వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడివాడ బయల్దేరిన బీజేపీ నేతల అరెస్ట్-క్యాసినోలకేనా సంక్రాంతికి అనుమతివ్వరా అంటూ సెటైర్లు

|
Google Oneindia TeluguNews

ఏపీలో క్యాసినో రాజకీయాలు జోరుగా సాగుతున్న వేళ గుడివాడ టూర్ కు ఏపీ బీజేపీ నేతలు ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతలకు దారితీసింది. గుడివాడలో సంక్రాంతి సంబరాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ నేతలు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలోనే వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు రాష్ట్ర కార్యదర్శులు నాగోతు రమేష్ నాయుడు ,భూపతి రాజు శ్రీ నివాస వర్మ, ఇతర నేతలు ఉన్నారు.

విజయవాడ నుంచి గుడివాడకు బయలుదేరిన బీజేపీ బృందంం సంక్రాంతి సంబరాల ముగింపుకు అక్కడికి వెళ్తున్నట్లు ప్రకటించింది. అయితే సంక్రాంతి ముగింపు ఉత్సవాలకు అనుమతి లేదంటూ.. కళ్యాణ మండపంపై పోలీసులు ఆంక్షలు పెట్టారు. దీంతో బీజేపీ నేతలు గుడివాడలో తాజాగా జరిగిన కేసినో ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సోము వీర్రాజుతో పాటు ఇతర నేతల్ని పోలీసులు అరెస్టు చేసి ఉంగుటూరు పీఎస్ కు తరలించారు.
ఎంపి సిఎం రమేష్ ,బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి లను తోటవల్లూరు పోలీసు స్టేషన్ కు తరలించారు.

ap bjp leaders arrested on the way to go for sankranti celebrations in gudivada

పోలీసులు తమను అరెస్టు చేసినా గుడివాడలో సంక్రాంతి ముగింపు సంబరాలు నిర్వహించి తీరుతామని సోమువీర్రాజు స్పష్టం చేశారు. హరిదాసులు, గంగిరెద్దులు, ధర్మం, సంస్కృతిని చూపిస్తామని ప్రకటించారు. సగం వస్త్రాలు కట్టుకున్న చీర్‌గార్ల్స్‌ను తీసుకురామని, గడ్డం వ్యక్తుల దగ్గర వారు అర్ధనగ్నంగా ఎగురుతున్నారని సోము ఆరోపించారు. ధర్మం అంటే గడ్డాలు పెంచుకోవడం, చేతులకు తాళ్లు కట్టుకోవడం కాదన్నారు. బట్టలు ఎలా ధరించాలో దేవుడికి కట్టే వస్త్రాలను చూసి నేర్చుకోండని సోమువీర్రాజు వైసీపీ నేతలకు సూచించారు. పొడుగ్గా ఉండే గడ్డం వ్యక్తికి ధర్మం అంటే భయమని, అందుకే గుడివాడ వస్తున్నామని సోమువీర్రాజు వ్యాఖ్యానించారు.

English summary
ap bjp leaders going to participate sankranti celebrations in gudivada were arrested today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X