India
  • search
  • Live TV
కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీతో పొత్తుపై తేల్చేసిన బీజేపీ - పవన్ వాట్ నెక్స్ట్ : జగన్ ను ఎదుర్కోవాలంటే..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీలో తాము ఎవరితో కొనసాగుతామనే అంశం పైన రాష్ట్ర బీజేపీ నేతలు దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్ని జాతీయ నాయకత్వానికి సమాచారం ఇచ్చారు. ఏపీలో 2024 ఎలక్షన్ మూడ్ వచ్చేసింది. అన్ని పార్టీలే వచ్చే ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఇక, జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పైన బీజేపీ నేతలు అంతర్గతంగి చర్చలు చేసారు. పవన్ బీజేపీ తనకు జగన్ పైన పోరాటానికి రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పిందని వెల్లడించారు. దాని ఆధారంగానే తాను నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేసారు. జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా చూసే బాధ్యత తనదేనని తేల్చి చెప్పారు. ఇక, తాజాగా కర్నూలులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి.

టీడీపీతో పొత్తుపై వ్యతిరేకత

టీడీపీతో పొత్తుపై వ్యతిరేకత

అందులో కీలక నేతలు పవన్ వ్యాఖ్యలు..పరోక్షంగా టీడీపీతో పొత్తు సంకేతాల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పవన్ తో పొత్తు గురించి ఇబ్బంది లేదని.. జనసేన వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు అంశం ప్రతిపాదిస్తే పార్టీ వైఖరి ఏంటని పలువురు నేతలు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండదని పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు ఇన్‌చార్జ్‌లు సునీల్‌ దియోధర్, మధుకర్‌ సూచనప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కార్యవర్గ సమావేశాలకు 13 జిల్లాల పార్టీ అధ్యక్షులు..ఇన్ ఛార్జ్ లు..ముఖ్య నేతలు పాల్గొన్నారు. 2024 ఎన్నికల కోసం ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది ప్రధాన అజెండాగా నేతలు చర్చించారు. 2014 లో బీజేపీతో పొత్తు కారణంగానే చంద్రబాబు అధికారంలోకి వచ్చారనే అభిప్రాయ మెజార్టీ నేతలు వ్యక్తి చేసినట్లు తెలుస్తోంది.

జాతీయ నాయకత్వం సుముఖంగా లేదంటూ

జాతీయ నాయకత్వం సుముఖంగా లేదంటూ

జనసేన తో సైతం ఇదే విషయం పైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని డిసైడ్ అయ్యారు. ఆ తరువాత పవన్ తో బీజేపీతో కొనసాగుతారో... కాదని టీడీపీతో చేరుతారో తేల్చుకోవాల్సి ఉంటుందని నేతలు చెబుతున్నారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నందునా...ఇప్పటికిప్పుడే పొత్తుల పైన ఎవరూ బయట స్పందించాల్సిన అవసరం లేదని పార్టీ నేతలకు ముఖ్యులు సూచించారు. ఒంటరిగానే పార్టీ ఎదిగేలా నిర్ణయాలు ఉండాలని పలువురు జిల్లాల నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో పాటుగా.. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారు ఢిల్లీ కేంద్రంగా ఏపీ అంశానుల డిసైడ్ చేస్తున్నారని.. పార్టీ నాయకత్వం సైతం దీనిని గ్రహించాలని జిల్లాల అధ్యక్షుడు రాష్ట్ర ఇన్ ఛార్జ్ ను కోరారు.

AP Elections 2024 టీడీపీ -జనసేన కలిస్తే 160 సీట్లు BJP - TDP కలుస్తాయా ? | Oneindia Telugu
కీలకం కానున్న పవన్ నిర్ణయం

కీలకం కానున్న పవన్ నిర్ణయం

ఇక, ఏపీ బీజేపీ వైఖరి ఏంటనేది స్పష్టం కావటంతో..ఇదే విషయాన్ని పార్టీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ జాతీయ నాయకత్వానికి స్పష్టం చేస్తారని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. బీజేపీ కేంద్ర నాయకత్వం సైతం తిరిగి టీడీపీతో పొత్తు అంశం పైన సుముఖంగా లేదని ముఖ్య నేతలు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. దీంతో..ఇక, పవన్ ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటార..బీజేపీతో కంటిన్యూ అయి..ఈ రెండు పార్టీలే కలిసి పోటీ చేస్తాయా.. లేక, బీజేపీని కాదని.. టీడీపీకి దగ్గర అవుతతారా అనేది తేలాల్సి ఉంది. టీడీపీ సైతం ఇదే క్లారిటీ కోసం వెయిట్ చేస్తోంది.

English summary
AP BJP leaders disucssed on alliance with Janasena adn TDP for coming elections, experessed different opinions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X