వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Budget Sessions 2020:ఆ రెండు బిల్లులపై టీడీపీ వ్యూహానికి వైసీపీ ప్రతివ్యూహం .. గండం గట్టెక్కుతుందా !

|
Google Oneindia TeluguNews

మూడు రాజధానులు అంశంలో అనుకున్నది సాధించే తీరాలన్న పట్టుదల తో ఉన్నా ఏపీ సర్కార్ ఇప్పుడు జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును, సీఆర్డీఏ రద్దు బిల్లును పెట్టి సక్సెస్ అవ్వాలని ప్రయత్నం చేస్తోంది. ఇక గతంలో మండలిలో పెద్ద రచ్చ జరిగి సెలెక్ట్ కమిటీకి పంపించాలని నిర్ణయం తీసుకున్న బిల్లుల ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో మరోమారు రచ్చ నెలకొంది. అయితే ఏపీ ప్రభుత్వం ఏ ధీమాతో శాసనసభలో బిల్లును ఆమోదించి, మండలికి పంపించింది అనేదే ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

టీడీపీకి షాక్ ఇచ్చే వ్యూహం ఏమైనా సిద్ధం చేశారా?

టీడీపీకి షాక్ ఇచ్చే వ్యూహం ఏమైనా సిద్ధం చేశారా?

మండలిలో పెండింగ్‌లో ఉన్న బిల్లులనే మరోసారి అసెంబ్లీలో పెట్టి ఆమోదింప చేసుకున్న అధికారి వైసిపి ఇప్పుడు శాసనమండలిలో బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి ఏమైనా వ్యూహాలు పన్నిందా ? ఇక గతంలో మండలిలో బిల్లులను అడ్డుకున్న సమయానికి, ఇప్పటికీ మండలి బలంలో పెద్దగా తేడా లేదు. ఒక ముగ్గురు ఎమ్మెల్సీలు మాత్రమే అధికార వైసిపికి మద్దతుగా ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు వైసిపి అగ్రనేతలు మండలి నేతలపై దృష్టిపెట్టి ఏమైనా కసరత్తు చేశారా? పలువురు ఎమ్మెల్సీలు టీడీపీకి షాక్ ఇచ్చి ఓటింగ్ సమయంలో సీఆర్డీఏ రద్దు బిల్లుకు,మూడు రాజధానులు బిల్లు కు మద్దతు పలికే అవకాశం ఉందా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది.

టిడిపి రూల్ 90 కింద నోటీసులు ఇచ్చి బిల్లులపై మెలిక

టిడిపి రూల్ 90 కింద నోటీసులు ఇచ్చి బిల్లులపై మెలిక

ఇప్పుడు ఆ బిల్లులు మళ్లీ మండలికి వెళ్లిన నేపథ్యంలో ఫిరాయింపులు లేకుండా, టిడిపి నేతలు ఏకతాటి మీద ఉంటే, బిల్లులను మరోసారి గండం పొంచి ఉందన్న మాటే. ఇక అందులో భాగంగానే టిడిపి రూల్ 90 కింద నోటీసులు ఇచ్చి బిల్లులపై చర్చ అవసరం లేదని మెలిక పెడుతోంది. శాసనమండలిలో బిల్లులపై చర్చ జరగకున్నా , మళ్లీ ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపినా అధికారి వైసిపికి ఇబ్బందికర పరిణామమే. ఒకవేళ సెలెక్ట్ కమిటీ కి మళ్లీ పంపాలని భావిస్తే బిల్లుల వ్యవహారం మరి కొన్నాళ్ల పాటు ఆగుతుంది.

ఈసారి ఫెయిల్ అవ్వకుండా అన్ని పక్కాగా... బిల్లులు పెట్టిన వైసీపీ ?

ఈసారి ఫెయిల్ అవ్వకుండా అన్ని పక్కాగా... బిల్లులు పెట్టిన వైసీపీ ?

ఇక శాసనమండలిలో ప్రస్తుతం ఈ బిల్లులను తిరస్కరించినప్పటికీ మళ్లీ ఆ బిల్లును పాసయిందని ఆమోదించుకొని, గవర్నర్ వద్దకు ఆమోదం కోసం పంపడానికి అవసరమైన అన్ని రకాల చర్యలను అధికారపక్షం రెడీ చేసుకుంది. శాసనమండలి గరిష్టంగా బిల్లును నాలుగు నెలలకు మించి ఆపలేరన్న నిబంధనల నేపథ్యంలో.. ప్రభుత్వం ప్రత్యేక వ్యూహంతో ఉందని అర్థం చేసుకోవచ్చంటున్నారు. శాసనమండలిలో బిల్లును వ్యతిరేకించినా.. ఆమోదించినా.. ఇబ్బంది లేకుండా.. తమ మూడు రాజధానుల బిల్లును చట్టంగా మార్చుకోవడానికి అవసరమైన కసరత్తు చేసిన తర్వాతనే ఏపీ సర్కార్ మరోసారి ఆ బిల్లులను ప్రవేశ పెట్టిందన్న చర్చ జోరుగా సాగుతోంది.

Recommended Video

AP Assembly Budget Sessions Guidelines ఇలాంటి అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడూ చూసుండరు ?
గత అనుభవాల దృష్టితో వైసీపీ తాజా ఎత్తుగడ

గత అనుభవాల దృష్టితో వైసీపీ తాజా ఎత్తుగడ

అందుకే.. గవర్నర్ ప్రసంగంలోనూ మూడు రాజధానుల అంశాన్ని చేర్చి శాసన ప్రక్రియ నడుస్తోందని చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు రాజధాని ఏర్పాటుకు బడ్జెట్ కేటాయింపులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు ఏపీ సర్కార్ టిడిపి గతంలో అనుసరించిన వ్యూహాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు అందుకు కౌంటర్ గా ప్రతి వ్యూహంతోనే ముందుకు వెళుతున్నట్లు గా తెలుస్తోంది . ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఏపీలో మరోమారు మూడు రాజధానులు అంశం అటు ఏపీ ప్రజల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.

English summary
The AP government's latest decision on the bills, which had previously been decided to be sent to the Select Committee by a huge fight in the council, was once again made. this is interesting at what basis ap govt taken this decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X