• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీలో మరోసారి మంత్రివర్గ విస్తరణ! డిసెంబర్‌లో క్యాబినెట్‌లో భారీ మార్పులు

|

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మంత్రి వర్గ విస్తరణ జరగనుందా? సిఎం చంద్రబాబు మళ్లీ క్యాబినెట్లో మార్పులు చేర్పులు చెయ్యాలనుకుంటున్నారా? చేస్తే మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయి అని టిడిపి వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఇంక ఏడాది మాత్రమే సమయం ఉండటంతో ప్రభుత్వానికి సంబంధించి రాబోయే సంవత్సరం అతికీలకం కానుంది.

తమ పరిపాలన పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు తపన. అందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న క్యాబినెట్లో ఎవరైతే తన అంచనాకు తగిన విధంగా రాణించలేకపోతున్నారో, ఎవరైతే ప్రభావవంతంగా పనిచెయ్యలేకపోతున్నారో ,ఎవరైతే పదే పదే విమర్శలపాలవుతున్నారో అలాంటివారిని పక్కకు తప్పించడమో, లేదా వారిని మంత్రివర్గంలో కొనసాగించడం అనివార్యమైన పక్షంలో శాఖలో మార్పు అయినా చెయ్యాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మరోవైపు ఎన్నికలకు ముందు ఉండే అతికొద్ది సమయాన్ని ఎవరైతే సమర్థవంతంగా వినియోగించుకోగలరో, సిఎం చంద్రబాబు ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోగలరో, చంద్రబాబు భావిస్తున్నట్లుగా టిడిపి ప్రభుత్వం విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలరో అలాంటి వారికి ఈ సారి క్యాబినెట్లో తప్పకుండా చోటు కల్పించాలని సిఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. ఇదే మంత్రి వర్గ విస్తరణలో లోకేష్ ఆశీస్సులు మెండుగా ఉన్న మరి కొందరికి సైతం స్థానం లభించబోతోందని భోగట్టా.

AP Cabinet Expansion again

అయితే ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకునేవారి పేర్లు కొంత అలజడి సృష్టించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి క్యాబినెట్లో చోటు దక్కించుకునేవారిలో అనంతపురం జిల్లా నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి, వెస్ట్ గోదావరి నుంచి చింతమనేని ప్రభాకర్, ఒంగోలు నుంచి గొట్టిపాటి రవికి మంత్రివర్గములో స్థానము కలిపించనున్నారట! ఇక

చంద్రబాబు కుడిభుజం అనుకున్న పి.నారాయణను మంత్రివర్గం నుంచి పక్కనబెట్టి పార్టీ కార్యక్రమాలకే పరిమితం చేసే అవకాశం ఉందని, అలాగే పార్టీలో బాగా సీనియర్ అయ్యుండి, చంద్రబాబు దగ్గరకు ఎప్పుడైనా వెళ్లగలిగే స్థాయి వున్న యనమల రామకృష్ణడు ని కూడా క్యాబినెట్ నుంచి తప్పించే అవకాశం వుందని తెలుస్తోంది. అయితే ఈయనకు రాజ్య సభ ఛాన్స్ దక్కవచ్చనేది సమాచారం. అలాగే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్యమంత్రికి విధేయుడిగా ఉన్నా క్యాబినెట్లో సామాజిక సమీకరణాల సమతుల్యత కోసం పక్కనబెట్టొచ్చనేది టాక్.

అలాగే పార్టీని గాడిలో పెట్టేందుకు గొట్టిపాటి రవిని తీసుకునే పక్షంలో శిద్దా రాఘవరావును పక్కన పెట్టొచ్చని, భవిష్యత్ లో ఆయనకు కూడా రాజ్య సభ సీటు హామీ అనేది టిడిపి నేతల అంతర్గత చర్చల సారాంశం. ఇక పార్టీ లో ఫైర్ బ్రాండ్ గా పేరు పడ్డ చింతమనేని ప్రభాకర్ కు కూడా క్యాబినెట్ లో అవకాశం లభించవచ్చట. ఈయన ఎప్పుడూ వివాదాలకు దగ్గరగా ఉంటారనే పేరు ఉన్నప్పటికీ పార్టీ పరంగా ఆయన కనబర్చే అంకిత భావమే ఆయనకు ఛాన్స్ దక్కేలా చేస్తోందట.

ఇక వైసీపీ నుంచి పార్టీలో చేరిన ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టిపాటి రవికి వచ్చే క్యాబినెట్ లో బెర్త్ దొరకవచ్చని తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో టిడిపిని ఏకతాటిపై నడిపించేలా ఒకరిని సన్నద్దం చెయ్యాలని చంద్రబాబు భావిస్తున్నారని, ఆ దిశలో గొట్టిపాటి రవికి అవకాశం రావొచ్చని అంచనావేస్తున్నారు. ఈయనకు యువనేత లోకేష్ ఆశీస్సులు కూడా ఉన్నాయని ఆ రకంగా ఈయనకు మంత్రి పదవి రావొచ్చని తెలుస్తోంది. అయితే లోకేష్ కేటగిరిలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేరు కూడా వినిపిస్తున్నందున ఇద్దరూ పదవి పొందుతారా? లేక ఒకరికే ఆ అవకాశం దక్కుతుందా అనే విషయం పై స్పష్టత కోసం వేచి చూడాల్సిందే. అలాగే జగన్ ఇలాకా కడప జిల్లాకే చెందిన మంత్రి, వైసిపి నుంచి వచ్చి ఆ పార్టీ అధినేతే లక్ష్యంగా విమర్శల వర్షం కురిపిస్తున్న ఆదినారాయణ రెడ్డికు ఇప్పుడున్న శాఖను మార్చి మంచి పోర్టు పోలియో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసే ఈ మార్పుల వల్ల రాజకీయ ప్రయోజనం భారీగా ఉండాలనేది చంద్రబాబు ఆకాంక్ష. ఏదేమైనా సిఎం చంద్రబాబు ఈసారి క్యాబినెట్లో చేసే మార్పులు చేర్పులే పార్టీ భవిష్యత్తుకు సంబంధించి కీలక పాత్ర పోషిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The TDP circles in Andhra Pradesh are abuzz with speculations of a likely expansion or reshuffle of state council of ministers, that this is definitely going to happen after november month. The sources lead by TDP said Babu is surely going to change the ministers in the cabinet who are working on poor performance and that places should be replaced with strong leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more