• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నేడే ఏపీ బడ్జెట్: మహిళలు, యువతకు పెద్దపీట, నిరుద్యోగ భృతి!

|

అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నిర్మించిన అసెంబ్లీలో తొలి బడ్జెట్‌ను ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టబోతోంది. 2017-18 సంవత్సరానికి సంబంధించి దాదాపు 1.55 లక్షల కోట్ల రూపాయల అంచనాలతో బడ్జెట్‌ను రూపొందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ఇది దాదాపు 19 వేల కోట్ల రూపాయలు ఎక్కువ. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను మార్చి 13న ప్రవేశపెట్టాల్సి ఉండగా, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి కారణంగా బుధవారానికి వాయిదా వేశారు.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌లో యువత, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. యువతకు ఉపాధి, నిరుద్యోగ భృతి అంశాలు బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయించనున్నారు. కాగా, తాత్కాలిక శాసనసభలో యనమల ప్రవేశపెట్టబోయే తొలి బడ్జెట్‌ ఇదే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

బుధవారం ఉదయం 10.25 గంటలకు ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెడతారు. శాసనమండలిలో పురపాలక మంత్రి నారాయణ బడ్జెట్‌ పత్రాలను చదువుతారు. శాసనసభలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నిరుద్యోగ యువతకు నెలకు రూ.రెండు వేల భృతినిస్తామని హామీనిచ్చింది. ఇందుకోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ.500 కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం.

AP budget may focus on fiscal consolidation as deficits mount

ఈ భృతి నెలకు రూ.1500 ఇచ్చేలా పథకాన్ని ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై యనమల బడ్జెట్‌ ప్రసంగంలోనే స్పష్టత రానుంది. ఈ పథకాన్ని పట్టభద్రులైన నిరుద్యోగులకు మాత్రమే వర్తింపజేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. నిరుద్యోగులకు భృతి కల్పించడంతో పాటు వారు సమాజహిత కార్యక్రమాలు చేసేలా పథకాన్ని రూపొందించే సూచనలున్నాయి.

ఆర్థికంగా, అత్యంత వెనుకబడిన కులాలకు ప్రాధాన్యమిస్తూ.. ఎంతోకొంత సహకరించాలనే తలంపుతో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి యనమల తన బడ్జెట్‌ ప్రసంగంలో పథకాలను ప్రకటించనున్నట్లు సమాచారం.బడ్జెట్‌లో 'చంద్రన్న బీమా'కూ చోటు కల్పించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించినా ఇప్పటివరకు బడ్జెట్‌ కేటాయింపులు లేవు. బుధవారం ఈ పథకాన్ని కూడా ఘనంగా ప్రకటించి దానికి రూ.500 కోట్లు కేటాయించనున్నట్లు తెలిసింది. పలు సంక్షేమ పథకాలను కూడా ప్రకటించే సూచనలున్నాయి.

బడ్జెట్‌లో ప్రగతి పనులకు, ప్రభుత్వ ప్రాధాన్యాలకు పెద్ద పీట వేయనున్నారు. మూలధన వ్యయం రూ.40వేల కోట్లు దాటనుంది. ఇందులో అమరావతికి రూ.400 కోట్ల మేర కేటాయిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు పోలవరం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు భారీ నిధులు కేటాయిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి పద్దులను ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం.

ఈసారి లోటు బడ్జెట్టే..

ఈసారి కూడా దాదాపు రూ.27వేల కోట్ల లోటు ఖజానాను ఆవిష్కరించే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి వస్తున్న ఆదాయానికంటే ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో ఖర్చులకు కళ్లెం వేసేందుకు మంత్రి యనమల ప్రయత్నించారు. అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి వచ్చిన బడ్జెట్‌ కేటాయింపుల ప్రతిపాదనలు మొత్తం రూ.2,29,842 కోట్లు రాగా 30 శాతం వరకు కోత విధించారు.

పద్దు పరిమాణం రూ.1.55 లక్షల కోట్లు దాటకుండా పగ్గాలు వేసేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. వాస్తవానికి బడ్జెట్‌ ఈసారి రూ.1.50 లక్షల కోట్లకు మించకుండా ఉండేలా చూడాలని ప్రయత్నించారు. ప్రభుత్వం ముందు కొన్ని ప్రాధాన్యాలు రావడంతో పద్దులో మరో రూ.5 కోట్లు పెంచాల్సి వచ్చినట్లు సమాచారం.

మంత్రి వర్గం ఆమోదం

బుధవారం ఉభయసభల్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందు మంత్రివర్గం ఆమోదించడం ఆనవాయితీ. 31 వరకు సభ.. శాసనసభ, మండలి బడ్జెట్‌ సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించారు. మార్చి 30, 31 తేదీల్లో కూడా సమావేశాలు జరుగుతాయి. ముందు ఖరారు చేసిన షెడ్యూల్‌ ప్రకారం బడ్జెట్‌ సమావేశాలు మార్చి 28తో ముగియాల్సి ఉంది.

నా అదృష్టం: యనమల

ఏపీ నూతన సభలో తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టడం తన అదృష్టమని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ బడ్జెట్‌లో యువత, మహిళలు, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇది పేదల బడ్జెట్, యువతకు సంబంధించిన ఉపయోగకర పథకాలు రాబోతున్నాయని చెప్పారు. పేదరికం తగ్గాలి, అభివృద్ధి పెరగాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు.

English summary
The Andhra budget, to be presented tomorrow, is likely to focus on fiscal consolidation to control the runaway fiscal and revenue deficits despite robust growth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X