వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైనారిటీలే కావాలనుకుంటే బెంగళూరు తరహా ఘటనలు- జగన్ సర్కారుకు సోము హెచ్చరికలు...

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలను గతంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ మతం కోణంలో విమర్శించేవారు. ఆ తర్వాత ఆయన స్ధానంలో పగ్గాలు చేపట్టి సోము వీర్రాజు కూడా ఆయన బాటలోనే పయనిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న పలు నిర్ణయాలు మైనారిటీలను సంతృప్తి పరిచేలా ఉన్నాయంటూ సోము తాజాగా చేసిన ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. మెజారిటీ వర్గాన్ని వదిలిపెట్టి మైనారిటీలే కావాలనుకుంటే బెంగళూరు తరహా ఘటనలే జరుగుతాయంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో సోము ట్వీట్లు చర్చనీయాంశమవుతున్నాయి.

సోము సమర శంఖారావం...

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా తాజాగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు జగన్ సర్కార్‌పై పోరు ప్రారంభించేశారు. అదీ తన మార్కు పంచ్‌ డైలాగులతో. తాజాగా ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను మతం కోణంలో టార్గెట్ చేస్తూ సోము వీర్రాజు ఇవాళ పలు ట్వీట్లు పెట్టారు. అలాగే కాంగ్రెస్ పార్టీని గుర్తు చేస్తూ జగన్ ను ఇరుకునపెట్టేందుకు ప్రయత్నించారు. ఆరెస్సెస్ నేపథ్యం ఉన్నప్పటికీ, బీజేపీలో కొన్నేళ్లుగా క్రియాశీలకంగా ఉన్నప్పటికీ గతంలో ఎన్నడూ సోము వీర్రాజు ఈ స్ధాయిలో మతం కోణంలో విమర్శలు చేయలేదు. దీంతో సోము తాజా ట్వీట్లు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.

అసలు నేపథ్యం ఇదీ...

2018లో పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌పై కొందరు ముస్లిం యువకులు దాడికి పాల్పడ్డారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా కొందరు ముస్లిం యువకులను అక్రమ కేసుల్లో నిర్బంధించిన కారణంగా వారు దాడి చేయడంపై అప్పట్లో టీడీపీ సర్కారు వీరిపై కేసులు పెట్టింది. ఈ కేసుల దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ తాజాగా జగన్ సర్కారు ఈ కేసులను ఉపసంహరించుకుంటూ హోంశాఖతో ఉత్తర్వులు ఇప్పించింది. అప్పట్లో ఈ ఘటనలో పాల్గొన్న యువకులపై నమోదైన కేసులన్నింటినీ వెనక్కి తీసుకుంటున్నట్లు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ తాజాగా జీవో జారీ చేశారు. దీనిపై సోము వీర్రాజు మండిపడ్డారు.

మైనారిటీ మనోభావాలు గౌరవిస్తే చాలా ?


ప్రజాస్వామ్యంలో చట్టం ముందు ఎంతటివారైనా తప్పుచేస్తే శిక్షించబడాలన్న న్యాయాన్ని ఆవహేళనచేస్తూ ఒకప్పుడు గుంటూరులో పోలీస్ స్టేషన్ పై దాడిచేసిన నిందితులపై పెట్టబడిన కేసులను ఎత్తివేస్తూ సంఘవిద్రోహ శక్తులకు మరిన్నిఅవకాశాలను కల్పించటం ఈ రాష్ట్ర ప్రభుత్వ అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం అంటూ సోము ఇవాళ ట్వీట్ చేశారు. అంత కాదు రాష్ట్ర ప్రభుత్వం కేవలం కొంతమంది మనోభావాలను మాత్రమే గౌరవిస్తే చాలనుకుంటే దాని పరిణామం భవిష్యత్తు లో అనేకమంది మనోభావాలను, వారి ఆత్మస్తేర్ధ్యాన్ని దెబ్బతీస్తుందనటం లో ఏమాత్రం సందేహం అవసరం లేదంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

బెంగళూరు ఘటనలే ఎదురవుతాయంటూ...

బెంగళూరు ఘటనలే ఎదురవుతాయంటూ...

పాత గుంటూరు పోలీస్‌ స్టేషన్‌పై దాడి కేసుల ఉపసంహరణ భవిష్యత్తులో విపరిణామాలకు దారి తీస్తుందంటూ జగన్ సర్కారును సోము వీర్రాజు హెచ్చరించారు. ఇది పూర్వ కాంగ్రెస్ కుటిల రాజకీయాలను తలపిస్తుంది..ఇది చాలా దురదృష్టకరం.. ఇటువంటి నిర్ణయాలు బెంగుళూరు నగరంలో జరిగిన దాడుల వంటి దురదృష్టకర సంఘటనలు మన రాష్ట్రం లో మరిన్ని జరిగే అవకాశాలను పెంచుతున్నాయి అంటూ సోము చేసిన ట్వీట్‌ జగన్ సర్కారుకు మంట పుట్టించేలా ఉంది. జగన్ బద్ధ శత్రువైన కాంగ్రెస్‌ పార్టీతో పోలుస్తూ, గుంటూరు కేసులకు బెంగళూరులో తాజాగా జరిగిన మతపరమైన దాడులకు లింక్ చేస్తూ చేసిన విమర్శలు జగన్ సర్కారును తీవ్రంగా ఇరుకున పెట్టాయని చెప్పవచ్చు.

English summary
andhra pradesh bjp state president somu veerraju seems to be target ruling ysrcp government with communal factor and congress like regime. somu links jagan govt's decisions with communal issues and previous congress rule.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X