వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పీకర్ తమ్మినేనికి అవమానం..మనస్థాపం: కుటుంబ సభ్యుల ఆవేదన: ప్రోటోకాల్ తుంగలోతొక్కి.!

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు అవమానం జరిగింది. ప్రోటోకాల్ నిబంధనలను తుంగలో తొక్కి తన గౌరవ మర్యాదలకు విలువ ఇవ్వకపోవటం పైన ఆయన మనస్థాపానికి గురయ్యారు. స్పీకర్ తమ్మినేని డెహ్రాడున్ లో జరిగిన స్పీకర్ల సదస్సుకు హాజరయ్యారు. అక్కడి నుండి ఏపీకి వచ్చేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన సతీసమేతంగా ఢిల్లీలోని ఏపీ భవన్ కు చేరుకున్నారు. ఆయనకు అక్కడ స్వర్ణముఖి బ్లాక్ లోని 320 గెస్ట్ రూమ్ ను కేటాయించారు. అంత వరకు బాగానే ఉంది.

ఇక, తిరుగు ప్రయాణమయ్యేందుకు సిద్దం అవుతున్న సమయంలో ఏపీ భవన్ ఉద్యోగి ఒకరు ఆయన వద్దకు వచ్చారు. ఆ ఉద్యోగి అడిగిన విషయం విని..ఒక్కసారిగా స్పీకర్ విస్తుపోయారు. ఆయన సతీమణి సైతం ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తితో వ్యవహరించే తీరు పైన ప్రభుత్వం సమాచారం కోరినట్లు తెలుస్తోంది. దీని పైన స్పీకర్ సైతం మనస్థాపానికి గురైనట్లు సమాచారం.

ఏపీ భవన్ లో అవమానం..
ఏపీ శాసనసభాపతి హోదాలో ఉన్న తమ్మినేని సీతారాంకు ఊహించని పరిణామం ఎదురైంది. సతీసమేతంగా ఏపీ భవన్ కు వచ్చిన స్పీకర్ తిరిగి..బయల్దేరే సమయంలో ఏపీ భవన్ ఉద్యోగి వచ్చి ఆయనకు అందించిన భోజన..వసతి బిల్లు కట్టమన్నారూ అంటూ పుస్తకం మీద సంతకం చేయాలని కోరారు. రాష్ట్ర అతిధి హోదాలో ఉన్న తనను బిల్లు అడగటంతో ఒక్కసారిగా స్పీకర్ విస్తుపోయారు.

ఆయనకు కేటగిరీ-1 కింద విడిది ఇచ్చారని..ఏపీ సచివాలయం నుండి స్టేట్ గెస్ట్ గా కాకుండా..కేటగిరీ-1లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారని ఏపీ భవన్ సిబ్బంది వివరించారు. దీని వలనే బిల్లు చెల్లించాల్సి వస్తుందని..అది అమరావతి సచివాలయంలోనే జీఏడీ నుండి జరిగిన పొరపాటు అని చెప్పినట్లు తెలుస్తోంది. ఇది..స్పీకర్ స్థాయిలో ఉన్న తమ్మినేనిని అవమానించటమేనంటూ వ్యాఖ్యలు మొదలయ్యాయి.

AP Bhavan staff insulted Speaker Tammineni against protocol rules

అవమానమే..బిల్లు చెల్లించండి..
దీంతో స్పీకర్ సైతం తీవ్రంగానే స్పందించారు. ముందు బిల్లు చెల్లించేయండి..తర్వాత సంగతి నేను చూసుకుంటా అంటూ తన వ్యక్తిగత సిబ్బందికి సూచన చేసారు. ఆ సమయంలో స్పీకర్ సతీమణి సైతం ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. డబ్బు ఎంతైనా ముందు ఇచ్చేద్దామని.. తమకు అవమానం జరిగిందని బాధపడినట్లుగా సమాచారం. స్పీకర్ గా అక్కడి అధికారులు గౌరవించలేదని ఆవేదనకు గురయ్యారని చెబుతున్నారు.

దీని పైన ఆ తరువాత ఏపీ భవన్ అధికారులు తేరుకున్నారు. ఈ వ్యవహారం పైన ఏపీ భవన్ అధికారులు ఆలస్యంగా తేరుకున్నారు. స్పీకర్ తమకు స్టేట్ గెస్ట్ అని..ఆయన విడిది ఉన్నందుకు బిల్లు వసూలు చేయాలనుకోవటం తప్పేనని ఏపీ భవన్ అధికారులు ఆ తరువాత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. అయితే, దీని పైన స్పీకర మాత్రం ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీని పైన జీఏడీ అధికారులను వివరణ కోరే అవకాశం ఉంది.

English summary
AP Bhavan staff insulted speaker Tammineni while he stay as state guest collected charges from him. Speaker and his family felt as insult to them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X