వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మండలి రద్దు చేసేద్దాం: మాడు రాజధానులపై ఇలా..! ఏపీ కేబినెట్ కీలక భేటీ...!

|
Google Oneindia TeluguNews

వారం రోజుల సమయంలోనే మరో సారి ఏపీ కేబినెట్ సమావేశం అవుతోంది. గత సోమవారం ఇదే విధంగా సమావేశమైన ఏపీ మంత్రివర్గం పరిపాలనా వికేంద్రీకరణ..సీఆర్డీఏ బిల్లు రద్దు వంటి కీలక నిర్ణయాల కు ఆమోద ముద్ర వేసింది. ఇక, ఈ రోజు కేబినెట్ సమావేశంలోనూ కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయి. కొద్ది రోజులుగా ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మండలి రద్దు పైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. మండలి రద్దు ఖాయమని అధికార పార్టీ నేతలు గట్టిగా చెబుతున్నారు. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్సీల్లో మాత్రం ఇంకా చివరి ఆశలు కనిపిస్తున్నాయి. దీని పైన కేబినెట్ లో మంత్రుల అభిప్రాయాలను సేకరించిన తరువాత ముఖ్యమంత్రి తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఈ కేబినెట్ సమావేశంలోనే మండలి రద్దుకు నిర్ణయించి..ఆ వెంటనే ఈ రోజు జరిగే అసెంబ్లీ సమావేశంలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి నివేదించాలని ఏపీ ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది.

మండలి రద్దు ఖాయమేనా..
ఏపీ కేబినెట్ సమావేశంలో మండలి రద్దు దిశగా నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. కేబినెట్‌ భేటీ అనంతరం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశంలో.. బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాత తలెత్తిన పర్యవసానాలపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. ఏపీ శానస మండలిని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర సర్కారు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఆమోదించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. కేబినెట్ లో మంత్రులు ఇప్పటికే ముఖ్యమంత్రి అభిప్రాయం మేరకే ముందుకు వెళ్లాలని సూచించినట్లుగా తెలుస్తోంది. మండలి సభ్యులుగా ఉంటూ కేబినెట్ లో కొనసాగుతున్న ఇద్దరు మంత్రులు సైతం సీఎం నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. కేబినెట్ లో నిర్ణయం వెంటనే ఆ ఇద్దరు నైతికతకు ప్రాధాన్యత ఇస్తూ రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే, దీని పైన సీఎం సూచనల మేరకు వారు నడుచుకొనే ఛాన్స్ ఉంది. దీంతో..కేబినెట్ లో పార్టీ పరంగా మండలి సీట్ల పైన ఆశావాహులకు సైతం ఎలాంటి భరోసా ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

AP Cabinet Crucial meet may take decision on abolish of Council

Recommended Video

Abolish Of AP Legislative Council Resolution In Assembly After AP Cabinet Passes || Oneindia Telugu

వికేంద్రీకరణ పైనా చర్చ..
మంత్రివర్గ సమావేశంంలో మండలితో పాటుగా ఇతర కీలక అంశాల పైన చర్చ జరగనుంది. లెజిస్లేటివ్‌ రాజధానితోపాటు ఎగ్జిక్యూటివ్‌ రాజధాని, జ్యుడీషియల్‌ రాజధాని ఏర్పాటు బిల్లు, సీఆర్‌డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు బిల్లు మండలిలో నిలిచిపోయిన నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అలాగే శాసన మండలి రద్దుకు అనుకూలంగా కేబినెట్‌ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతోపాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మచిలీపట్నం పోర్టు నిర్మాణాలపైనా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అర్హులైన పేదలందరికీ ఉగాది పర్వదినం రోజున ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన భూముల సేకరణపైనా చర్చించే అవకాశం ఉంది.

English summary
AP Cabinet Crucial meet may take decision on abolish of Council. After That Govt may introduce resolution on this. Assembly ask central goct to abolish council as per unanimous resolution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X