• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇంకొద్ది గంటల్లో మంత్రిగా ప్రమాణం.. సీదిరి అప్పలరాజు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఎవరికి ఏ శాఖ?

|

చారిత్రక పలాస నుంచి మొదటిసారే బరిలోకి దిగి.. మహామహుల్ని మట్టికరిపించిన యువ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు.. ఇప్పుడు సీనియర్లను సైతం తోసిరాజని మంత్రి పదవి చేపట్టబోతున్నారు. ఇంకొద్ది గంటల్లో కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేయనున్న ఆయన.. తనకు లభించిన పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి పదవి చేపట్టబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

జగన్ గృహప్రవేశం నాడే రోజా కుండబద్దలు - వేణుగోపాల్ మాటే ఫైనల్ - రఘురామకు రాష్ట్రపతి రివర్స్ షాక్

అస్సలు ఊహించలేదు..

అస్సలు ఊహించలేదు..

మంత్రి పదవి వస్తుందని అసలు ఊహించనే లేదని, ఇది తనకు దక్కిన అదనపు అదృష్టంగా భావిస్తున్నానని, ప్రజాజీవితంలో ఇప్పుడు తన బాధ్యత పెరిగిందని సీదిరి అప్పలరాజు అన్నారు. ఏ శాఖ కేటాయిస్తారనేంత లోతుగా ఆలోచించలేదని, తనపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఉద్దానం ప్రాంతానికి కేబినెట్ లో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. గతంలో టీడీపీ నుంచి శివాజీ కొద్ది నెలలు మాత్రమే మంత్రిగా పనిచేశారు. ఆ లోటును భర్తీ చేయడంతోపాటు ఉద్దానం కడ్నీ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారాలు చూపే దిశలో స్వతహాగా డాక్టరైన అప్పలరాజు సేవలు పనికొస్తాయని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంంది.

పలాసలో పటాకులు.. గురువుల చెంతకు..

పలాసలో పటాకులు.. గురువుల చెంతకు..

అప్పలరాజు తన మొదటి ప్రయత్నంలోనే శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా బలమైన గౌతు కుటుంబాన్ని ఢీకొట్టారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీషపైనే విజయం విజయం సాధించారు. తొలి దశలోనే ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగినా, ఏడాది ఆలస్యంగా అది నిజమైంది. మంత్రి పదవి ఖరారైనట్లు తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచి సమాచారం అందిన వెంటనే.. తాను రాజకీయ గురువులుగా భావించే ధర్మాన ప్రసాదరావు, స్పీకర్ తమ్మినేని సీతారాంలను కలుసుకుని ఆశీర్వాదాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు సీనియర్లూ మంత్రి పదవుల కోసం చివరిదాకా ప్రయత్నించినా, అదృష్టం అప్పలరాజును వరించడం గమనార్హం. పదవి గురించి తెలసిన తర్వాత సీదిరి అనుచరులు పలాసలో పటాకులు పేల్చుతూ, స్వీట్లు పంచుతూ హడావిడి చేశారు.

మాజీ ప్రధాని కూతురికి కేసీఆర్ ఆఫర్!.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా వాణిదేవి?.. టీఆర్ఎస్ అనూహ్య ఎత్తుగడ..

ఇదే ముహుర్తం..

ఇదే ముహుర్తం..

ఏపీ క్యాబినెట్ విస్తరణకు బుధవారం(22న) మధ్యాహ్నం 1.29 నిమిషాలకు ముహుర్తం ఖరారైంది. కరోనా నేపథ్యంలో రాజ్ భవన్ లో నిరాడంబరంగా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకే సీఎం జగన్ రాజ్ భవన్ కు చేరుకోనున్నారు. అనుకున్న ముహుర్తానికే గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించనుననారు. రాజ్యసభకు ఎన్నికైనందున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణల రాజీనామాలను గవర్నర్ ఇదివరకే ఆమోదించారు. పిల్లి స్థానంలో తూర్పు గోదావరి జిల్లా నుంచే శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, మోపిదేవి స్థానంలో శ్రీకాకుళం జిల్లా మత్స్యకార కుంటుంబానికి చెందిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే..

  Audio Tapes కలకలం... Congress దూకుడు, రెబల్‌ ఎమ్మెల్యేల కు Show Cause Notices, BJP వ్యూహం ?
  శాఖల కేటాయింపులపై సస్పెన్స్..

  శాఖల కేటాయింపులపై సస్పెన్స్..

  కొత్తగా ప్రమాణం చేయబోయే ఇద్దరు మంత్రులకు ఏ శాఖలు కేటాయించబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. మొన్నటి వరకు పిల్లి సుభాష్ చంద్రబోస్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖలను.. మోపిదేవి వెంకటరమణ పశు సంవర్థక, మత్స్య, మార్కెటింగ్ శాఖలను నిర్వహించారు. కొత్త మంత్రులకు అవే శాఖలు కేటాయిస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రోడ్లు, భవనాల శాఖకు మంత్రిగా ఉన్న ధర్మానకు రెవెన్యూ శాఖను అప్పగించి, డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, మంత్రులంతా పదవులు చేపట్టి ఏడాది మాత్రమే పూర్తికావడం, కేబినెట్ సంపూర్ణ ప్రక్షాళనకు సీఎం జగన్ విధించిన గడువు ఇంకా ఏడాదిన్న గడువున్న నేపథ్యంలో భారీ ఎత్తున శాఖల మార్పులు ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తోంది.

  English summary
  Day before sworn in ceremony, seediri appalaraju interesting comments on minister post. along with chelluboyina venu gopala krishan he will sworn in as ap ministers on wednesday
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X