వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు క్షమాపణ కోసం ఏపీ బీజేపీ డిమాండ్: నిన్నటి దాకా జగన్-పవన్ కళ్యాణ్‌లనూ లాగిన టీడీపీ!

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాఫెల్ ఒప్పందం విషయంలో కాంగ్రెస్ పార్టీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కూడా నిత్యం ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పైన విమర్శలు గుప్పించారు. రాఫెల్ ఒప్పందంలో భారీ కుంభకోణం జరిగిందని పలు సందర్భాల్లో ఆరోపణలు చేశారు.

<strong>'సుహాసినిని అలా దెబ్బతీసిన చంద్రబాబు, జూ.ఎన్టీఆర్ గుర్తించారు, ముందే చెప్పారు'</strong>'సుహాసినిని అలా దెబ్బతీసిన చంద్రబాబు, జూ.ఎన్టీఆర్ గుర్తించారు, ముందే చెప్పారు'

అంతేకాదు, ఈ కుంభకోణంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు ఎందుకు స్పందించడం లేదని నిలదీసిన సందర్భాలు ఎన్నో. చంద్రబాబుతో టీడీపీ నేతలు కూడా రాఫెల్ స్కాం అంటూ విమర్శలు గుప్పించారు. ఇది బీజేపీని ఇరుకున పడేసినట్లుగా భావించారు.

 చంద్రబాబుపై ఏపీ బీజేపీ నేతల ఆగ్రహం

చంద్రబాబుపై ఏపీ బీజేపీ నేతల ఆగ్రహం

కానీ, దేశ రాజకీయాల్లో వివాదాలకు కేంద్రబిందువుగా మారిన రాఫెల్ డీల్ పైన సుప్రీం కోర్టులో కేంద్రానికి శుక్రవారం ఊరట లభించిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌ నుంచి 36 రఫేల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న మోడీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఈ మేరకు రఫేల్‌ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, వీటిపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను తోసిపుచ్చింది. దీనిపై ఏపీ బీజేపీ నాయకురాలు గాయత్రి స్పందించారు. టీడీపీపై నిప్పులు చెరిగారు.

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్, హరీష్ రావు అభినందనలు (ఫోటోలు)

 స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు

స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు

రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భద్రత విషయంలో బీజేపీపై బురద జల్లిన కాంగ్రెస్ సహా విపక్షాలకు రాఫెల్‌ డీల్‌పై సుప్రీం తీర్పు చెంప దెబ్బ వంటిదని, తనపై కేసుల విచారణలు జరగకుండా స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు బీజేపీపై బురద జల్లినందుకు క్షమాపణ చెప్పాలని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి గాయత్రి డిమాండ్‌ చేశారు. బీజేపీకి అభివృద్ధి అంత్యోదయ మాత్రమే తెలుసని చెప్పారు.

అంతర్జాతీయ కుట్రలు చేయడంలో ఆరితేరారు

అంతర్జాతీయ కుట్రలు చేయడంలో ఆరితేరారు

పచ్చ కాంగ్రెస్ నాయకులు మాత్రం అంతర్జాతీయ కుట్రలు చేయడంలో ఆరితేరారని ఆరోపించారు. సుప్రీం కోర్టు రాఫెల్ డీల్ విషయంలో ఎలాంటి స్కాం జరగలేదని గాయత్రి చెప్పారు. ఈ మేరకు సుప్రీం కోర్టు తీర్పు చెబుతూ అన్ని పిటిషన్లను కొట్టివేసి దేశ భద్రత విషయంలో సన్నద్ధంగా ఉండవలసిందేనని సూచించిందని చెప్పారు.

మోడీ నిరూపించుకున్నారు

మోడీ నిరూపించుకున్నారు

నరేంద్ర మోడీ నిజాయితీపరుడని, ఈ దేశానికి కాపలాదారు అని మరోసారి నిరూపించుకున్నారని తేలిపోయిందని ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగభూషణం అన్నారు. రాఫెల్ డీల్ పైన విచారణకు సుప్రీం కోర్టు నిరాకరిస్తూ కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టివేయడం స్వాగతించదగిన పరిణామమని చెప్పారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ రాఫెల్ విమానాలకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు తీశాడని మండిపడ్డారు. కాంగ్రెస్ దేశ భద్రతను రాజకీయాల కోసం పణంగా పెడితే మోడీ నిజాయితీపరుడిగా దేశ కాపలాదారుగా మళ్లీ నిరూపించుకున్నారని చెప్పారు.

English summary
Andhra Pradesh BJP leaders demand apology from Andhra Pradesh Chief Minister Nara Chandrababu over Rafal deal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X