వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్‌తో పాటుగా ఆ 9మందే ..ఎందుకంటే : ప‌్రొటెం స్పీక‌ర్‌గా వారిలో ఒక‌రు : తొలి వారంలో అసెంబ్లీ..!

|
Google Oneindia TeluguNews

ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ఈనెల‌30న ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. మొత్తం కేబినెట్ అదే రోజు ప్ర‌మాణ స్వీకారం చేస్తుంద‌ని భావించినా..జ‌గ‌న్ తొమ్మ‌ది మందితో మాత్ర‌మే ఆ రోజు తొలి ద‌ఫా కేబినెట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక‌, జూన్ తొలి వారంలో అసెంబ్లీ స‌మావేశాలు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందుకోసం తొలుత ప్రొటెం స్పీక‌ర్‌ను నియ‌మించాల్సి ఉంది. దీని కోసం ముగ్గురి పేర్లు ప‌రిశీలిస్తున్నారు. తొలి స‌మావేశాలు కేవ‌లం స‌భ్యుల ప్ర‌మాణ స్వీకారానికి మాత్ర‌మే ప‌రిమ‌తి
కానున్నాయి.

30న జ‌గ‌న్‌తో పాటుగా 9 మంది...
ఈ నెల 30న ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకార చేయ‌నున్నారు. తొలుత జ‌గ‌న్‌తో పాటుగా మొత్తం కేబినెట్ ప్ర‌మాణ స్వీకారం చేస్తుంద‌ని భావించారు. అయితే ఆ త‌రువాత జ‌గ‌న్ ఒక్క‌రే ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, తాజాగా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం సీఎంతో పాటుగా తొమ్మ‌ది మంది బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.

AP becoming CM Jagan Decided to give chance for nine members in cabinet along with him on 30th

వారిలో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆదిమూల‌పు సురేష్‌, కొడాలి నాని, పుష్ప‌శ్రీ వాణి, బొత్సా స‌త్య నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, గ్రంధి శ్రీనివాస్, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్, అవంతి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లో స్థానిక సంస్థ‌లు..మున్సిప‌ల్ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ప్ర‌స్తుతం అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన తీర్పు జోష్ త‌గ్గక ముందే ఈ ఎన్నిక‌లు ముగించాల‌నేది జ‌గ‌న్ అంచ‌నా. అందులో స‌మ‌ర్ద‌వంతంగా బాధ్య‌త‌లు నిర్వ‌హించిన వారిలో ఎంపిక చేసి మంత్రివ‌ర్గం పూర్తి స్తాయిలో విస్త‌రించాల‌ని నిర్ణియంచిన‌ట్లు స‌మాచారం.

ప్రాటెం స్పీక‌ర్‌గా ఆ ముగ్గురులో ఒక‌రు..
ఇక‌, కొత్త‌గా శాన‌స‌భ కొలువు తీరాల్సి ఉంది. దీని కోసం ఈ రోజు సాయంత్రం అధికారిక గ‌జెట్ విడుద‌ల కానుంది. దీంతో.. కొత్త శాస‌న‌స‌భ జూన్ మొద‌టి వారంలో కొలువు తీర‌నుంది. ఇందు కోసం శ‌నివారం జ‌గ‌న్ హైద‌రాబాద్ వెళ్లి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌తో స‌మావేశం కానున్నారు. ఆ స‌మ‌యంలో తొలి వారంలో అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణ గురించి నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఇక‌, జూన్ 1న ప్రొటెం స్పీక‌ర్ ఎన్నిక నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు.

సీనియ‌ర్ ఎమ్మెల్యే ప్రొటెం స్పీక‌ర్‌గా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌మాణ స్వీకారం చేయిస్తారు. ఆ త‌రువాత అదే ప్రొటెం స్పీక‌ర్ ఎమ్మెల్యేల‌తో ప్ర‌మాణ స్వీకారం స‌భ‌లో చేయిస్తారు. ఈ సారి స‌భ‌లో ప్రొటెం స్పీక‌ర్‌గా ముగ్గురికి అవ‌కాశం ఉంది. వారిలో కాటసాని రాం భూపాల్ రెడ్డి, ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వీరిలో ఒక‌రిని జ‌గ‌న్ ఎంపిక చేసే అవ‌కాశం ఉంది.

English summary
AP becoming CM Jagan Decided to give chance for nine members in cabinet along with him on 30th of this month. Jagan decided names and also thinking about Assembly sessions in june first week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X