వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుని విధ్వంసం కేసులు ఎత్తివేత..! రిలయన్స్ కేసులపైనా చర్చ:కేబినెట్ లో ఫైనల్ నిర్ణయం..!

|
Google Oneindia TeluguNews

రెండు కీలక అంశాల పైన నిర్ణయాల దిశగా ముఖ్యమంత్రి జగన్ ఆలోచన చేస్తున్నారు. వైయస్సార్ మరణం సమయంలో జరిగిన అల్లర్ల కేసులను ఎత్తివేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. వైయస్సార్ హెలికాప్టర్‌ ప్రమాదం వెనుక రిలయన్స్‌ హస్తం ఉందని అప్పట్లో వార్తలు వ్యాపించడంతో ఆయన అభిమానులు ఉమ్మడి రాష్ట్రంలోని పలు చోట్ల రిలయన్స్‌ మాల్స్‌పై దాడులకు దిగి ధ్వంసం చేశారు. అప్పట్లో బాధ్యులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వాటిని ఎత్తేసే విషయమై బుధవారం మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. దీంతోపాటు కాపు రిజర్వేషన్‌ ఉద్యమం సందర్భంగా జరిగిన విధ్వంసం కేసులను కూడా ఎత్తేయబోతున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ కీలక నిర్ణయాలకు కేబినెట్ లో చర్చించి..నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

 జగన్ రెడ్డి! అప్పుడేమన్నారు? ఇప్పుడేం చేస్తున్నారు?: రైతుకు కులమా? అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం జగన్ రెడ్డి! అప్పుడేమన్నారు? ఇప్పుడేం చేస్తున్నారు?: రైతుకు కులమా? అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం

తుని విధ్వసం కేసులు ఎత్తివేత దిశగా..

తుని విధ్వసం కేసులు ఎత్తివేత దిశగా..

కాపు రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సభ ఏర్పాటు చేసారు. ఆ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా కాపు నేతలు హాజరయ్యారు. సభ జరుగుతుండగానే కొందరు యువకులు సడన్ గా తుని పోలీస్‌ స్టేషన్‌పై దాడి, రైలుపై రాళ్లు రువ్విన ఘటనలో పలువురిపై సుమారు 69 కేసులు నమోదయ్యాయి. ఇందులో వైసీపీ నేతలు కొందరిపైన ఆరోపణలు రావడంతో అప్పట్లో సీఐడీ పోలీసులు విచారించారు. అదే సమయంలో రత్నాచల్ ఎన్స్ ప్రెస్ ను దహనం అయింది. దీంతో..ఆ వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది. వైసీపీ నేత భూమన కరుణాకర రెడ్డిని సైతం పోలీసులు విచారించారు. కడప నుండి వచ్చిన వారే విధ్వంసానికి కారణమంటూ నాటి ప్రభుత్వం ఆరోపణలు చేసింది. అయితే, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఈ కేసుల వ్యవహారం పైన నివేదిక కోరింది. దీని పైన కేబినెట్ లో చర్చించి కేసుల ఎత్తివేత పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

రిలయన్స్ కేసులు ఎత్తివేత పైనా..

రిలయన్స్ కేసులు ఎత్తివేత పైనా..

పదేళ్ల క్రితం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించినప్పుడు జరిగిన అల్లర్ల కేసులను ఎత్తివేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. వైఎస్‌ హెలికాప్టర్‌ ప్రమాదం వెనుక రిలయన్స్‌ హస్తం ఉందని అప్పట్లో వార్తలు వ్యాపించడంతో ఆయన అభిమానులు ఉమ్మడి రాష్ట్రంలోని పలు చోట్ల రిలయన్స్‌ మాల్స్‌పై దాడులకు దిగి ధ్వంసం చేశారు. అప్పట్లో బాధ్యులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వాటిని ఎత్తేసే విషయమై బుధవారం మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఒక రష్యన్ వెబ్ సైట్ లో వచ్చిన కధనం ఆధారంగా కొన్ని వార్తా సంస్థలు ఈ వార్తను ప్రచారంలోకి తెచ్చాయి. దీంతో..అప్పట్లో వైయస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో రిలయన్స్ సంస్థల పైన దాడులకు దిగటం సంచలనం అయింది. జాతీయ స్థాయిలో దీని పైన పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఈ కేసుల అంశం పైనా ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ప్రభుత్వం నిర్ణయం పైన ఆసక్తి..

ప్రభుత్వం నిర్ణయం పైన ఆసక్తి..

ఈ రెండు అంశాలు అప్పట్లో రాజకీయంగా రాష్ట్రంలో సంచలనానికి కారణమయ్యాయి. ప్రధానంగా తుని విధ్వంసం విషయంలో రాజకీయంగా వైసీపీ లక్ష్యంగా నాటి టీడీపీ ప్రభుత్వంలోని పలువురు విమర్శలు చేసారు. వైసీపీ నేతల మీద ఆరోపణలు చేసారు. కానీ, ఏ ఒక్కరి పైనా చర్యలు మాత్రం తీసుకోలేదు. అదే సమయంలో కేసుల పేరుతో కాపు యువతను తూర్పు గోదావరి జిల్లాలో వేధింపులకు గురి చేస్తున్నారని తాజాగా టీడీపీ నుండి వైసీపీలో చేరిన ప్రముఖ కాపు నేత ఆవేదన వ్యక్తం చేసారు. ఇక, ఇప్పుడు ఆ కేసులు ఎత్తివేత విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారింది. రైలు దహనం కేసు రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. ఇక, ఇతర విధ్వంసాల కేసులు మాత్రం రాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేసారు. వీటన్నింటి పైనా చర్చించి..న్యాయ నిపుణుల అభిప్రాయం మేరకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

English summary
AP Cabinet discuss and may lift TUNI cases which filed at the the time of Kapu reservation assitation. Cabinet may take decision also on attacks on Reliance cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X