వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకయ్య నాయుడు అలా చేసి ఉండకూడదు : స్పికర్ తమ్మినేని సీతారాం

|
Google Oneindia TeluguNews

ఏపికి చెందిన టీడీపీ రాజ్యసభ ఎంపీలను బీజేఎల్పీలో విలీనం చేయడంపై ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఈనేపథ్యంలోనే ఆయన వెంకయ్య నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించిన స్పికర్ రాజ్యసభలో పార్టీ ఫిరాయింపును ప్రోత్సహించడం ఆయన స్థాయిలో సమంజం కాదని అన్నారు. అదే స్థానంలో తానుంటే ఫిరాయింపులను ప్రోత్సహించే వాడిని కాదని పేర్కోన్నారు.

ఆదివారం విజయవాడలో మిడీయాతో స్పికర్ తమ్మినేని మాట్లాడారు. ఈ సంధర్భంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని చెప్పిన ఆయన పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తానని అన్నారు. పార్టీ విలీన వ్యవహారాల్లో తాను అసలు రాజీ పడనన్నారు. అలా చేయడం చట్టం ప్రకారం నేరమని.. నిబంధనలకు విరుద్ధంగా తాను నడుచుకోనని సీతారాం స్పష్టం చేశారు.

AP Assembly speaker Tammineni sitaram on TDP MPs responds

మరోవైపు దేశంలో స్పీకర్‌ వ్యవస్థ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరముందన్నారు.అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలకు దిగిన వారిని తన ఛాంబర్‌లో మందలించానన్నారు. సభా నిబంధనల విషయంలో ఎక్కడా రాజీ పడేది ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. స్పీకర్‌పై తనవైపు నుంచి ఎటువంటి ఒత్తిళ్లు ఉండవని సీఎం వైఎస్‌ జగన్‌ ముందే చెప్పారన్న విషయాన్ని ఈ సందర్భంగా తమ్మినేని స్పష్టం చేశారు.

English summary
AP Assembly speaker Tammineni sitaram on TDP MPs responds
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X