వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వీట్ మెమోరీస్‌: ఆవేశాలు- చాలెంజ్‌లు : భావోద్వేగం :నేటితో అసెంబ్లీ ట‌ర్మ్ ముగింపు ..!

|
Google Oneindia TeluguNews

అయిదేళ్లు ఇట్టే గ‌డిపోయింది. ఎమ్మెల్యేగా గెల‌వాలి..అధ్య‌క్షా అని అనాలి అనే క‌ల‌ల‌తో అసెంబ్లీలో తొలి సారి అడుగు పెట్టిన ఎంతో మందికి ఈ ట‌ర్మ్‌లో ఇది చివ‌రి స‌మావేశం. మ‌రి కొద్ది రోజుల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు. తిరిగి గెలుస్తామో లేదో తెలియ‌దు. తిరిగి అసెంబ్లీకి వ‌స్తామో రామో తెలియ‌ని ప‌రిస్థితి. ఇలా..ఏపి ఎమ్మెల్యేలు ఈ అయిదేళ్ల అసెంబ్లీ అనుభూతు లను స్వీట్ మెమోరీస్ తో..భావోద్వేగంతో చివ‌రి రోజు స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు...

నేటితో అసెంబ్లీ ముగింపు...

నేటితో అసెంబ్లీ ముగింపు...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ టర్మ్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇవే చివరి సమా వేశాలు కావడంతో ఈరోజు శాసనసభ్యులతో స్పీకర్‌ కోడెల శివప్రసాద్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో సెషన్ కార్యక్ర మాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మధ్యాహ్నం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లంచ్‌ ఏర్పాటు చేశారు. 2014 ఎన్నిక‌ల్లో గెలిచి న త‌రువాత జూన్ 8 న ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఆ త‌రువాత ప్రొటెం స్పీక‌ర్ గా సీనియ‌ర్ ఎమ్మెల్యే ప‌తివాడ నారాయ‌ణ స్వామి నాయుడు ఎన్నిక‌య్యారు. ఆయ‌న రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత హైద‌రాబాద్ లోని పాత అసెంబ్లీ భ‌వ‌నంలో గెలిచిన ఎమ్మెల్యేల‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఆ ఎన్నిక‌ల్లో హోరా హోరీగా త‌ల‌ప‌డిన చంద్ర‌బాబు..జ‌గ‌న్ లు ఇద్ద‌రూ ముఖ్య‌మంత్రి..ప్ర‌తిప‌క్ష నేత హోదాలో మ‌ర్యాద పూర్వకంగా చేతులు క‌లిపారు. ఆ త‌రువాత జ‌గ‌న్ పుట్టిన రోజు నాడు మాత్ర‌మే తిరిగి వారిద్ద‌రూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.

ఆవేశాలు..ఛాలెంజ్ ల‌తో నువ్వా..నేనా..

ఆవేశాలు..ఛాలెంజ్ ల‌తో నువ్వా..నేనా..

ఏపి నూత‌న శాస‌న‌స‌భా సమావేశాల్లో స్పీక‌ర్ గా కోడెల శివ‌ప్ర‌సాద్ ను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ త‌రువాత అను భ‌వం తో ముఖ్య‌మంత్రి శాస‌న‌స‌భ లో ప్ర‌తిపక్షం పై అనేక వ్యూహాలు అమ‌లు చేసారు. తొలుత ఆ వ్యూహాల్లో వైసిపి సులువుగా చిక్కుకున్న‌ట్లుగానే క‌నిపించింది. ఆ త‌రువాత ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ లో ప‌రిణితి క‌నిపించింది. అంశాల వారీగా ప్ర‌సంగాల్లో గుర్తింపు పొందారు. రాజ‌ధాని భూ వ్య‌వ‌హారం..ఓటు ను నోటు..కాల్ మ‌నీ..రుణ మాఫీ..ప్ర‌త్యేక హోదా.. పోల‌వ‌రం..ప‌ట్టిసీమ‌ వంటి అంశాల్లో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టారు. ముఖ్య‌మంత్రి సైతం గ‌ట్టిగానే తిప్పి కొట్టారు. ఈ ట‌ర్మ్‌లో రాష్ట్ర చ‌రిత్ర‌లోనే తొలి సారిగా ఒక శాస‌న‌స‌భ్యురాలిని ఏడాది పాటు స‌స్పెండ్ చేసారు. వైసిపి ఎమ్మెల్యే రోజా ఏడాది కాలం స‌స్పెన్ష‌న్ కు గురై ఆ త‌రువాత స‌భ‌లో అడుగు పెట్ట‌లేదు. ఇక‌, వైసిపి ఎమ్మెల్యేల‌ను త‌మ వైపు తిప్పుకొని మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌టాన్ని నిరిసిస్తూ వైసిపి స‌మావేశాల‌ను బాయ్ కాట్ చేసింది.

అధికార - ప్ర‌తిప‌క్షాల హోరా హోరీ..

అధికార - ప్ర‌తిప‌క్షాల హోరా హోరీ..

ఈ ట‌ర్మ్ స‌మావేశాల్లో అనుభ‌వం లేని జ‌గ‌న్ ను ఇట్టే ఇబ్బంది పెట్ట‌వ్చ‌ని అధికార పార్టీ భావించింది. అయితే, వారి వ్యూహాల‌కు ధీటుగా జ‌గ‌న్ క‌నిపించారు. త‌న ఆస్తుల పై ఆరోప‌ణ‌ల స‌మ‌యంలోనూ.. రాజ‌ధాని భూ దందా పై సీయం కు ఛాలెంజ్ చేసిన స‌మ‌యంలోనూ.. త‌న విద్యార్హ‌త‌ల గురించి వ్యంగంగా మాట్లాడిన సంద‌ర్భంలోనూ....స్టీఫెన్ స‌న్ కు తానే ఎమ్మెల్సీ ఇప్పించాన‌నే ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానంగానూ జ‌గ‌న్ నేరుగా ముఖ్య‌మంత్రిని ఛాలెంజ్ చేయ‌టం స‌భ‌లోని ఆవేశాల‌కు తార్కాణం. ఇక‌, ప్ర‌భుత్వం..స్పీక‌ర్ పై అవిశ్వ‌సం పైనా చ‌ర్చ జ‌రిగింది. ప్ర‌త్యేక హోదా పై వైసిపి ఆందోళ‌న స‌స్పెన్ష‌న్ ల వ‌ర‌కు వెళ్లింది. కాల్‌మ‌నీ వ్య‌వ‌హారంలో చ‌ర్చ అదుపు త‌ప్పి అధికార - ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య తోపు లాట‌కు దారి తీసింది. ఇదే ట‌ర్మ్‌లో తండ్రి - కొడుకులు ఒకే క్యాబినెట్ లో ఉండ‌టం... తండ్రి- కుమార్తెలు ఇకే స‌భ‌లో స‌భ్యులుగా ఉండ‌టం చోటు చేసుకుంది. ఇక‌, న‌లుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మ‌ర‌ణించారు. మొత్తానికి రాజ‌కీయాల్లో ఇవ‌న్నీ స‌ర్వ సాధార‌ణ‌మైనా ..అనేక స్వీట్ మెమోరీస్ తో స‌భ్యులంగా ఒక ర‌క‌మైన భావోద్వేగంతో చివ‌రి రోజు స‌మావేశా ల్లో క‌నిపించారు.

English summary
AP Assembly present term sessions complete by to day, Many members remembering their attachment with assembly and co members. last day of the session members got emotional in photo session.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X