వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నిక‌ల ముందు : ఏపి క్యాబినెట్ కీల‌క భేటీ : అన్నదాతా సుఖీభవ కు ఆమోదం..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో దాదాపుగా ఈ విడ‌త చివ‌రి మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌రుగుతోంది. 14న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్.. త్వ‌ర‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ రానుంది. దీంతో..పెండింగ్ హామీలు..కీల‌క నిర్ణ‌యాల దిశ‌గా ఈ క్యాబినెట్ స‌మావేశం లో ఆమోద ముద్ర ప‌డ‌నుంది.

కీల‌క నిర్ణ‌యాల దిశ‌గా..
ఎన్నిక‌ల ముందు దాదాపుగా చివ‌రి క్యాబినెట్ స‌మావేశం జ‌రుగుతోంది. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా ఏపిలో గ్రీన్ కారి డార్ పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. జిల్లా ఆస్ప‌త్రుల స్థాయిని పెంపు నిర్ణ‌యం పైనా ఆమోద ముద్ర వేయ‌నున్నారు. అమ‌రావ తిలో అఖిల భార‌త్ సర్వీస్ అధికారుల‌కు ఇళ్ల స్థ‌లాల కేటాయింపుల పై చ‌ర్చించి..ఆమోదం తెల‌పునున్నారు.

ప‌లు జిల్లాలో ఏపిఐఐసి కి భూముల కేటాయింపుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే అవ‌కాశం ఉంది. ఇక‌, 50 ఏళ్ల‌కే గిరిజ‌నుల‌కు పెన్ష‌న్ ఇవ్వాల‌ని ఇప్ప‌టికే తీసుకున్న నిర్ణ‌యానికి ఆమోద ముద్ర వేస్తారు. ఇక‌, ఢిల్లీలో చంద్ర‌బాబు నిర్వ‌హించిన దీక్ష స‌క్సె స్ అయింద‌ని భావిస్తున్న నేత‌లు..భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ఈ స‌మావేశంలో నిర్ణ‌యించ‌నున్నారు.

AP Cabinet Key decisions : approve Anna data sukhibhava scheme..!

రైతు సుఖీభ‌వ కు ఆమోదం..!
తాజా బ‌డ్జెట్ లో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రకటించిన అన్నదాతా సుఖీభవ పథకా నికి సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర మంత్రివర్గం ఖరారుచేయనుంది. ఈ పథకం కింద ఎకరాకు ఎంతివ్వాలి.. ఎప్పుడివ్వాలి.. పథకం నియమ, నిబంధనలు ఏమిటో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది.

రాష్ట్రంలో ఖరీఫ్‌, రబీ ల్లో కలిపి ఈ దఫా 1.80 కోట్ల ఎకరాలు సాగవుతుందని అంచనా వేస్తున్నారు. ఎకరాకు ఒక్కో పంటకు రూ.2,500 ఇవ్వాల ని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెండు పంటలకు కలిపి ఎకరాకు రూ.5 వేలవుతాయి. దీనిపై ఇంకా లోతుగా చర్చించి.. ఇంతే ఇవ్వాలా.. లేక ఇంకొంచెం పెంచే వీలుందో పరిశీలించి ఖరారు చేస్తారుని తెలుస్తోంది.

English summary
Before day of MLC elections Schedule Ap Cabinet key meeting going on. My be this is the last meeting for present govt. In this meeting Govt taking key decisions and also accept New Farmer Scheme which announce in last budget.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X