• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రాజధానిపై టెన్షన్..టీడీపీ నాయకుల హౌస్ అరెస్ట్ లు..జగన్ ఓ డిక్టేటర్ అని చంద్రబాబు మండిపాటు

|

ఏపీలో నేడు రాజధాని విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్న నేపధ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. రాజధాని ప్రాంతంలోనూ ఆందోళనను అదుపు చెయ్యటానికి పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించి ఉద్రిక్తత తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.

ఏపీ రాజధాని విషయంలో జగన్ సంచలన నిర్ణయం నేడే

ఏపీ రాజధాని విషయంలో జగన్ సంచలన నిర్ణయం నేడే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం అని,అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని సూచనప్రాయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సభలో చేసిన ప్రకటన, ఆపై నిపుణుల కమిటీ నివేదిక ఏపీ రాజధాని ముక్కలు కాబోతుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. ఇక నేడు జరగనున్న మంత్రివర్గ సమావేశం కూడా ఏపీ రాజధాని విషయంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్తోంది.

ఏపీ పరిపాలనా రాజధానిగా వైజాగ్ చేసే ఛాన్స్

ఏపీ పరిపాలనా రాజధానిగా వైజాగ్ చేసే ఛాన్స్

ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా వైజాగ్ ను ఏర్పాటు చేసేందుకు ఏపీ సర్కార్ దాదాపు సిద్ధం అయినట్టు తెలుస్తుంది. మొదటి నుండీ మూడు రాజధానుల ఏర్పాటుపై విముఖత వ్యక్తం చేస్తున్న టీడీపీ, నేడు రాజధాని విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు క్యాబినెట్ కీలక భేటీ నిర్వహిస్తున్న నేపధ్యంలో ఎలాంటి ఆందోళనలకు దిగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

నేడు రాజధాని రైతుల మహా ధర్నా .. టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు

నేడు రాజధాని రైతుల మహా ధర్నా .. టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు

నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్,క్యాబినెట్ మీటింగ్ నిర్వహించనుండటం, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు నేడు మహాధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడకుండా తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారు.తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ ఉదయం నుండి వారిని ఇంటి నుంచి కదలనివ్వలేదు.

టీడీపీ నేతల ఇళ్ళ వద్ద భారీగా మోహరించిన పోలీసులు

టీడీపీ నేతల ఇళ్ళ వద్ద భారీగా మోహరించిన పోలీసులు

వీరు ప్రకాశం బ్యారేజ్ వద్ద 'రాజధాని పరిరక్షణ సమితి' పిలుపునిచ్చిన నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు బయలుదేరగా, వారిని ఆడుకున్న పోలీసులు ఇంటికే పరిమితం చేశారు. . పలువురు స్థానిక నేతలను కూడా పోలీసులు నిన్నటి నుంచి గృహ నిర్బంధంలో ఉంచారు. ఇక నేడు మూడు రాజధానుల విధానంపై మంత్రివర్గం నేడు కీలక నిర్ణయం తీసుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో, విజయవాడలోని అందరు టీడీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. రాజధాని ప్రాంత టీడీపీ నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు.

చంద్రబాబు మండిపాటు.. జగన్ ఓ డిక్టేటర్, పోలీసు రాజ్యం నడుపుతున్నారని ఫైర్

చంద్రబాబు మండిపాటు.. జగన్ ఓ డిక్టేటర్, పోలీసు రాజ్యం నడుపుతున్నారని ఫైర్

ఇక ఈ గృహ నిర్బంధాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలతో అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం భయాందోళనలకు గురి చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. జగన్ ఓ డిక్టేటర్ లాగా వ్యవహరిస్తున్నారని, పోలీసుల రాజ్యాన్ని నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఉంచరన్న ఆందోళనను తమ చర్యల ద్వారా మరింత పెంచుతున్నారని అన్నారు. విభజన రాజకీయాలను నడుపుతున్నారని, ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. నేడు కీలక నిర్ణయం నేపధ్యంలో ఎక్కడికక్కడ ఆందోళనల అణచివేతకు పాల్పడుతున్న తీరు ప్రతిపక్ష పార్టీలకు ఆగ్రహం తెప్పిస్తుంది.

English summary
Two Telugu Desam Party (TDP) lawmakers were placed under house arrest in Andhra Pradesh's Vijayawada to allegedly prevent them from attending a farmer agitation on Thursday, a day ahead of a high-profile meeting to approve Chief Minister Jagan Mohan Reddy's "three-capital" formula.Cabinet members are also expected to discuss matters related to the location of the state capitals at the meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more