అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టార్గెట్ టీడీపీ లోని ఆ నేతలే: అసైన్డ్‌ భూములపై నిర్ణయం వెనుక: ఏం జరుగుతోంది..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానికి సంబంధించిన భూముల వ్యవహారంలో ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొంత కాలంగా అసలు రాజధానిగా అమరా వతి కొనసాగుతుందా లేదా అనే చర్చకు స్పష్టత పూర్తిగా రాకముందే..మరో నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసి ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చిన అసైన్డ్‌ భూములకు రెసిడెన్షియల్, కమర్షియల్‌ ప్లాట్ల కేటాయింపు రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో అసలైన అసైన్డ్‌ దారులకు వాటినిక కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయం వెనుక భారీ కసరత్తు జరిగినట్లుగా తెలుస్తోంది. దీని అసలు లక్ష్యం ఆ భూములు కీలకమైన టీడీపీ నేతల బినామీ చేతుల్లో ఉన్నాయనే సమాచారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వంలో ప్రచారం సాగుతోంది.

అచ్చెన్నకు సీఎం జగన్ పలకరింపుతో..: ఈ నెల 17వరకు ఏపీ అసెంబ్లీ: బీఏసీలో ఆసక్తికర పరిణామాలు...!అచ్చెన్నకు సీఎం జగన్ పలకరింపుతో..: ఈ నెల 17వరకు ఏపీ అసెంబ్లీ: బీఏసీలో ఆసక్తికర పరిణామాలు...!

అసైన్డ్ భూములకు ప్లాట్ల కేటాయింపు రద్దు
సీఆర్డీఏ పరిధిలోని రాజధాని అసైన్డ్‌ భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత‍్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసి ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చిన అసైన్డ్‌ భూములకు రెసిడెన్షియల్, కమర్షియల్‌ ప్లాట్ల కేటాయింపు రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో అసలైన అసైన్డ్‌ దారులకు ప్రభుత్వ నిర్ణయం భారీ ఊరటనిచ్చింది. అసలైన అసైన్డ్‌దారులకు నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ నిర్ణయించింది. ఫిబ్రవరి 17,2016న జీఓఎంఎస్‌ -41 ప్రకారం ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చిన అసైన్డ్‌ భూములకు రెసిడెన్షియల్, కమర్షియల్‌ ప్లాట్ల కేటాయింపు రద్దు చేస్తూ... ఏపీ అసైన్డ్‌ ల్యాండ్స్‌ (ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్స్‌)-1977 నాటి చట్టాన్ని ఉల్లంఘించారన్న మంత్రివర్గం..అసలైన అసైన్డ్‌దారులకు రెసిడెన్షియల్, కమర్షియల్‌పాట్లు కేటాయించాలని నిర్ణయించింది.

AP Cabinet key decision on Assigned lands in capital Amaravati Area

నిజమైన లబ్దిదారులకు ప్లాట్లు అందుతాయా..
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం అసలైన అసైన్డ్‌దారులకు నివాస, వాణిజ్య ప్లాట్లు అందనున్నాయి. అయితే, అసైన్డ్ భూములు క్రయవిక్రయాలకు ఎవరికీ అవకాశం లేదు. అయితే, గత ప్రభుత్వం లో మాత్రం దీనికి కొంత మేర మినహాయింపు ఇచ్చారు. దీని ద్వారా అసైన్డ్ భూములను సైతం భూ సమీకరణకు ఇచ్చి..దాని ద్వారా ప్రభుత్వం నుండి ఇతర భూములకు ఇచ్చినట్లుగానే రెసిడెన్షియల్, కమర్షియల్‌ ప్లాట్ల కేటాయింపు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ వీటి పైన ఫోకస్ చేసే ముందు భారీ కసరత్తు చేసారని సమాచారం. ఈ అసైన్డ్ భూములను నాడు టీడీపీలో తెర వెనుక ఉన్న కొందరు ప్రముఖులు కొనుగోలు చేసి..వాటిన భూ సమీకరణకు ఇచ్చి..ప్రతిఫలంగా రెసిడెన్షియల్, కమర్షియల్‌ ప్లాట్ల కేటాయింపులో లబ్ది పొందారని సమాచారం ముఖ్యమంత్రికి చేరినట్లు చెబుతున్నారు. అయితే, చట్ట పరంగా ఇది సరైన విధానం కాకపోవటంతో వీటి పైన కీలక నిర్ణయం దిశగా కేబినెట్ సమావేశంలో ప్రతిపాదించి..నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

English summary
AP Cabinet key decision on Assigned lands in capital Amaravati Area. Govt approved to canell commercial and residnetial lands allotement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X