వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

AP Budget 2020: వ్యవసాయ బడ్జెట్ హైలైట్స్ ఇవే .. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి కన్నబాబు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికిగానూ 2020- 21 బడ్జెట్ తో పాటుగా, వ్యవసాయ బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టారు. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు శాసనసభలో ఈ ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్ ను ప్రవేశ పెడితే, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

Recommended Video

AP Budget 2020 : 29 వేల కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్.. కేటాయింపులివే!
 వ్యవసాయ బడ్జెట్‌ 2020-21 ప్రవేశపెట్టిన మంత్రి కన్నబాబు

వ్యవసాయ బడ్జెట్‌ 2020-21 ప్రవేశపెట్టిన మంత్రి కన్నబాబు

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ బడ్జెట్‌ 2020-21ను ఆ శాఖ మంత్రి కన్నబాబు శాసనసభలో మంగళవారంప్రవేశపెట్టారు. గత సంవత్సర కాలంలో వ్యవసాయ రంగంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయని, వైసిపి పాలనలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా రైతులకు మేలు చేసేలా వివిధ పథకాలను అందించడమే కాకుండా, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందనిమంత్రి కన్నబాబు తెలిపారు.

AP budget 2020 : 2.24 లక్షల కోట్లు.. బడ్జెట్ ఘనమే.. మరి ఆదాయం? క్లారిటీ ఇవ్వని వైసీపీ ప్రభుత్వంAP budget 2020 : 2.24 లక్షల కోట్లు.. బడ్జెట్ ఘనమే.. మరి ఆదాయం? క్లారిటీ ఇవ్వని వైసీపీ ప్రభుత్వం

2020-21 ఏడాదికి గాను రూ. 29,159.97 కోట్ల ప్రతిపాదన

2020-21 ఏడాదికి గాను రూ. 29,159.97 కోట్ల ప్రతిపాదన

రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ, అనుబంధ రంగాలకు 2020-21 ఏడాదికి గాను రూ. 29,159.97 కోట్లను ప్రతిపాదిస్తున్నామని అసెంబ్లీ వేదికగా పేర్కొన్నారు.రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.12,500 ఇస్తామని చెప్పామని,కానీ రూ. 13,500 ఇస్తున్నామని ఆయన వెల్లడించారు.రైతులకు అండగా ఉండేది వైసీపీ ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. ఇక వ్యవసాయ బడ్జెట్లో కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి .

వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులివే

వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులివే

మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయనున్నట్లుగా పేర్కొన్నారు. ప్రకృతి విపత్తు నిధికి 2 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. రైతు భరోసా కేంద్రాలకు 100 కోట్ల నిధులు కేటాయించారు. వైయస్సార్ ఉచిత పంటల బీమా కు 500 కోట్ల రూపాయలు, వైయస్ఆర్ వడ్డీలేని పంట రుణాలకు 1,100 కోట్ల రూపాయలు, రాయితీ విత్తనాల కోసం 200 కోట్ల రూపాయలు కేటాయిస్తామని మంత్రి కన్నబాబు చెప్పారు. ఇక అంతే కాదు వ్యవసాయ యాంత్రీకరణకు 207.83 కోట్ల రూపాయలు, ప్రకృతి వ్యవసాయానికి 225. 51 కోట్లు ,ఇక రైతులకు ఎక్స్ గ్రేషియా కింద 20 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ ను శాసనసభలో ప్రజెంట్ చేశారు.

English summary
agriculture Minister kannababu introduced the agriculture budget .On behalf of the State Government, the Government has allocated Rs. 29,159.97 crore as proposed by the Assembly. We have been promised Rs 12,500 through the Farmers Guarantee-PM Kisan Scheme, but Rs. 13,500, he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X