వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్ సూపర్, అమరావతికి నిధులు ఎందుకు రాలేదంటే: బాబుకు మాణిక్యాలరావు కౌంటర్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Union Budget 2018 : బడ్జెట్ సూపర్, బాబుకు కౌంటర్

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి నిధులు ఇవ్వలేదని, పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన లేదన్న టీడీపీ నేతలకు ఏపీ మంత్రి మాణిక్యాల రావు శుక్రవారం గట్టి కౌంటర్ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల్లాగే ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, ఏపీని అవసరమైన సందర్భాల్లో ప్రత్యేకంగా చూస్తున్నామని ఆయన చెప్పారు.

ఆయన మాట్లాడుతూ.. డీపీఆర్ లేనందునే రాజధాని అమరావతికి నిధులు రాలేదని చెప్పారు. కేంద్ర బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని చెప్పారు. రాష్ట్రాలు వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు అని టీడీపీ నేతలు కొందరు చెప్పడం విడ్డూరమన్నారు. ఏపీకి అన్యాయం అనేది మిత్రపక్షంలోని కొందరి వాదన అన్నారు.

లక్ష్యం పెట్టుకున్నది మేమే

లక్ష్యం పెట్టుకున్నది మేమే

బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని మిత్రపక్షం అనడం లేదని, మిత్రపక్షంలోని కొందరు నేతలు అంటున్నారని మాణిక్యాల రావు అభిప్రాయపడ్డారు. వాళ్లు బడ్జెట్ రికార్డ్స్ చూడలేదని, అందుకే అలా అంటున్నారని చెప్పారు. పోలవరంకు సహకరిస్తామని నితిన్ గడ్కరీ స్పష్టంగా చెప్పారని తెలిపారు. నిధులు ఆలస్యం కావన్నారు. రెండేళ్లలో పోలవరం పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నదే తాము అన్నారు.

బడ్జెట్: నిన్న బాబు, నేడు పవన్ కళ్యాణ్ దెబ్బకు దిగొచ్చిన నరేంద్ర మోడీ?బడ్జెట్: నిన్న బాబు, నేడు పవన్ కళ్యాణ్ దెబ్బకు దిగొచ్చిన నరేంద్ర మోడీ?

రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది

రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది

బడ్జెట్ పైన పూర్తి స్పష్టత రావాల్సి ఉందని మాణిక్యాల రావు చెప్పారు. ఏపీని ప్రత్యేకంగా చూడటం లేదన్న టిడిపి నేతల విమర్శలపై స్పందిస్తూ.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏపీ ఉందని చెప్పారు. అందుకే రైతులను ఆదుకునే బడ్జెట్, 50 లక్షల కుటుంబాలకు హెల్త్ స్కీం ఉందని, అందులో ఏపీ కూడా ఉందని చెప్పారు.

బాబును తక్కువ అంచనా వేయొద్దు, అంతా పొగరు: మోడీపై టీజీ సంచలనం, తెగదెంపులు ఎప్పుడంటేబాబును తక్కువ అంచనా వేయొద్దు, అంతా పొగరు: మోడీపై టీజీ సంచలనం, తెగదెంపులు ఎప్పుడంటే

బడ్జెట్ పైన

బడ్జెట్ పైన

బడ్జెట్ పైన మరింత స్పష్టత రావాల్సి ఉందని, అలా వచ్చాక ఏపీకి ఎంత వచ్చిందో తెలుస్తుందని చెప్పారు. అయితే కొన్ని సందర్భాల్లో ఏపీని ప్రత్యేకంగా చూస్తున్నామని మాణిక్యాల రావు చెప్పారు. పోలవరంకు డబ్బులు, అమరావతికి డబ్బులు ఇచ్చామని, ఇవన్నీ అన్ని రాష్ట్రాలకు ఇచ్చారా అని ప్రశ్నించారు.

కొంతమంది ఇరిటేట్ అయ్యేవారు ఉంటారు

కొంతమంది ఇరిటేట్ అయ్యేవారు ఉంటారు

బడ్జెట్ బాగుందని తాము ప్రజల్లోకి వెళ్లి చెప్పగలమని మాణిక్యాల రావు ధీమా వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో అన్యాయం అనేది మిత్రపక్షాల వాదన కాదని, కొందరి వాదన అన్నారు. తాడోపేడే తోల్చుకుంటామని టీడీపీలోని కొందరు నేతలు అనడంపై స్పందిస్తూ.. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కొంతమంది న్యూస్ చూడగానే ఇరిటేట్ అయ్యేవారు ఉంటారని చెప్పారు.

English summary
Andhra Pradesh BJP minister Manikyala Rao counter to AP CM Chandrababu Naidu on Union Budget 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X