వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిబ్ర‌వ‌రి 5న ఓట్ ఆన్ ఎకౌంట్ .. చివ‌రి స‌మావేశాల్లో కీల‌క నిర్ణ‌యాలు..

|
Google Oneindia TeluguNews

ఏపి అసెంబ్లీ స‌మావేశాల తేదీలు ఖ‌రార‌య్యాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌..రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాల దిశ గా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా..ఎన్నిక‌ల తాయిలాల‌తో ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ను ఫిబ్ర‌వ‌రి 5న స‌భ‌లో ప్ర‌వేశ పెట్టాల‌ని నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే పెన్ష‌న్ ల పెంపు వంటి ప్ర‌జాక‌ర్ష‌క ప‌ధ‌కాల‌పై నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌భు త్వం ఇక‌, స‌మావేశాల్లో గ‌త ఎన్నిక‌ల హామీల అమల్లో పెండింగ్‌లో ఉన్న వాటి పై నిర్ణ‌యం తీసుకోనుంది.

ఈ నెల 30 నుండి స‌మావేశాలు..

ఈ నెల 30 నుండి స‌మావేశాలు..

ఏపి అసెంబ్లీ స‌మావేశాలు ఈ నెల 30వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. శీతాకాల స‌మావేశాలు నిర్వ‌హించ‌ని ప్ర‌భుత్వం..ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్ కోసం ఈ స‌మావేశాల‌ను నిర్వ‌హిస్తోంది. అందులో భాగంగా..ఫిబ్ర‌వ‌రి 5న ఏపి ప్ర‌భుత్వం స‌భ‌లో ఓన్ ఆన్ ఎకౌంట్ బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌నుంది. సమావేశాల‌కు ప్రారంభ రోజైన ఈ నెల 30 గ‌వ‌ర్న‌ర న‌ర‌సింహ‌న్ ఉభ‌య స‌భ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. ఆ త‌రువాతి రోజు 31న సిట్టింగ్‌ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి మృతికి సంతాప తీర్మానాలు ప్ర‌వేశ పెట్టి ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీకి స‌భ వాయిదా ప‌డ‌నుంది.

ఒట్ ఆన్ ఎకౌంట్

ఒట్ ఆన్ ఎకౌంట్

ఇక‌, ఫిబ్ర‌వ‌రి 1న కేంద్ర ప్ర‌భుత్వం సైతం ఒట్ ఆన్ ఎకౌంట్ బ‌డ్జెట్ ను పార్ల‌మెంట్ లో ప్ర‌వే శ పెడుతుంది. ఈ బ‌డ్జెట్ లో కేటాయింపుల‌కు అనుగుణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న బ‌డ్జెట్ కు తుది రూపు ఇవ్వాల‌ని భావిస్తోంది. ఇప్ప‌టికే కేంద్రం నిధులు ఇవ్వ‌టం లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న స‌మ‌యంలో..రాజ‌కీయ కోణంలోనే ఈ సారి ప్ర‌భుత్వం తాయిలాలు ప్ర‌క‌టించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఇవే చివ‌రి స‌మావేశాలా..

ఇవే చివ‌రి స‌మావేశాలా..

ప్ర‌స్తుత ప్ర‌భుత్వానికి దాదాపు ఇవే చివ‌రి స‌మావేశాలు. నెల 30 నుండి ప్రారంభ‌మ‌య్య స‌మావేశాల‌నే ఓట‌న్ ఆన్ ఎకౌంట్ స‌మావేశాలుగా చెబుతుండ‌టంతో..ఈ స‌మావేశాల‌నే రెండు విడ‌త‌లుగా నిర్వ‌హించే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే, కేంద్ర ఓట్ ఆన్ కౌంట్ ను ప‌రిశీలించి ఏపి బ‌డ్జెట్ కు తుది మెరుగులు దిద్ద‌నున్నారు. ఇక‌, ఈ స‌మావేశాల్లో రాజ‌కీయంగా ప‌లు కీల‌క నిర్ణ‌యాలు ఆమోద ముద్ర వేసే అవ‌కాశం ఉంది. కేంద్ర ప్ర‌భుత్వం ప‌ది శాతం అగ్ర వ‌ర్ణ పేద ల‌కు రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు చేయ‌టంతో..ఏపిలో టిడిపి ఇచ్చిన రిజ‌ర్వేష‌న్ల అమ‌లు పై కీల‌క నిర్ణ‌యం తీసుకొనే చాన్స్ క‌నిపిస్తోంది. దీనికి అనుగుణంగా ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం న్యాయ స‌ల‌హాలు తీసుకుంటున్న‌ట్లు సమాచారం. ఇక‌, ఈ స‌మావేశాలు ముగిసిన వెంట‌నే ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉండ‌టంతో ప్ర‌భుత్వానికి ఈ సమావేశాలు కీల‌కంగా మారుతున్నాయి.

English summary
AP Aseembly sessions start from this month 30th on wards. On Feb 5th Ap govt may submit vote on account budget in Assembly. In coming month elections schedule may announce. So, AP govt may take key decisions in this sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X