విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు బీజేపీ అనూహ్య సవాల్ -చర్చిల నుంచి వసూళ్లు -సోము వీర్రాజు సంచలనం -పవన్ ఫ్యాక్టర్

|
Google Oneindia TeluguNews

వీలైన ప్రతిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రిస్టియానిటీని వేలెత్తి చూపుతూ, వైసీపీ పాలనలో హిందూ ఆలయాలకు దుర్గతి పట్టిందనే బీజేపీ తాజాగా ఏపీ సర్కారుకు అనూహ్య సలవాలు విసిరింది. ఏపీలో ఉద్దేశపూర్వకంగా ఆలయాలను కూల్చుతూ, చర్చిలు, మసీదులకు ఆర్థిక వసతులు కల్పిస్తున్నారని ఆరోపించింది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, మద్దతు మాటలు తప్ప ఇన్నాళ్లూ అమరావతి ఉద్యమానికి దూరంగా ఉండిపోయిన బీజేపీ ఇక కార్యక్షేత్రంలోకి దిగబోతున్నట్లు కూడా సోము స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే..

Recommended Video

కూల్చిన ఆలయాల నిర్మాణం చేపట్టాలని ప్రకాశం బ్యారేజ్ వద్ద బీజేపీ ధర్నా!

వైసీపీ ఇన్నాళ్లూ బాధపడింది చాలు -రెట్టింపు ఉత్సాహంతో వస్తున్నా -ముంబై ఆస్పత్రి నుంచి ఎంపీ రఘురామ డిశ్చార్జ్వైసీపీ ఇన్నాళ్లూ బాధపడింది చాలు -రెట్టింపు ఉత్సాహంతో వస్తున్నా -ముంబై ఆస్పత్రి నుంచి ఎంపీ రఘురామ డిశ్చార్జ్

విజయవాడలో బీజేపీ ధర్నా..

విజయవాడలో బీజేపీ ధర్నా..

నాలుగేళ్ల కిందట కృష్ణా పుష్కరాల సమయంలో చంద్రబాబు సర్కారు భారీ ఎత్తున కూలగొట్టిన ఆలయాలను ఇప్పుడైనా నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నిరసనలకు దిగింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజి సమీపంలో శనీశ్వర ఆలయం వద్ద బీజేపీ కార్యకర్తలు బుధవారం ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు కూడా పాల్గొన్నారు. ధర్నాను ఉద్దేశించి మాట్లాుడూత వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ తీరుపై సోము సంచలన ఆరోపణలు, విమర్శలు చేశారు.

జగన్‌కు హిందూత్వపై గౌరవం లేదు

జగన్‌కు హిందూత్వపై గౌరవం లేదు

‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హిందూ సంప్రదాయలపై నమ్మకంగానీ, గౌరవంకానీ లేనేలేదు. క్రైస్తవ చర్చిలు, ముస్లింల దర్గాలకు కోటాను కోట్ల రూపాయాలు కేటాయిస్తున్నారు. ప్రజాధనంగా భావించే ప్రభుత్వ నిధుల నుంచి చర్చిల నిర్మాణాలకు రూ.24కోట్లు, దర్గాల రిపేర్లకు రూ.5 కోట్లు ఇచ్చారు. ఇది ఏరకంగా సమ్మతమో తెలీదు. అదే హిందూ ఆలయాల దగ్గరికొచ్చేసరికి జగన్ సర్కారు అతి దారుణంగా, నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ తీరు ఆందోళనకరంగా ఉంది..

 చర్చిల నుంచి వసూళ్లు చేస్తారా?

చర్చిల నుంచి వసూళ్లు చేస్తారా?

దేవాదాయ శాఖ పరిధిలో అనేక ఆలయాలు జీర్ణావస్థలో ఉన్నాయి. చంద్రబాబు హయాంలో కూలగొట్టిన ఆలయాలను నిర్మించాలని ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా జగన్ పట్టించుకోవట్లేదు. దేవాదాయ భూములను ఇళ్ల కోసం, నిధులను ఇతర కార్యక్రమం కోసం వాడుకుంటున్నారే.. మరి ఆలయాలను మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రభుత్వ సొమ్ముతో చర్చిలు, దర్గాలను కట్టిస్తామంటారా? ఏపీలో చాలా క్రైస్తవ చర్చిలకు కొన్ని వేల కోట్ల ఆదాయం వస్తోంది. జగన్ కు దమ్ముంటే ఆ బడా చర్చిల నుంచి డబ్బులు తీసుకుని, వాటినే ఖర్చు చేయాలని బీజేపీ సవాలు చేస్తోంది. ఏం? ముఖ్యమంత్రికి చర్చిలు, మసీదులే కావాలా.. ఆలయాల అభివృద్ధి అక్కర్లేదా?

