ఇక ఏపీ వంతు-పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాల్సిందే- బీజేపీ సోము వీర్రాజు డిమాండ్
దేశవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిన్న నిర్ణయం తీసుకుంది. దీని ప్రభావంతో పెట్రోల్ పై ఐదురూపాయలు, డీజిల్ పై ఏడు రూపాయల వరకూ కనీస తగ్గింపు అమల్లోకి వచ్చేసింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్ని వ్యాట్ ను కూడా తగ్గించాలని సూచించింది. తద్వారా వినియోగదారులకు మరింత ఊరట దక్కుతుందని భావించింది.

కేంద్రం సూచన మేరకు బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ వ్యాట్ ను తగ్గిస్తూ ప్రకటనలు చేస్తున్నాయి. గరిష్టంగా యూపీలో లీటరుకు రూ.12 వరకూ చమురు ధరలు తగ్గాయి. హిమాచల్ ప్రదేశ్ లో కనీసం రూ.2 రూపాయలు తగ్గింది. అలాగే బీహార్ వంటి బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతున్న సంకీర్ణ ప్రభుత్వాలు కూడా వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయాలు ప్రకటిస్తున్నాయి. కానీ ఏపీ, తెలంగాణతో పాటు బీజేపీయేతర పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు మాత్రం మౌనంగా ఉన్నాయి. దీంతో బీజేపీ ఇప్పుడు వారిని నిలదీసే పనిలో బిజీగా కనిపిస్తోంది.

కేంద్రం
ఎక్సైజ్
సుంకాన్ని
తగ్గించిన
నేపథ్యంలో
ఏపీలోని
వైసీపీ
సర్కార్
కూడా
వ్యాట్
తగ్గించాలని
బీజేపీ
నేతలు
డిమాండ్
చేస్తున్నారు.
బీజేపీ
పాలిత
రాష్ట్రాలు
కూడా
పెట్రోల్,
డీజిల్
పై
వ్యాట్
తగ్గించిన
విషయాన్ని
బీజేపీ
నేతలు
గుర్తు
చేస్తున్నారు.కేంద్ర
ప్రభుత్వం
పెట్రోలు,
డీజిల్
మీద
తగ్గించిన
₹5
&
₹10
కు
అదనంగా
అస్సాం,
త్రిపుర,
గోవా,
మణిపూర్,
కర్ణాటక,
గుజరాత్
రాష్ట్రాలు
పెట్రోలు,
డీజిల్
రెండింటిపైన
₹7
లు
వ్యాట్
ను
తగ్గించాయి.
అంటే
పెట్రోలు
₹12,
డీజిల్
₹17
తగ్గింది.
జగన్మోహన్
రెడ్డి
గారి
ప్రభుత్వం
కూడా
పెట్రోల్,
డీజిల్
రేట్లను
తగ్గించి
ఈ
దీపావళి
నాడు
ఆంధ్రప్రదేశ్
ప్రజలకు
అధిక
ధరల
నుండి
ఉపశమనం
కలిగించాలని
బీజేపీ
రాష్ట్ర
అధ్యక్షుడు
సోము
వీర్రాజు
డిమాండ్
చేశారు.