వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనం: కాపులకు 5 శాతం రిజర్వేషన్, ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు...

ఏపీ కేబినెట్‌‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు భేటీ అయిన కేబినెట్ పలు అంశాలపై చర్చించింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Cabinet Key Decesions : 5 Percent Reservations To Kapus | Oneindia Telugu

అమరావతి: ఏపీ కేబినెట్‌‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు భేటీ అయిన కేబినెట్ పలు విషయాలపై నిశితంగా చర్చించి కొన్ని పాలసీలకు ఆమోదం తెలిపింది.

ఇక‌ బీసీల‌కు ఉద్యోగాలు రానట్టే, పెద్ద ఎత్తున ఉద్య‌మించాల్సిందే: ఎమ్మెల్యే ఆర్.కృష్ణ‌య్య‌ఇక‌ బీసీల‌కు ఉద్యోగాలు రానట్టే, పెద్ద ఎత్తున ఉద్య‌మించాల్సిందే: ఎమ్మెల్యే ఆర్.కృష్ణ‌య్య‌

కాపు రిజర్వేషన్: విద్యా, ఉపాధి రంగాల్లో మాత్రమే, మంజునాథన్ కమిషన్ నివేదిక ఏం చెప్పిందంటే..కాపు రిజర్వేషన్: విద్యా, ఉపాధి రంగాల్లో మాత్రమే, మంజునాథన్ కమిషన్ నివేదిక ఏం చెప్పిందంటే..

సమావేశంలో ముఖ్యంగా కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఏపీలో రిజర్వేషన్లు 55 శాతానికి చేరనున్నాయి. రేపు ఉదయం మళ్లీ మరోసారి కేబినెట్ సమావేశం జరగనుంది.

AP Cabinet Key Decesions.. Lands for Construction of Party Offices

ఈ మేరకు తీర్మానాన్ని శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. అంతకుముందు జస్టిస్ మంజునాథ నేతృత్వంలోని బీసీ కమిషన్ కేబినెట్ సభ్యులకు తన నివేదిక అంశాల్ని వివరించింది.

ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఏపీలో రిజర్వేషన్లు 55 శాతానికి చేరనున్నాయి. రేపు ఉదయం మళ్లీ మరోసారి కేబినెట్ సమావేశం జరగనుంది. అలాగే 2017-20 ఐటీ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

దేశంలోనే తొలిసారిగా నూతన ఐటీ పాలసీకి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒకే చోట ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతన విధానం ఏపీలో ఐటీకి మరింత ఊతమివ్వనుంది.

పోలవరం హైడ్రో పవర్‌స్టేషన్‌ను కేబినెట్‌ అంగీకరించింది. రూ.వెయ్యి కోట్ల రుణం తీసుకునేందుకు ఆర్టీసీకి అనుమతినిచ్చింది. 8 శాతం వడ్డీతో రుణం కోసం ఆర్టీసీ కేబినెట్‌ను అనుమతి కోరింది.

నియోజకవర్గాల్లో స్థలాలు, భవనాలు లేని జాతీయ పార్టీలు, గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలకు కార్యాలయాల నిర్మాణం కోసం 25 సెంట్ల స్థలం కేటాయించాలని కూడా ఏపీ కేబినెట్ నిర్ణయించింది.

ఏడాదికి రూ. వెయ్యి లీజుతో ఆయా పార్టీలకు స్థలాలు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. స్థలం కేటాయించిన అనంతరం మూడేళ్లలో ఆ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది

వాల్మీకీ, బోయలను ఎస్టీల్లో చేర్చాలని సత్యపాల్ కమిటీ ఇచ్చిన నివేదికకు కూడా కేబినేట్ ఆమోదముద్ర వేసింది. వాల్మీకీ, బోయలను ఎస్టీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసింది.

English summary
AP Cabinet taken lot of key decesions on Friday meet here in Amaravathi under the presidentship of AP CM Chandrababu Naidu. Important decesion is that AP Cabinet taken decesion on Kapu Reservation. For Kapu, Balija, Telaga, some more casts 5 percent reservation will be given. Cabinet taken decesion to allot 25 cents of land to the political parties on lease of Rs.1000 for every year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X