• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అసలు నేనక్కడ స్నానమే చేయలేదు: రాజమండ్రి ఘటనపై బాబు, మోడీ చెప్పినా ఆలోచిద్దాం

By Srinivas
|

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కొన్ని మార్పులు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వెల్లడించారు. ఆ మార్పులు ఏమిటన్నది జాగ్ర్తత్తగా గమనించి, రాష్ట్రానికి మేలు చేసేవి అయితే అంగీకరించాలని ఆయన చెప్పారు.

రాజమండ్రిలో మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పుష్కరాల తొలిరోజు రాజమండ్రిలో జరిగిన ఘటన మినహా పుష్కరాల ఏర్పాట్లు బాగా చేశామని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఈ సమయంలో చంద్రబాబు కొత్త ట్విస్ట్ ఇచ్చారని తెలుస్తోంది.

తాను అక్కడ స్నానం చేయడం వల్లే దుర్ఘటన జరిగిందని ప్రతిపక్షాలు అంటున్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ముహూర్తం ప్రకారం తాను స్నానం చేశానని, అయితే అక్కడ 3 గేట్లు ఉన్నాయని, తాను స్నానం చేసింది తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో కాదని చెప్పినట్లు తెలుస్తోంది.

దీనిపై ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పీతల సుజాతలు అనుమానం కూడా వ్యక్తం చేశారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌ను ఆమోదించింది. 2018లోగా తొలిదశ పూర్తి చేయాలని తీర్మానించింది. అదేవిధంగా తహసీల్దారు వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని అనుచరుల దాటి ఘటనలో వనజాక్షిది తప్పని తేల్చింది.

ఏపీ కేబినెట్

ఏపీ కేబినెట్

మంత్రివర్గ సమావేశాలను రాష్ట్రంలోని పలు నగరాల్లో రానున్న రోజుల్లో నిర్వహించాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు. ఇంతవరకు విశాఖపట్నం, రాజమండ్రిలో మంత్రివర్గ సమావేశాలు నిర్వహించామని, ఇకపై ఇతర నగరాల్లో నిర్వహించాలని నిర్ణయించారు.

ఏపీ కేబినెట్

ఏపీ కేబినెట్

పుష్కర ఘాట్ ఘటనలో 27 మంది యాత్రికుల మృతిపై మంత్రివర్గం సంతాపం వ్యక్తం చేస్తూ 2 నిమిషాల సేపు వౌనం పాటించింది. ఈ ఘటనపై న్యాయ విచారణను హైకోర్టు రిటైర్డు జడ్జి చేత విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఏపీ కేబినెట్

ఏపీ కేబినెట్

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను ఉప్పలపాడు, వుయ్యలవాడ గ్రామాల్లో సర్వే నంబర్లు 433లో 2297.13 ఎకరాల్లో జాతీయ ఓపెన్ ఎయిర్ రేంజ్ డిఆర్‌డివో మిసైల్ టెస్టింగ్ కేంద్రాన్ని నెలకొల్పనున్నారు. ఈ అంశంపై వచ్చే కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు.

ఏపీ కేబినెట్

ఏపీ కేబినెట్

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అవడం వల్ల పదేళ్ళపాటు హక్కు ఉంటుందని, ఆ హక్కును వదులుకోకుండా దశల వారీగా ప్రభుత్వ శాఖలను విజయవాడకు తరలించనున్నట్టు ఆయన చెప్పారు. విజయవాడ మేధా టవర్స్, ఇతర భవనాలకు ప్రభుత్వ శాఖలను తరలించాలని ప్రజలకు ప్రభుత్వం దగ్గరగా ఉండాలని మంత్రి వర్గం నిర్ణయించింది.

English summary
The Andhra Pradesh Cabinet, which met here for four hours on Wednesday, approved the master plan for the new capital - Amaravati - submitted by the Singapore team.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more