వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీలోకి నటుడు రాజేంద్ర ప్రసాద్? -సోము వీర్రాజుతో భేటీ -నాడు చంద్రబాబుకు ముద్దు -జగన్‌పై రుసరుస

|
Google Oneindia TeluguNews

ఓవైపు తెలంగాణలో రోజురోజుకూ బలపడుతోన్న బీజేపీ.. గతేడాది నాలుగు లోక్ సభ సీట్లతో గెలుపు ట్రాక్ పట్టి, ఈ మధ్యే దుబ్బాక అసెంబ్లీ బైపోల్, తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటుకుంది. ఈ పరిణామాలు ఏపీ బీజేపీపై ఒత్తిడి పెంచాయి. అయితే తెలంగాణ ఫలితాల ఉత్సాహంతో ఏపీలోనూ బీజేపీ దూకుడు పెంచుతోందని, కేడర్ లో కొత్స ఉత్సహం కనిపిస్తోందని, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో అధికార వైసీపీని గట్టిగా ఢీకొడతామని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. కానీ, రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదా అంశాల్లో బీజేపీ పట్ల ఏపీలో నెలకొన్న పొలిటికల్ నెరేషన్ మార్చడం అంత సులువైనదేమీ కాదు. దీంతో క్రమంగా బలాన్ని పెంచుకునే దిశగా నాయకత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే..

షాకింగ్:లేడీ పోలీస్‌పై సీఐ రేప్ -మళ్లీ రావాలంటూ బలవంతం -యోగి సంచలన ఆదేశాలిచ్చిన గంటల్లోనే..షాకింగ్:లేడీ పోలీస్‌పై సీఐ రేప్ -మళ్లీ రావాలంటూ బలవంతం -యోగి సంచలన ఆదేశాలిచ్చిన గంటల్లోనే..

రాజేంద్ర ప్రసాద్ ఇంటికి సోము..

రాజేంద్ర ప్రసాద్ ఇంటికి సోము..

గ్రేటర్ ఎన్నికల సమయంలో ప్రచారానికి దూరంగా ఉండిపోయిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సోమవారం హైదరాబాద్ వచ్చారు. నేరుగా ఫిలింనగర్ వెళ్లి.. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ ను కలిశారు. సోమును సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించిన రాజేంద్రప్రసాద్.. బీజేపీ నేతకు శాలువా కప్పి సత్కరించారు. టాలీవుడ్ కే చెందిన సీనియర్ నటి హేమ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. దీనిపై..

దుబ్బాక,గ్రేటర్: ఒత్తిడిలో ఏపీ బీజేపీ -తిరుపతిలో జగన్‌కు చుక్కలే -నిమ్మగడ్డపైనా సోము వీర్రాజు ఫైర్దుబ్బాక,గ్రేటర్: ఒత్తిడిలో ఏపీ బీజేపీ -తిరుపతిలో జగన్‌కు చుక్కలే -నిమ్మగడ్డపైనా సోము వీర్రాజు ఫైర్

సేవల పట్ల సంతోషం..

సేవల పట్ల సంతోషం..

రాజేంద్ర ప్రసాద్ తో భేటీకి సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేస్తూ ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఇలా రాసుకొచ్చారు.. ‘‘ప్రముఖ హాస్య నటుడు, సోదర సమానులు డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు, తెలుగు ప్రజలకు ఆయన అందిస్తున్న సేవల పట్ల మర్యాదపూర్వక కలయికలో అభినందించడం జరిగింది'' అని పేర్కొన్నారు. పైకి మర్యాద పూర్వక భేటీ అంటున్నప్పటికీ, రాజేంద్ర ప్రసాద్ -వైసీపీల మధ్య విభేదాలు, టీడీపీ చీఫ్ చంద్రబాబుతో ఆయన దగ్గరితనం తదితర అంశాల నేపథ్యంలో దీన్నొక రాజకీయ పరిణామంగానే చూడాలని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే..

వేదికపై చంద్రబాబుకు ముద్దు..

వేదికపై చంద్రబాబుకు ముద్దు..

