• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జ‌గ‌న్ హామీల విలువే 70 వేల కోట్లు: పెన్ష‌న్ల కోసం 15 వేల కోట్లు: ఎలా స‌ర్దుబాటు చేస్తారు..!

|

ఏపీ ప్ర‌భుత్వం బ‌డ్జెట్ ప్ర‌వేశ పెడుతున్న వేళ కొత్త చ‌ర్చ మొద‌లైంది. జ‌గ‌న్ తానిచ్చిన హామీలు అమ‌లు చేస్తాన‌ని ప‌దే ప‌దే చెబుతున్నారు. అందులో కొన్నింటికి ఇప్ప‌టికే అమ‌లు దిశ‌గా ప్ర‌క‌ట‌న చేసారు. అయితే, ఈ హామీల‌ను మొత్తంగా అమ‌లు చేయాలంటే ఏడాదికి దాదాపు 70 వేల కోట్ల వ‌ర‌కు అవ‌స‌రం అవుతుంద‌ని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ముఖ్య‌మంత్రి కొత్త వ‌రాల‌ను ప్ర‌క‌టిస్తూ పోతున్నారు. రాష్ట్రంలో రెవిన్యూ లోటు అదే స్థాయిలో పెరుగుతోంది. మ‌రి..జ‌గ‌న్ ఎలా స‌ర్దుబాటు చేస్తారు..ఆయ‌న ధీమాకు కార‌ణాలేంటి..

జ‌గ‌న్ హామీల మొత్త‌మే 70 వేల కోట్లు..

జ‌గ‌న్ హామీల మొత్త‌మే 70 వేల కోట్లు..

ఎన్నిక‌ల ముందు పార్టీ ప్లీన‌రీలో ప్ర‌క‌టించిన నవ‌ర‌త్నాలు..పాద‌యాత్ర హామీలు అమ‌లుకు ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది . ఏది ఏమైనా..రాష్ట్ర ఆర్దిక ప‌రిస్థితి ఎలా ఉన్నా న‌వ ర‌త్నాల‌ను అమ‌లు చేయాల్సిందేన‌ని..తానిచ్చిన హామీల‌ను సైతం అమ‌లు చేసి చూపిస్తామ‌ని ముఖ్య‌మంత్రి చాలా ధీమాగా చెబుతున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రం నెత్తిన అప్పు భారం భారీగా ఉంది. కేంద్రం నుండి ప్ర‌త్యేకంగా సాయం ప్ర‌స్తావ‌నే లేదు. ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించిన అమ్మ ఒడి కోస‌మే దాదాపు 6500 కోట్లు అవ‌స‌రం. ఇక‌, రైతు భ‌రోసా అమ‌లు చేయాలంటే 8,500 కోట్లు అంచ‌న‌గా అధికారులు నిర్ణ‌యించారు. విప‌త్తుల స‌హాయ నిధి కింద రెండు వేల కోట్లు కేటయించాల్సి ఉంటుంది. అగ్రి గోల్డ్ భాధితుల‌కు అస‌ర‌గా ఇప్ప‌టికే ప్ర‌భుత్వం 1150 కోట్లు సైతం ఈ బ‌డ్జెట్‌లోనే ప్ర‌తిపాదించాల్సి ఉంది. వీటితో పాటుగా ఉద్యోగుల జీతాలు..పెన్ష‌న్లు..సాధార‌ణ ఖ‌ర్చులు ఇలా ఎన్నో ఖ‌ర్చులకు నిధుల‌ను స‌మీక‌రించాల్సి ఉంది.

ఆదాయం..వ్య‌యం స‌ర్దుబాటు సాధ్య‌మేనా..

ఆదాయం..వ్య‌యం స‌ర్దుబాటు సాధ్య‌మేనా..

