వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాదినేని యామినిపై కేసు వెనక్కి తీసుకోవాలన్న సోము- రాజమండ్రిలో పతాకావిష్కరణ

|
Google Oneindia TeluguNews

అయోధ్య భూమి పూజను ప్రత్యక్ష ప్రసారం చేయలేదన్న కారణంతో ఏపీ ప్రభుత్వంపై విమర్శలకు దిగిన బీజేపీ నేత సాదినేని యామినిపై టీటీడీ కేసు పెట్టింది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు బీజేపీలో సైతం ప్రకంపనలు పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది. యామినిపై ఏపీ సర్కార్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ తెలిపారు.

ap bjp president somu veerraju demands to withdraw case against sadineni yamini

శతాబ్దాల కల అయోధ్య లోని రామాలయం యొక్క శంకుస్థాపన. ఈ కార్యక్రమం ప్రపంచంలోని 250 చానెల్స్ ప్రత్యక్ష ప్రచారం చేసిన నేపధ్యంలో కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క TTD లో ప్రచారం చెయ్యక పోవడం అంటే, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తలుచుకుంటే మనసుకి బాధ కలిగించే అంశం అంటూ సోము వీర్రాజు ఇవాళ ట్వీట్‌ చేశారు. దీనిపై బిజెపీలో వున్న అనేక మంది ప్రస్తావించారు. యామిని గారి మీదే కేస్ పెట్టడం మంచిది కాదని, దీన్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సోము వీర్రాజు తన ట్వీట్‌లో డిమాండ్‌ చేశారు.

ap bjp president somu veerraju demands to withdraw case against sadineni yamini

74వ స్వాతంత్ర దిన వేడుకలను సోము వీర్రాజు తన స్వస్ధలమైన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో పార్టీకి చెందిన కొందరు నేతలతో కలిసి ఆయన పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఈ మధ్యనే మృతిచెందిన పార్టీ నేత దివంగత మాణిక్యాలరావు చిత్రపటానికి సోము నివాళులు అర్పించారు.

English summary
andhra pradesh bjp president somu veeraju demands jagan government to withdraw the case against their leader sadineni yamini for her deregatory comments on svbc for not given live teleast of ayodhya foundation stone event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X