రాజేంద్ర ప్రసాద్ పూర్తి పేరు గద్దె రాజేంద్ర ప్రసాద్. కృష్ణా జిల్లా గుడివాడకు దగ్గర్లోని దొండపాడుకు చెందిన ఆయనకు సీనియర్ ఎన్టీఆర్ తో గాఢమైన అనుబంధముంది. పెద్దాయన చలవతోనే సినిమాల్లోకి వచ్చిన రాజేంద్రప్రసాద్ తర్వాతి కాలంలో తనకంటూ గొప్ప ఇమేజ్ సాధించుకున్నారు. కామెడీ సినిమాలకు ఆదరణ తగ్గడం, వయసు మీదపడటంతో నటకిరీటి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ తో అనుబంధం నేపథ్యంలో టీడీపీ పట్ల తన అభిమానాన్ని ఏనాడూ దాచుకోని ఆయన.. చంద్రబాబుతోనూ సన్నిహితంగా మెలిగారు. 2017లో టీడీపీ సర్కార్ నిర్వహించిన ఉగాది వేడుకకు హాజరైన రాజేంద్ర ప్రసాద్.. వేదికమీదే చంద్రబాబుకు ముద్దు పెట్టి.. దేశంలోనే నదుల అనుసంధానం చేసిన మగాడు చంద్రబాబని కితాబిచ్చారు. అయితే, జగన్ సీఎం అయ్యాక..

జగన్ సీఎం అయితే వెంటనే కలవాలా?

జగన్ సీఎం అయితే వెంటనే కలవాలా?

2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయి, జగన్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే వైసీపీ శ్రేణులకు నటుడు రాజేంద్ర ప్రసాద్ టార్గెట్ అయ్యారు. జగన్ ను అభినందించడానికి టాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా వెళ్లక పోవడంపై మీడియా అడిగిన ప్రశ్నకు... ‘‘ఏం, జగన్ సీఎం అయితే వెంటనే వెళ్లి కలవాలా? పరుగెత్తి కలవడానికి మేం పెట్టుబడిదారులం కాదే''అని రాజేంద్రప్రసాద్ సమాధానమివ్వడంతో వివాదం రాజుకుంది. నట కిరీటి వ్యాఖ్యలపై వైసీపీ నేత, అప్పటి ఎస్వీబీసీ చైర్మన్ ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ' ఫృథ్వీరాజ్ మాట్లాడుతూ.. జగన్ సీఎం కావడం టాలీవుడ్ లో ఎవరికీ ఇష్టం లేదని, అలాగని అవమానించేలా మాట్లాడితే తాట తీస్తామని హెచ్చరించారు. కేసీఆర్ రెండో సారి గెలిచినప్పుడు వెళ్లి బొకే ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్.. నిజంగా ఇష్టంలేకనే జగన్ ను కలవలేదని ఫృథ్వీ వ్యాఖ్యానించారు. దీనిపై సొంత పార్టీలోనూ ఆయనపై విమర్శలు వచ్చాయి. తాజాగా..

ఏపీలోనూ బీజేపీకి సినీ గ్లామర్..

ఏపీలోనూ బీజేపీకి సినీ గ్లామర్..


కరోనా పరిస్థితుల్లో సినీ రంగాన్ని ఆదుకునేలా ప్రభుత్వం నుంచి సహకారం కోరుతూ టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన సందర్భంలోనూ రాజేంద్ర ప్రసాద్ ఆ భేటీకి దూరంగా ఉండిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పరాజయం తర్వాత చంద్రబాబును కూడా ప్రసాద్ కలవలేదు. కాగా, దేశవ్యాప్తంగా సినీ నటులను పార్టీలోకి చేర్చుకోవడంపై బీజేపీ తొలి నుంచీ ఫోకస్ గా వ్యవహరిస్తున్నది. తమిళనాడులో ఖుష్బూను నేరుగా, రజనీకాంత్ ను పరోక్షంగా తమవైపు తిప్పుకున్న కమలనాథులు, కొన్ని గంటల కిందట ఇదే టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటి, తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత విజయశాంతిని పార్టీలోకి చేర్చుకున్నారు. ఏపీలోనూ ఇదే తరహా స్ట్రాటజీని అమలు చేయడంలో భాగంగానే రాజేంద్ర ప్రసాద్ ను సోమువీర్రాజు కలిసినట్లు తెలుస్తోంది. కొసమెరుపు ఏంటంటే, జగన్ అంటే ఎంతో ఇష్టమని గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలిపిన నటి హేమ.. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజును వెంటపెట్టుకుని రాజేంద్రప్రసాద్ ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఇద్దరూ బీజేపీలో చేరడంపై ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

English summary
eyeing on party expansion, bjp andhra pradesh president somu veerraju meets tollywood senior actor rajendra prasad on monday. rajendra prasad, once closer to tdp chief chandrababu and critic of ysrcp chief ys jagan, now likely to join bjp. cm jagan's loyalist actor hema also participated in somu-rajendra prasad meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X