వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ- ప్రైవేటు స్కూళ్లను ఆదుకోవాలని వినతి

|
Google Oneindia TeluguNews

ఏపీలో లాక్‌డౌన్‌ అనంతర పరిస్ధితుల్లో ప్రైవేటు స్కూళ్లు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఇందులో లాక్‌డౌన్‌ వల్ల తీవ్రమైన ఆర్ధికనష్టాలను ఎదుర్కొంటున్న ప్రైవేటు పాఠశాలలను ఆదుకోవాల్సింది పోయి శాశ్వతంగా మూసివేసేలా రాష్ట్ర ప్రభుత్వం కఠినవైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు. పలురకాల జీవొలు జారీ చేసి చిన్న ప్రైవేటు పాఠశాలలను అణచివేస్తోందన్నారు. ఆర్ధిక నష్టాల వల్ల ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వ నిబంధనలు ఇప్పటికిప్పుడు కొన్ని పాక్షికంగా పాటించకలేకపోవచ్చని,. ప్రభుత్వం వాటిపై ఆగ్రహాన్ని పక్కనపెట్టి ఉదారంగా వ్యవహరిస్తేనే ప్రైవేటు పాఠశాలలు నిలబడతాయని సూచంచారు.. అవి నిలబడితేనే వీటిపై ఆధారపడిన ఉపాధ్యాయులు, సిబ్బందికి ఉపాధి లభిస్తుందని సోము వీర్రాజు తెలిపారు. అప్పుడే పేద తల్లిదండ్రులకు ఉపశమనం కలుగుతుందని, విద్యార్థులకు విద్య లభిస్తుందన్నారు.

రాష్ట్రంలోని 47వేల ప్రభుత్వ పాఠశాలల్లో 42 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, ఇందులో 15 వేల ప్రైవేటు పాఠశాలల్లో 37 లక్షల మంది చదువుతున్నారని సోము సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వం నుంచి ఎలాంటి ధన సహాయం ఆశించడం లేదని,. స్వతంత్య్రంగా నిర్వహిస్తూ, విద్యార్ధి సగటు ఫీజు రూ.15 వేల నుంచి 20 వేలకే పరిమితం చేసి పేదతల్లిదండ్రులకు ఎంతో సహాయం చేస్తున్నారని సోము తెలిపారు. లాక్‌డౌన్‌ వల్ల తల్లిదండ్రులు చెల్లించాల్సిన ఫీజు బకాయిలు 40 శాతం ఆగిపోయాయని,. పాఠశాలలు తెరవకపోవడం వల్ల అడ్మిషన్లు లేక యాజమాన్యాలు ఆర్ధికనష్టాల బారినపడ్డారని సోము తెలిపారు. పాఠశాల భవనాల అద్దె, బస్సులకు చెల్లించాల్సిన వాయిదాలు చెల్లించలేక తీవ్రమైన వత్తిడికి గురౌతున్నారని వివరించారు.. ఈ ఒత్తిడిని తట్టుకోలేని 40 మంది కరెస్పాండెంట్లు ప్రాణాలు కోల్పోయారు. అందులో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నాని పేర్కొన్నారు.

ap bjp president somu veerraju request cm jagan to help private schools to revive

8 నెలలుగా జీతాలు లేక ఇబ్బందిపడుతున్న ఉపాధ్యాయులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.10 వేల గౌరవవేతనం ఇవ్వాలని సోము కోరారు. పాఠశాలలు తెరవని కారణంగా రుణాలకు సంబంధించి మారటోరియం కాలాన్ని 2021 జూన్‌ నెల వరకు వడ్డీలేకుండా పొడిగించాలన్నారు. ఫీజు రెగ్యులేటరీ, మానిటరింగ్‌ కమిషన్‌ పరిధి నుంచి చిన్న పాఠశాలలను తొలగించాలన్నారు. పాఠశాలల రెన్యువల్‌ ఆఫ్‌ రికగ్నేషన్‌ను మూడేళ్ల నుంచి పదేళ్లకు పొడిగించాలని సోము సూచించారు. పాఠశాలలు నడవని కారణంగా స్కూలు బస్సులకు చెల్లించాల్సిన రోడ్డు టాక్సు, ఫిట్నెస్‌, బీమా గడువును 2021 మే వరకు పొడిగించాలని కూడా కోరారు

English summary
andhra pradesh bjp president somu veerraju wrote a leter to cm ys jagan over private schools problems and request to help them immediately.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X