• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోడలి మరణం తర్వాత తొలిసారి కన్నా.. సుహారిక పోస్ట్‌మార్టం రిపోర్టులో ఏం తేలిందంటే..

|

చిన్న కోడలు సుహారిక ఆకస్మిక మృతితో విషాదంలో కూరుకుపోయిన ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తిరిగి ఆదివారం నుంచి రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంపై ఆయన స్పందించారు. ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాలు చేయాలని వైసీపీ సర్కారు భావిస్తోన్నవేళ.. కన్నా కీలక సూచన చేశారు.

"ఏపీ ప్రభుత్వానికి నేనిచ్చే గట్టి సలహా ఏంటంటే... హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకాన్ని అంగీకరించాలి. ఈ వివాదాన్ని మరింత పెద్దది చేస్తే దాని వల్ల జాతీయ స్థాయిలో ఏపీకి ఉన్న మంచి పాడవుతుంది. అంతేకాదు, న్యాయవ్యవస్థకు ఉన్న గౌరవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తగ్గించిటనట్లు అవుతుంది''అంటూ కన్నా ట్వీట్ చేశారు.

నిమ్మగడ్డ పునర్నియామకం జరిగినట్లే.. సుమోటోగా విజయసాయిని దించేసిన జగన్.. టీడీపీ దాడి..

ap bjp chief kanna laxminarayana back into business days after suharika death

ఇదిలా ఉంటే, కన్నా చిన్నకోడలు సుహారిక మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో శుక్రవారమే పోస్టుమార్టం చేయగా, అదే రోజు కుటుంబీకులు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పోస్టుమార్టం రిపోర్టులో సుహారిక మరణానికి గల కారణాలను స్పష్టంగా పేర్కొన్నారు. ఉస్మానియా ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో సుహారిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. శరీరంలో ఎలాంటి గాయాలు కనిపించదని, ఆమె గుండె పోటుతోనే మరణించారని ప్రాథమికంగా తేల్చినట్లు పోలీసులు తెలిపారు.

ap bjp chief kanna laxminarayana back into business days after suharika death
  Kanna Lakshmi Narayana’s daughter in law Lost Life

  సుహారిక మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని డాక్టర్లు నిర్ధారించిన తర్వాతే మృతదేహాన్ని బంధువులకు అప్పటించామని పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఫోరెన్సిక్ రిపోర్టు రావడానికి మరో 15 రోజుల సమయం పడుతుందని, ఆ తర్వాత కేసును క్లోజ్ చేసే అవకాశాలున్నట్లు తెలిపారు. భర్త కన్నా ఫణీంద్రతో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలోని హిల్‌రిట్జ్ విల్లాస్‌లో నివసించిన సుహారిక.. గురువారం మాదాపూర్ లో బంధువు పవన్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన పార్టీకి హాజరయ్యారు. స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేసిన కొద్దిసేపటికే ఆమె కుప్పకూలిపోయారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మరణించినట్లు డాక్టర్లు తేల్చారు. దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చివరికి ఎవరిపైనా అనుమానంలేదని తేల్చారు.

  English summary
  andhra pradesh bjp chief kanna laxminarayana back into political business days after his doughter in law suharika death. kanna suggests ap govt on nimmagadda issue. here is post mortem report of suharika
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X