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీసీ అయితే వదిలేస్తారా ? మనీలాండరింగ్ కేసు పెట్టాలి- అచ్చెన్నాయుడుపై స్పీకర్ తీవ్ర వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

రూ.151 కోట్ల ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ అరెస్ట్ చేసిన టీడీపీ మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ విరుచుకుపడ్డారు. ఈ కేసులో అచ్చెన్నాయుడు అరెస్టుకు ఏసీబీ అసెంబ్లీ స్పీకర్ అనుమతి తీసుకోలేదంటూ వస్తున్న విమర్శలపై కూడా తమ్మినేని స్పందించారు. అచ్చెన్నాయుడి అరెస్ట్ ను బీసీలపై దాడిగా అభివర్ణిస్తూ టీడీపీ చేస్తున్న ఆరోపణలను సైతం స్పీకర్ తిప్పికొట్టారు.

అచ్చెన్నాయుడిపై స్పీకర్ ఫైర్...

అచ్చెన్నాయుడిపై స్పీకర్ ఫైర్...

ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టై గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ తీవ్ర విమర్శలు చేశారు. ఈఎస్ఐలో జరిగిన అవినీతికి సంబంధించి ఏసీబీ అధికారులు స్పష్టమైన ఆధారాలతోనే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని స్పీకర్ తెలిపారు. అచ్చెన్నాయుడిపై అరెస్టు ప్రోసీజర్ ప్రకారం జరగలేదంటూ వస్తున్న విమర్శలను కూడా స్పీకర్ తప్పుబట్టారు. అంతా నిబంధనల ప్రకారమే జరిగిందన్నారు.

అధికారులు సమాచారం ఇచ్చారు...

అధికారులు సమాచారం ఇచ్చారు...


అచ్చెన్నాయుడి అరెస్టుపై ఏసీబీ అధికారులు, జైలు అధికారులు, కోర్టు నుంచి కూడా తనకు ముందస్తు సమాచారం ఇచ్చారని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. స్పీకర్ కు సమాచారం ఇవ్వలేదని టీడీపీ నేతలు ఎలా ఆరోపణలు చేస్తారని స్పీకర్ ప్రశ్నించారు. అరెస్ట్ ప్రోసీజర్ సరిగా లేదన్నది నిజం కాదన్నారు. వైట్ కాలర్ నేరాల్లో అనేక కోణాలు ఉంటాయని, వివిధ లావాదేవీల్లో ఏడేళ్లు తక్కువ కాకుండా చట్టంలో ఉన్న చర్యలు తీసుకుంటారని స్పీకర్ గుర్తుచేశారు.

బీసీ అయితే వదిలేయాలా ?

బీసీ అయితే వదిలేయాలా ?

ఈ కేసులో చంద్రబాబు చెబుతున్నట్లు బీసీ అయితే వదిలేద్దామా అని స్పీకర్ తమ్మినేని ప్రశ్నించారు. ఈ నేరంలో అచ్చెన్నాయుడిని బీసీ అని చూపిస్తూ బీసీలను అవమానిస్తున్నారని తమ్మినేని మండిపడ్డారు. మీ నాయకుడు చేసిన నేరాన్ని మా బీసీలందరిపైకి
నెడుతున్నారంటూ చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వంలో అవినీతి జరిగిందో లేదో చంద్రబాబు చెప్పాలని, ఒకవేళ అచ్చెన్నాయుడు నేరం చేయలేదంటే ఎవరు చేశారో చంద్రబాబు చెప్పాలని స్పీకర్ సవాల్ విసిరారు.

Recommended Video

Atchennaidu కి 14 రోజుల రిమాండ్, Remand Report లో ఆసక్తికర విషయాలు..!!
అచ్చెన్నాయుడు ఉగ్రవాదా, బందిపోటా బాబే చెప్పాలి...

అచ్చెన్నాయుడు ఉగ్రవాదా, బందిపోటా బాబే చెప్పాలి...


గోడలు దూకి అచ్చన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్టు చేసి తెచ్చారంటున్నారని, దాక్కున్నవారిని పట్టుకోవాల్సిన బాధ్యత ఏసిబి అధికారులదేగా అని స్పీకర్ అన్నారు.

అచ్చెన్నాయుడు ఉగ్రవాదా, బందిపోటా మీ క్యాబినెట్ లో పని చేశాడు కాబట్టి మీరే చెప్పాలని చంద్రబాబుకు సూచించారు. .

అచ్చెన్నాయుడు స్వాతంత్ర్య సమరయోధుడా, కార్గిల్ యుద్ధంలో పని చేశాడా.. గాంధీ , అంబేద్కర్ విగ్రహాల వద్ద ఆందోళన చేయడానికి అంటూ టీడీపీ వైఖరిపై స్పీకర్ మండిపడ్డారు.
మనీ‌ల్యాండరింగ్. మనీ లేయరింగ్ కూడా ఈ కేసులో చూడాల్సి వస్తుందని....

ఈ నేరాలకు పదేళ్లు తక్కువ కాకుండా జైలు శిక్ష వుంటుందన్నారు. టెక్కలిలో అక్రమ మైనింగ్ దారులకు ఈ కుంభకోణం లో భాగస్వామ్యం వుందన్న ఆరోపణలు వున్నాయని,

నక్సలైటు బందిపోట్లను కరడుగట్టిన నేరగాళ్లను వదలరని చెప్పారు. ఇది ఆర్థిక నేరమని,

బీసీలు. ఎస్సీ, ఎస్టీలు. మైనారిటీ ల సొమ్ము కొట్టేయడమే కదా అని స్పీకర్ అచ్చెన్నాయుడిని ప్రశ్నించారు.

English summary
andhra pradesh legislative assembly speaker tammineni sitaram made serious comments on former minister atchannaidu, who is being arrested by acb in esi scam yesterday. speaker questions that how can govt leave him for he belongs to bc community.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X