వెల్లంపల్లి పిల్లి మొగ్గలు..

వెల్లంపల్లి పిల్లి మొగ్గలు..

హిందూ ఆలయాల పరిక్షణ, అభివృద్ధిని ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ పూర్తిగా వదిలేసింది. ప్రస్తుతం ఆ శాఖకు మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఒకప్పుడు బీజేపీ కార్యకర్త. చంద్రబాబు హయాంలో పుష్కరాల పేరిట ఆలయాలను పగగొట్టిన సమయంలో ఇదే వెల్లపల్లి.. ఆలయాల పున:నిర్మాణం కోసం ఆందోళనలు చేశాడు. ఇప్పుడు దేవాదాయ మంత్రిగా ఉండి కూడా ఆలయాలకు ఏమీ చేయకపోగా.. మసీదులు, దర్గాలకు డబ్బులు ఇస్తున్నాడు. ఇందుకుగానూ మంత్రి వెల్లంపల్లి తన పదవికి రాజీనామా చేయాలి'' అని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. మరోవైపు..

 ఇక ఉద్యమంలోకి బీజేపీ..

ఇక ఉద్యమంలోకి బీజేపీ..

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ రైతులు చేస్తోన్న నిరసనలు ఏడాది(365రోజులు) పూర్తికానున్న సందర్భంగా.. మోదీ శంకుస్థాపన చేసిన ఉద్ధండరాయునిపాలెంలో అమరావతి జేఏసీ గురువారం(17న) భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసింది. ఇన్నాళ్లూ అమరావతి ఉద్యమానికి మాటలతోనే మద్దతు ఇచ్చిన బీజేపీ ఇక నేరుగా కార్యక్షేత్రంలోకి దిగుతుందనే సంకేతంగా.. అమరావతి సభలో బీజేపీ ప్రజాప్రతినిధులు పాల్గొంటారని సోము వీర్రాజు ప్రకటించారు. రాజధాని విషయంలో కేంద్రం ఒకలా, దాన్ని నడిపించే బీజేపీ మరోలా వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతోన్న నేపథ్యంలో నేరుగా ఉద్యమంలో పాల్గొనాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

 పవన్ ఫ్యాక్టర్ -సోము యాక్షన్ ప్లాన్

పవన్ ఫ్యాక్టర్ -సోము యాక్షన్ ప్లాన్

అమరావతిపై పార్టీ లైన్ మీరారంటూ కొందరిని సస్పెండ్ చేశారు ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు. అయినా సరే ప్రజల్లో క్రెడిట్ పొందలేకపోయారు. రాజధాని విషయంలో బీజేపీ డబుల్‌ గేమ్‌ ఆడుతోందన్న విమర్శలకు సమాధానం చెప్పడం మంచిదని, అమరావతి ఉద్యమంలో నేరుగా పాల్గొంటేనే బెటరని జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దలను కన్విన్స్ చేశారని, హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే రాజధాని ఉద్యమంలో బీజేపీ యాక్షన్ ప్లాన్ ను సోము వీర్రాజు సిద్ధం చేశారని వార్తలు వస్తున్నాయి. ఉద్యమ కార్యాచారణలో తొలి అడుగుగానే గురువారం నాటి అమరావతి సభకు బీజేపీ ప్రజాప్రతినిధులను పంపుతున్నాట్లు తెలుస్తోంది.

జగన్‌కు కేశినేని శ్వేత వార్నింగ్ -సునామీని తట్టుకోగలరా? -సీఎం ఇంట్లో సూట్ కేసులు -అమరావతి పోరుజగన్‌కు కేశినేని శ్వేత వార్నింగ్ -సునామీని తట్టుకోగలరా? -సీఎం ఇంట్లో సూట్ కేసులు -అమరావతి పోరు

English summary
bjp andhra pradesh chief somu veerraju made sensational comments against ysrcp govt and cm jagan regarding hindu temples. bjp staged dharna at vijayawada on wednesday for re construction of temples. somu also demands endowments minister vellampalli srinivas resignation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X