వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు- అసెంబ్లీ అజెండా, కొత్త పథకాల ప్రారంభానికి ఆమోదం

|
Google Oneindia TeluguNews

ఇవాళ వెలగపూడి సచివాలయంలో సమావేశమైన ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో నివర్‌ తుపానుపై చర్చతో పాటు అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లుల ఆమోదం, ఇళ్ల స్ధలాల పంపిణీతో పాటు పలు కొత్త సంక్షేమ పథకాల ప్రారంభంపై కేబినెట్‌ చర్చించింది. వచ్చే నెలలో రాష్ట్రంలో అమలు చేయాల్సిన పలు సంక్షేమ పథకాలపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు జరుగుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేబినెట్ ఖండించింది. అలాగే ఉద్యోగుల జీతాలు, పింఛన్ల బకాయిలనూ వచ్చే రెండు నెలల్లో చెల్లించేందుకు కేబినెట్‌ ఆమోదించింది.

Recommended Video

AP Cabinet Key Decisions పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి రూ.500, డిసెంబర్ 15 కల్లా పంటనష్టం అంచనా..!
నివార్‌ తుపానుపై చర్చ

నివార్‌ తుపానుపై చర్చ

నివర్‌ తుపాను సహాయక చర్యలపై కేబినెట్ ప్రధానంగా చర్చించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 289 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు కేబినెట్ దృష్టికి తెచ్చారు. తుపాను కారణంగా పదివేల మందికి పైగా ప్రజలను సహాయక శిబిరాలకు తరలించారు. 30 వేల హెక్టార్టలో వ్యవసాయ పంటలు, 1300 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి రూ.500 నగదు ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశాలు ఇచ్చారు. అలాగే డిసెంబర్ 15 కల్లా పంటనష్టం అంచనాల రూపకల్పన, డిసెంబర్ 30 కల్లా పరిహారం చెల్లింపు పూర్తికావాలన్నారు.

 పోలవరం ఎత్తుపై

పోలవరం ఎత్తుపై

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై కేబినెట్‌లో ప్రత్యేకంగా చర్చ జరిగింది. పోలవరం ఎత్తు తగ్గింపుపై జరుగుతున్న ప్రచారాన్ని కేబినెట్ ఖండించింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు సెంటీమీటర్‌ కూడా తగ్గదని సీఎం జగన్‌ తేల్చిచెప్పారు. వాస్తవ డిజైన్ల ఆధారంగానే పోలవరం నిర్మాణం జరుగుతుందని జగన్‌ స్పష్టం చేశారు. దీనిపై జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రులకు జగన్‌ సూచించారు.

ఉద్యోగులపై నిర్ణయాలు

ఉద్యోగులపై నిర్ణయాలు

ఉద్యోగులు, పింఛన్‌దారుల డీఏ బకాయిల్ని చెల్లించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 3.144 శాతం డీఏ పెంపుకు ఆమోదం తెలిపింది. ఈ డీఏను ఈ ఏడాది జనవరి నుంచి వర్తింపచేస్తారు. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలన్నీ పూర్తిగా చెల్లించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అలాగే కరోనా సమయంలో ఉద్యోగులు, పింఛనర్ల జీతాలు, పింఛన్లలో మార్చి, ఏప్రిల్‌ నెలలో విధించిన కోతను డిసెంబర్‌, జనవరి నెలలో వారికి తిరిగి చెల్లించాలని నిర్ణయించారు.

 డిసెంబర్‌ 25 న ఇళ్ల పట్టాల పంపిణీ

డిసెంబర్‌ 25 న ఇళ్ల పట్టాల పంపిణీ


డిసెంబర్‌ 25న 30 లక్షల 60 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 175 నియోజకవర్గాల్లో డిసెంబర్‌ 25న ఇళ్ల పట్టాల పంపిణీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అదే రోజు ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభిస్తారు.
కోర్టు స్టేలు ఉన్న ప్రాంతాల్లో తర్వాతి దశలో ఇళ్ల పట్టాల పంపిణీకి మంత్రివర్గం నిర్ణయించింది. ఇళ్ల నిర్మాణం చేసుకునే వారికి ఉచితంగా ఇసుక ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అందరికీ ఇళ్లు ఉండేలా చూస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు.
స్ధానిక సంస్ధల పన్నులను సీఎంఎఫ్‌ఎస్‌ నుంచి డీ లింక్‌ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఏపీ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు పేరుతో ఎస్‌పీపీ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కొల్లేరు సెలినిటీ మిటిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటుకు కూడా కేబినెట్‌ నిర్ణయించింది. కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక హబ్‌లో ఏర్పాటయ్యే పరిశ్రమల రాయితీలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. టిడ్కో ఇళ్లను రూపాయికే ఇచ్చే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నారు.

రైతుల పథకాలకు ఆమోదం

రైతుల పథకాలకు ఆమోదం

డిసెంబర్‌ 15న రైతుల కోసం రూ.1227 కోట్లతో పంట బీమా పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ క్రాప్‌ బుకింగ్‌లో రైతులు బీమా చేసుకున్న పంటలకు ఉచితంగానే ఇన్సూరెన్స్‌ ప్రయోజనం అందనుంది. వచ్చే ఏడాది నాటికి ప్రభుత్వ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌ సేవలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ 2న పాల ఉత్పత్తిదారుల కోసం అమూల్‌ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. తొలిదశలో ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో బల్క్‌ చిల్లింగ్‌ సెంటర్ల అభివృద్ధి చేస్తారు. డిసెంబర్‌ 10న గొర్రెలు, మేకల యూనిట్లను సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు.. వైఎస్సార్‌ శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకం (సమగ్ర సర్వే)కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ.927 కోట్లతో భూముల సమగ్ర సర్వేకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులు..

అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులు..

త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది ఇందులో నాణ్యమైన పశుదాణా ఉత్పత్తి, పంపిణీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ఫిషరీస్‌ యూనివర్సిటీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏపీ గేమింగ్‌, యాక్ట్‌ను సవరిస్తూ ఆన్‌లైన్ గేమింగ్‌, గ్యాంబ్లింగ్‌పై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టేలా ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో గేమింగ్‌ చట్టం సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
పట్టణ ప్రాంతాల్లో ఆస్తిపన్ను సవరణ బిల్లు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వార్షిక అద్దె విలువ ప్రకారం నిర్ధారించే ఆస్తిపన్ను స్ధానంలో కొత్త విధానానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

English summary
andhra pradesh cabinet meeting convened today in velagapudi secretariat took some key decisions and approved various schemes related to public issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X