ఎన్నికల ప్రణాళికలోని అంశాలకు రూ.65,000 కోట్ల నుంచి రూ.70,000 కోట్ల వరకు కేటాయింపులు ఉండబోతున్నాయని సమాచారం. అందులో కేవ‌లం పింఛన్లకు రూ.15 వేల కోట్లపైనే అవసరమవుతాయని లెక్కించారు. ఇదే స‌మ‌యంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం దాదాపు రూ.1,98,000 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తోంది. ఓట్‌ ఆన్‌ అకౌం ట్‌లో దాదాపు రూ.2.25 లక్షల కోట్ల వరకు ఆదాయం వస్తుందని భావించినా సాధ్య ప‌డ‌లేదు. ఈ పరిస్థితుల్లో ఇతరత్రా మార్గాల ద్వారా ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలనే ఆలోచనతో అధికారులు కసరత్తు సాగించారు. కేంద్రం నుంచి రెవెన్యూ లోటు భర్తీ, ఇసుకపై ఆదాయం, సొంత ఆదాయాన్ని మరింత పెంచుకోవడం వంటి అంశాల ద్వారా ఖజానాకు దాదాపు రూ.17 వేల కోట్లకు పైగా రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. భారీ అంచ‌నాల‌తో ఆదాయం గురించి బ‌డ్జెట్‌లో ప్ర‌స్తావించినా..గ‌త ప్ర‌భుత్వంలో లాగా కాకుండా.. వాస్త‌వ ధృక్ప‌ధంతో అంచ‌నాలు ఉంటాయ‌ని ఆర్దిక మంత్రి బుగ్గ‌న ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసారు.

జ‌గ‌న్ స‌క్సెస్ అవుతారా..

జ‌గ‌న్ స‌క్సెస్ అవుతారా..

త‌మ పాన‌ల‌కు న‌వ‌ర‌త్నాలే దిక్సూచి అని..ఖ‌చ్చితంగా అవి అమ‌లు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌దే ప‌దే స్ప‌ష్టం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌తీ ఏటా సాధార‌ణ ఖ‌ర్చుల్లో ఏవీ మిన‌హాయించే ప‌రిస్థితి లేదు. ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా ఉన్న ఎక్సైజ్ ద్వారా తొలి ఏడాదికి ఇబ్బంది లేక‌పోయినా..క్ర‌మేణా ఆ ఆదాయం సైతం త‌గ్గిపోయే అవ‌కాశం ఉంది. కొత్త‌గా ప్ర‌జ‌ల పైన ప‌న్నుల భారం వేయ‌టానికి జ‌గ‌న్ సిద్దంగా లేరు. దీనికి తోడు ఆర్టీసి ప్ర‌వేటీక‌ర‌ణ‌.. కొత్త‌గా ఆశా..అంగ‌న్ వాడీ..మున్సిప‌ల్ వ‌ర్క‌ర్ల జీతాల పెంపు పైనా హామీ ఇచ్చారు. ఉద్యోగుల‌కు 27 శాతం మ‌ధ్యంత‌ర భృతి ద్వారా మ‌రింత భారం పెరిగింది. దాదాప రెండున్నార‌ ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు ఉంద‌ని అంచ‌నా వేస్తున్న స‌మ యంలో ఆ మొత్తంలో ఆదాయం మాత్రం క‌నిపించ‌టం లేదు. ప్ర‌భుత్వం మాత్రం కేంద్రం నుండి 90 వేల కోట్ల‌కు పైగా

వివిధ మార్గాల్లో ఆదాయం ఆశిస్తోంది. మ‌రి..జ‌గ‌న్ వేస్తున్న లెక్క‌లు ఎంత వ‌ర‌కు వాస్త‌వ రూపంలో సాధ్యం.. ఎంత మేర స‌క్సెస్ అవుతార‌నేది వేచి చూడాలి.

English summary
AP Budget proposals may be based on Jagan Assurances. It may total around 70 thousand cr. But, Revenue estimations is around 2 lak cr. Huge expectations on Revenue generations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X