శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ నిప్పులుచెరిగిన స్పీకర్ సీతారాం - అప్పుడు వైసీపీకీ టీడీపీ గతే - అచ్చెన్నపై అప్పల్రాజు ఫైర్

|
Google Oneindia TeluguNews

రాజ్యాంగ పదవిలో కొనసాగుతూ, వ్యవస్థల పట్ల సంయమనం పాటించాల్సిన వ్యక్తి కాస్తా.. రాజకీయ కామెంట్లు చేయడం తగదంటూ హైకోర్టు చేత విమర్శలు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ప్రతిపక్ష టీడీపీపై నేరుగా పదునైన విమర్శలతో నిప్పులు చెరిగారు. మంత్రి సీదరి అప్పలరాజుతో కలిసి సోమవారం శ్రీకాకుళంతో ఆయన మీడియాతో మాట్లాడారు.

బీజేపీకి వైసీపి డైరెక్షనా? - కన్నా నేను ఒకటే -చంద్రబాబు, జగన్‌ కవలలు -ఇదీ అసలు కథ: సోము వీర్రాజుబీజేపీకి వైసీపి డైరెక్షనా? - కన్నా నేను ఒకటే -చంద్రబాబు, జగన్‌ కవలలు -ఇదీ అసలు కథ: సోము వీర్రాజు

బీసీ కార్పొరేషన్లపై కామెంట్లా?

బీసీ కార్పొరేషన్లపై కామెంట్లా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 56 బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, వాటికి చైర్మన్లు, డైరెక్టను సైతం నియమించిన నేపథ్యంలో.. కార్పొరేషన్ల వల్ల బీసీలకు ఎలాంటి మేలు జరగబోదని, చైర్మన్ పదవులు నాలుక గీసుకోడానికి కూడా పనికిరావని ఏపీ టీడీపీ నూతన అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు చేయడం తెలిసిందే. కార్పొరేషన్లను, వాటి చైర్మన్లను కించపర్చేలా అచ్చెన్న మాట్లాడటం కరెక్టు కాదని స్పీకర్ సీతారాం అన్నారు. అంతటితో ఆగకుండా..

వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు..

వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు..

‘‘నామినేటెడ్‌ పోస్టులపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పే. ఆ పదవులు నాలుక గీచుకోవటానికి కూడా పనికిరావనడం సబబుకాదు. అసలు టీడీపీ హయాంలో బీసీలకు పదవులు ఎందుకు కేటాయించలేదు?'' అని స్పీకర్ ప్రశ్నించారు. తప్పులు చేసినందుకే టీడీపీ అధికారం కోల్పోయిందని, ఒకవేళ తాము(వైసీపీ) కూడా అవినీతి, అక్రమాలకు పాల్పడితే వచ్చే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని సీతారాం అన్నారు.

Recommended Video

AP Assembly Speaker Tammineni Sitaram Walkout ! | Oneindia Telugu
అచ్చెన్న వచ్చాకే బీసీ పార్టీనా?

అచ్చెన్న వచ్చాకే బీసీ పార్టీనా?

‘‘అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడు కాగానే టీడీపీ బీసీల పార్టీగా మారిందా? గతంలో అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు బీసీ కాదా? అసలు టీడీపీ హయాంలో బీసీలకు ఏం చేశారో అచ్చెన్న చెప్పాగలరా? సీఎం జగన్ సదుద్దేశంతో 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే వాటిని చులకన చేసి మాట్లాడటం కరెక్టేనా?'' అని మంత్రి అప్పలరాజు మండిపడ్డారు.

మోసపోయిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే - ఏపీ సీడ్స్ ద్వారా నకిలీ విత్తనాలు కొని - సీఎం జగన్‌ దృష్టికిమోసపోయిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే - ఏపీ సీడ్స్ ద్వారా నకిలీ విత్తనాలు కొని - సీఎం జగన్‌ దృష్టికి

English summary
andhra pradesh assembly speaker tammineni sitaram once again made political remarks. speaking to media on monday at srikakulam, along with minister appalaraju, speaker slams tdp leaders. he supports cm jagan's 56 bc corporations initiative.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X