వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సర్కార్‌కు సోము డెడ్‌లైన్: అంతర్వేది ఘటన వెనుక కుట్ర: దోషులను వదలొద్దు

|
Google Oneindia TeluguNews

అమరావతిఫ తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వెలుపల చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటన పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందనే అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. అగ్నిప్రమాదం సహజంగా సంభవించలేదని అంటున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఙప్తి చేస్తున్నారు.

ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. పూర్తిగా దగ్ధమైంది. సుమారు 40 అడుగుల ఎత్తు ఉన్న ఈ రథం మంటల బారిన పడటం స్థానికంగా కలకలం రేపింది. ఆలయం వెలుపల నిర్మించిన షెడ్‌లో ఉంచిన స్వామివారి రథం పూర్తిగా కాలిపోయింది. దీనిపై స్థానిక పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఆలయ పాలక మండలి సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. అన్ని కోణాల్లోనూ విచారణ చేపడతామని వెల్లడించారు.

ఈ ఘటనను ప్రమాదకరంగా భావించలేమని బీజేపీ నాయకులు చెబుతున్నారు. దీని వెనుక కుట్ర కోణం ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ రథానికి నిప్పు పెట్టి ఉంటారని అంటున్నారు. అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి రథాన్ని ధ్వంసం చేయడం పట్ల బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పార్టీ తూర్పు గోదావరి జిల్లా నాయకులతో కూడిన ప్రతినిధుల బృందాన్ని సంఘటనా స్థలానికి పంపిస్తామని ఆయన అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు.

AP BJP President Somu Veerraju demand for probe on Antarvedi temple fire accident

Recommended Video

Rain Fall Across Country ఈ సీజన్‌ మొత్తం 104 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం : IMD || Oneindia

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. మూడు రోజుల్లోనే నిందితులకు శిక్ష పడేలా చేయాలని అన్నారు. యుద్ధ ప్రతిపాదికన వారిని శిక్షించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలను ఏ మాత్రం ఉపేక్షించకూడదని చెప్పారు. ప్రోత్సహించకూడదని అన్నారు. పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేయాలని అన్నారు. హిందువుల మనోభావాలకు విఘాతం కలిగించే చర్యలను ఏ ఒక్కరూ సమర్థించబోరని సోము వీర్రాజు చెప్పారు.

English summary
AP BJP President Somu Veerraju demand for probe on Antarvedi temple fire accident. A chariot, at Sri Lakshmi Narasimha Swamy Temple of Antarvedi in East Godavari district, caught fire last night. Police say investigation is underway".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X