వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్‌సైడింగ్ ట్రేడింగ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు... చేతగాని తనమా.. కుమ్మక్కయ్యారా...? బీజేపీ కన్నా

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణం, అధికార వికేంద్రీకరణ పై తీసుకున్న నిర్ణయాలను బీజేపీ వ్యతిరేకిస్తుందా...లేక స్వాగతిస్తుందా అనేది స్పష్టం కాకుండా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని కొంతమంది పార్టీ నేతలు సమర్ధిస్తుంటే.. మరికొంతమంది మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ తీవ్రంగా వ్వతిరేంచారు. సీఎం మారినప్పుడల్లా రాజధాని మారుతుందా ...అంటూ ప్రశ్నించారు. ఈనేపథ్యంలోనే రాజధాని రైతుల తరుఫున బీజేపీ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.

అమరావతిపై సీఎం జగన్ ప్రకటనను వెనక్కి తీసుకోవాలి... కన్నా లక్ష్మినారాయణ అమరావతిపై సీఎం జగన్ ప్రకటనను వెనక్కి తీసుకోవాలి... కన్నా లక్ష్మినారాయణ

రాజధాని నిర్మాణంపై విపక్షాల నిర్ణయం అవసరం లేదా...

రాజధాని నిర్మాణంపై విపక్షాల నిర్ణయం అవసరం లేదా...

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఏర్పాటు, మారుతున్న పరిణామాలపై రాజీకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. దీంతో రాజధాని నిర్మాణంపై కమిటీ ఇచ్చిన నివేదిక, ముఖ్యమంత్రి నిర్ణయాలపై బీజేపీ వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలని కోరుకుంటుంది కాని, ఈ రకంగా రైతులను ఇబ్బందులు పెడితే... బీజేపీ చూస్తూ... ఊరుకోదని హెచ్చరించారు. మరోవైపు రాజధాని నిర్మాణంపై ఒక్క వైసీపీ మాత్రమే నిర్ణయం తీసుకుంటుందా అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణంలో ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన కోరారు.

సీఎం జగన్ అభద్రతా భావంతో ఉన్నారు

సీఎం జగన్ అభద్రతా భావంతో ఉన్నారు

150 సీట్లు పెట్టుకుని మొదటి నుండి అభద్రత భావంతో ముఖ్యమంత్రి సీఎం వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. కాగా చంద్రాబాబు నాయుడు, జగన్‌ల మధ్య ఉన్న ఎవైనా కక్షలు ఉంటే ఇద్దరు తేల్చుకోవాలని ,కాని రైతులపై వారి ప్రతాపాన్ని చూపించడం కరెక్టు కాదని అన్నారు. ఇక గత ఆరునెలలుగా జగన్ వ్యవహరశైలితో రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని ఆయన అన్నారు. దీంతో రానున్న రోజుల్లో కూడ రాష్ట్రం అభివృద్ది చెందే అవకాశాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వానివి చేతగాని మాటలు

ప్రభుత్వానివి చేతగాని మాటలు

రాజధాని నిర్మాణంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని ప్రచారం చేయడం ప్రభుత్వ చెతగాని తనానని నిదర్శమని విమర్శించారు. రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిందని చెబుతున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇన్‌సైడింగ్ ట్రేడింగ్‌పై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందా..లేక వారితో కాంప్రమైజ్ అయిందా అన్నారు. ఆరునెలల్లో చర్యలు తీసుకోకుండా ఇన్‌సైడింగ్ ట్రేడింగ్ జరిగిందనడం ప్రభుత్వ చేతగాని తనమని విమర్శించారు. దాన్ని చూపించి పబ్బం గడుపుకోవడానికి చూస్తే...బీజేపీ చూస్తూ...ఊరుకోదని హెచ్చరించారు.

English summary
BJP state president Lakshminarayana opposed the over AP capital change.they would fight along with farmers he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X