India
  • search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోనసీమ పేరు తేల్చేస్తారా - మంత్రులకు ఎన్నికల టార్గెట్ : నేడు కేబినెట్ భేటీ..!!

|
Google Oneindia TeluguNews

పలు కీలక అంశాల అజెండాగా ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరగనుంది. ఇందులో ప్రధానంగా అధికారిక నిర్ణయాలతో పాటుగా రాజకీయ అంశాల పైన చర్చకు వచ్చే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా ఏపీలో పరిశ్రమలు..పెట్టుబడులు..ఉపాధి కల్పన పైన సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ప్రతీ నెలా పరిశ్రమల ఏర్పాటు.. ప్రారంభత్సవాల కార్యక్రమాలు ఉండేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సమావేశంలోనూ 35 సంస్థలకు 112 ఎకరాల భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పాటుగా పంచాయతీరాజ్ చట్టంలో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది.

పాలనా పరమైన అంశాలపై నిర్ణయాలు

పాలనా పరమైన అంశాలపై నిర్ణయాలు

ఈ నెల 27వ తేదీన అమ్మఒడి మలి విడత నిధులకు ముహూర్తంగా నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లాలో సీఎం ఈ పధకాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన నిధుల కేటాయింపుకు ఆమోదం లభించనుంది. భూముల ఆక్రమణల నిరోధానికి చట్ట సవరణ ప్రతిపాదనపై చర్చ చేపట్టి.. కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల జెడ్పీ ఛైర్మన్ల పదవీకాలం పూర్తయ్యే వరకు కొత్త జిల్లాలకు కొనసాగించేలా చట్ట సవరణపై చర్చించి ఆమోదం పైన కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ చేపట్టనున్న 3700 మెగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు ప్రతిపాదన పైన మంత్రులకు అధికారులు వివరించనున్నారు. దీని పైన చర్చ జరిగి నిర్ణయం తీసుకోనున్నారు. బైజుస్​తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్​ల పంపిణీ ప్రతిపాదనపైనా చర్చించి.. తుది నిర్ణయం పై ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.

పరిశ్రమలకు భూ కేటాయింపులు

పరిశ్రమలకు భూ కేటాయింపులు


కొప్పర్తిని టెక్స్‌టైల్‌ రీజియన్‌ అపారెల్‌ పార్క్‌గా తీర్చిదిద్దే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. పులివెందులలో పంక్చుయేట్‌ వరల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.50 కోట్లతో పెట్టనున్న గార్మెంట్స్‌ తయారీ పరిశ్రమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కృష్ణాజిల్లా మల్లవెల్లి ఫుడ్‌పార్కులో రూ.150 కోట్లతో అవిసా ఫుడ్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు అనుమతి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక, కోనసీమ జిల్లా పేరు పైన అభ్యంతరాల గడువు ముగియటంతో.. జిల్లా నుంచి ఏపీ ప్రభుత్వానికి సేకరించిన అభిప్రాయల పైన నివేదిక పంపినట్లుగా విశ్వసనీయ సమాచారం. దాదాపుగా ఆరు వేల మందికి పైగా అనేక రకాల పేర్లను సూచిస్తూ తమ వినతులను కోనసీమ జిల్లా కలెక్టర్ కు అందించారు.

కోనసీమ పేరు - రాజకీయ అజెండా

కోనసీమ పేరు - రాజకీయ అజెండా


బీఆర్ అంబేద్కర్ పేరు ప్రతిపాదన పైన కోనసీమలో గత నెలలో చోటు చేసుకున్న పరిణామాలు.. విధ్వంసం..తరువాతి పరిణామాల పైన కేబినెట్ లో చర్చించి.. జిల్లా పేరు పైన నిర్ణయం తీసుకుంటారా.. మరి కొద్ది రోజులు వేచి చూస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇక, రాజకీయంగానూ అధికారిక అజెండా తరువాత చర్చించే ఛాన్స్ ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే జిల్లాల పర్యటనలు ప్రారంభించటం.. పవన్ కళ్యాణ్ సైతం దసరా నుంచి జిల్లాల పర్యటన ప్రారంభిస్తుండటంతో.. గడపగడపకు ప్రభుత్వం సమీక్ష.. జిల్లాల్లో ప్లీనరీలు.. జూలై 8న పార్టీ ప్లీనరీ నిర్వహణ పైన సీఎం జగన్ మార్గనిర్దేశం చేసే అవకాశం ఉంది. రాజకీయంగానూ మంత్రులకు రూట్ మ్యాప్ పైన స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో..సీఎం జగన్ వేగంగా అడుగులు వేస్తున్న ఈ సమయంలో జరుగుతున్న కేబినెట్ పైన ఆసక్తి నెలకొని ఉంది.

English summary
AP Cabinet may take decision on the Konaseema district name and land allocations for in industries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X