వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1.33ల‌క్ష‌ల ఉద్యోగాల భ‌ర్తీకి ఆమోదం: కొత్త బిల్లుల‌కు గ్రీన్ సిగ్న‌ల్‌

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఏపీలో 1.33ల‌క్ష‌ల ఉద్యోగాల భ‌ర్తీకి కేబినెట్ ఆమోద ముద్ర ! || AP Cabinet Approved 1.33 Lac Govt Posts

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న వేళ‌..ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న కేబినెట్ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ యాలు తీసుకున్నారు. రాష్ట్ర చ‌రిత్ర‌లో తొలి సారిగా ఒకే విడ‌త‌లో 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబం ధించిన నిర్ణ‌యానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. జ‌గ‌న్ హామీలో భాగంగా ఏర్పాటు కానున్న మొత్తం 14,900 గ్రామ‌.. వార్డు స‌చివాయాల్లో ఈ మొత్తం ఉద్యోగుల‌కు ఒకే విడ‌త‌లో భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుత స‌మావేశాల్లో ప్ర‌వేశ పెట్ట‌నున్న బిల్లుల‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

ఒకే విడ‌త‌లో 1.33ల‌క్ష‌ల ఉద్యోగాల భ‌ర్తీకి ఆమోదం..

ఒకే విడ‌త‌లో 1.33ల‌క్ష‌ల ఉద్యోగాల భ‌ర్తీకి ఆమోదం..

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఒకే దఫా 1,33,867 ఉద్యోగ‌ల భ‌ర్తీకి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి దాదాపు 50 రోజులు పూర్త‌వుతుంది. ఈ రికార్డు స‌మ‌యంలోనే పెద్ద మొత్తంలో ఉద్యోగాల భ‌ర్తీ పైన రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. న‌వ‌ర‌త్నాల్లో భాగంగా జ‌గ‌న్ ఇచ్చిన హామీ మేర‌కు రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 14,900 గ్రామ, వార్డు సచివాలయాలలో పని చేసేందుకు మొత్తం 1,33,867 కొత్త ఉద్యోగాల భర్తీకి ఏపీ రాష్ట్ర మంత్రివ‌ర్గం ఆమోద ముద్ర వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 13,065 గ్రామ పంచాయతీలకు గాను ప్రభు త్వం 11,114 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నారు.. వీటిలో పని చేసేందుకు 99,144 మందిని కొత్తగా నియమించ నున్నారు. అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాల ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని తీసుకున్న నిర్ణ‌యంలో భాగంగా.ను 34,723 మంది ఉద్యోగులను నియమిస్తున్నారు.

ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తింపు..

ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తింపు..

గ్రామ సచివాలయాల్లో పది మంది ఉద్యోగుల నుంచి 12 మంది దాకా పని చేసేలా నిర్ణయించగా, వార్డు సచివాలయాల్లో పదేసి మంది చొప్పున ఉద్యోగులు పని చేస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే వారు పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్ప‌ష్ట‌త ఇచ్చింది. దీని ద్వారా వీరంతా ప్ర‌భుత్వ ఉద్యోగులుగా కొన‌సాగ‌నున్నారు. ఇదే స‌మ‌యంలో కీల‌క‌మైన 12 స‌వ‌ర‌ణ బిల్లుల‌ను కేబినెట్ ఆమోదించింది. వీటిని ప్ర‌స్తుత అసెం బ్లీ స‌మావేశాల్లోనే బిల్లులుగా ప్ర‌తిపాదించి చ‌ట్ట‌బ‌ద్ద‌త తీసుకు రానున్నారు. రాష్ట్రంలో లోకాయుక్త నియామకానికి సంబంధించి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించేలా తెలంగాణా తరహాలో చట్ట సవరణ చేపట్టనున్నారు.
విద్యుత్ నియంత్రణ మండలి సిఫార్సుల అమలుకు సంబంధించిన అంశంలోనూ చట్ట సవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో..దీనికి సంబందించిన బిల్లును కేబినెట్ ఆమోదించింది.

జ్యుడీషియ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటుకు ఆమోదం..

జ్యుడీషియ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటుకు ఆమోదం..

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పార‌ద‌ర్శ‌క పాల‌న కోసం ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన జ్యుడీషియల్ కమిషన్ నియామకం కోసం ఏపీ ఇన్​ఫ్రా డెవలప్​మెంట్ ఎనేబిలింగ్ చట్టం 2001 కీ సవరణ చేయనున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, ఇంజినీరింగ్ ప్రాజెక్టుల్లో సమీక్ష కోసం ఈ జ్యుడీషియల్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణ‌యించింది.
ఈ కమిషన్ ఏర్పాటు కోసం చట్ట సవరణ అవసరం కావ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది. కీల‌క‌మైన ఇక పాఠశాలలు, కళాశాలల్లో ఫీజు నియంత్రణకు సంబంధించి కమిషన్లను ఏర్పాటు చేసేందుకు నూతన బిల్లులను శాసనసభ ముం దుంచనుంది. రాష్ట్రంలో వైద్యారోగ్యానికి సంబంధించిన సంస్కరణలు తీసుకురావాలని యోచిస్తున్న ప్రభుత్వం జిల్లా ఆస్పత్రులకు స్వయంప్రతిపత్తి కల్పించేలా సొసైటీలు, ట్రస్టు ల కిందకు తీసుకువచ్చేందుకు అవసరమైన చట్ట సవ రణ అంశం పైనా కేబినెట్‌లో చ‌ర్చించారు.తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్, పాలక మండలి సభ్యులను ఎప్పుడైనా రీకాల్ చేసేందుకు అవకాశం కల్పించేలా హిందూ ధార్మిక చట్టానికి సవరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

English summary
meta descriptionAP Cabinet approved 1.33 lac govt posts in Village secretariats. AP Cabinet also approved for 50 percent of nominated posts for SC,st and B.C's. In present Assembly sessions these bill will be present.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X