వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఆర్డీఏ చట్టం రద్దు..! పరిపాలనా వికేంద్రీకరణకు ఆమోదం: ఏపీ కేబినెట్ కీలక భేటీ..!

|
Google Oneindia TeluguNews

ఏపీ కేబినెట్ కీలక భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో కాసేపట్లో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టే కీలక బిల్లులకు ఆమోద ముద్ర వేయనున్నారు. జీఎన్ రావు..బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదిక లపైన అధ్యయనం చేసిన హైపవర్ కమిటీ 130 పేజీల సమగ్ర నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. ఇప్పుడు జరుగుతున్న కేబినెట్ సమావేశంలో దీనిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్దిక మంత్రి బుగ్గన మంత్రివర్గ సహచరులకు వివరణ ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో ఏపీ డీసెంట్రలైజేషన్‌ అండ్ ఈక్వల్ డెవలప్మెంట్‌ ఆఫ్ ఆల్ రిజీయన్స్‌ బిల్‌-2020 కు ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం. అదే సమయంలో కీలకమైన సీఆర్డీఏ చట్టం రద్దు చేసి...కొత్తగా అమరావతి మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ 2020 బిల్లును ఆమోదించే అవకాశం కనిపిస్తోంది.

కీలక నిర్ణయాల దిశగా..
కీలక నిర్ణయాల దిశగా ఏపీ ఏపీ కేబినెట్‌ సమావేశం కానుంది. సీఆర్డీఏ చట్టం రద్దుతో పాటుగా జోనల్‌ అభివృద్ధి కౌన్సిల్‌ బిల్లులను కేబినెట్‌ ఆమోదిందే అవకాశం ఉంది. కేబినెట్ లో ఆమోదించిన బిల్లులను కాసేపట్లో ప్రారంభమయ్యే అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. కేబినెట్ తరువాత బీఏసీ సమావేశం కానుంది. ఆ తర్వాత 11గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. సీఆర్డీఏ చట్టం రద్దు, జోనల్‌ అభివృద్ధి కౌన్సిల్‌ బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. మూడు రాజధానుల ప్రతిపాదనల పైన హైపవర్ కమిటీ 130 పేజీల సమగ్ర నివేదిక ఇచ్చింది. ఇదే విషయమై క్యాబినెట్‌ సమావేశంలో మంత్రివర్గ సభ్యులందరికీ హై పవర్‌ కమిటీ.. ప్రజెంటేషన్‌ ఇవ్వనుంది. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి ఉద్దేశించిన బిల్లులపై చర్చ జరగనుంది.

AP Cabinet discussing on crucial power decentralisation bill and CRDA repeal act

అసెంబ్లీ వ్యూహం... ఇన్ సైడర్ ట్రేడింగ్ పైనా..
ఇక, ఇదే సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం పైన మంత్రులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీలో మూడు ప్రాంతాలకు చెందిన సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అదే విధంగా ఇప్పటికే ప్రభుత్వానికి అందిన అమరావతి భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ పైన ఏ రకమైన విచారణకు ఆదేశించాలనే అంశం పైన ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకో నున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణుల అభిప్రాయాలు సేకరించారు. సీబీఐ కి ఇవ్వాలని తొలుత భావించినా..లోకాయుక్తకే ఈ విచారణ బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఇక, సీఆర్డీఏ చట్టం రద్దు నేపథ్యంలో అమరావతి రైతులకు ప్రభుత్వం నుండి ఏ రకమైన ప్యాకేజి అమలు చేసే అంశం పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. మండిలో బిల్లులను అడ్డుకుంటామని టీడీపీ చెబుతున్న సమయంలో అక్కడ అనుసరించాల్సిన వ్యూహాల పైనా నిర్ణయానికి రానున్నారు. ఇక, ఇదే సభలో గతంలో ఆమోదించిన ఇంగ్లీషు మీడియం పాఠశాలలు.. ఎస్సీలకు రిజర్వేషన్ల బిల్లులను మండలి తిప్పి పంపింది. వీటిని సైతం ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించనున్నారు.

English summary
AP Cabinet discussing on crucial power decentralisation bill and CRDA repeal act. After that Govt introduce bills in Assembly. may take decision on probe on Insider trading in Amaravati lands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X