• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Amaravati: 13న ఏపీ కేబినెట్: సచివాలయం, హైకోర్టు తరలింపు, బడ్జెట్.. ప్రధాన అజెండాగా..!

|

అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చేస్తోన్న సన్నహాలకు నిరసనగా అమరావతి ప్రాంత రైతులు నిర్వహిస్తోన్న ప్రదర్శనలు, ఆందోళనలు ఒకవంక కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో..మరోవంక సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలించడానికి సర్కార్ చర్యలను ఆరంభించబోతోంది.. అధికారికంగా. ఇప్పటికే తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ.. అది సూచనప్రాయం మాత్రమే.

  Evening News Express : 3 Minutes 10 Headlines | Bodo Agreement | Coronavirus
   13న ఉదయం 11 గంటలకు..

  13న ఉదయం 11 గంటలకు..

  ఈ పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 13వ తేదీన సమావేశం కానుంది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రులు భేటీ కానున్నారు. 13వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ మంత్రివర్గం సమావేశమౌతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం సర్కులర్‌‌ను జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కొనసాగే ఈ సమావేశంలో- విశాఖపట్నం నుంచి పరిపాలనను ఎప్పటి నుంచి ఆరంభించాలనే అంశం సహా పలు కీలక ప్రతిపాాదనలు చర్చకు రానున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా అదే రోజు ఖరారు చేస్తారు. శాఖలవారీగా బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చిస్తుంది.

   సచివాలయం తరలింపే ప్రధాన అజెండాగా..

  సచివాలయం తరలింపే ప్రధాన అజెండాగా..

  ప్రస్తుతం అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో తాత్కాలికంగా నిర్మించిన సచివాలయం కేంద్రంగా పరిపాలన కొనసాగుతోంది. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడంలో భాగంగా- విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా బదలాయిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో.. సచివాలయాన్ని అమరావతి నుంచి తరలించడం ఖాయమైంది. ఎప్పుడు తరలిస్తారనే దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడ లేదు. అయినప్పటికీ.. ఉగాది నుంచి విశాఖను కేంద్రబిందువుగా చేసుకుని పరిపాలన కొనసాగిస్తారంటూ వార్తలు వచ్చాయి

   తేదీలను ఖరారు..

  తేదీలను ఖరారు..

  దీనికి సంబంధించిన తేదీలను ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా ఖరారు చేయవచ్చని అంటున్నారు. దీనితోపాటు- హైకోర్టు తరలింపు అంశమూ చర్చకు రానుందని తెలుస్తోంది. ఇప్పటికే విజిలెన్స్ కార్యాలయాన్ని కర్నూలుకు తరలించడానికి ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడం, దీనిపై హైకోర్టులో పిటీషన్లు దాఖలు కావడం వంటి పరిణామాలు చకచకా కొనసాగాయి. సచివాలయం గానీ, హైకోర్టును గానీ తరలించడంలో న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనడం సహా పలు అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది.

  మరిన్ని సంక్షేమ పథకాలకు..

  మరిన్ని సంక్షేమ పథకాలకు..

  రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలకు ప్రారంభిస్తామని వైఎస్ జగన్ ఇదివరకే వెల్లడించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం పంపిణీ, ఉద్యోగాల భర్తీ, వాటికి సంబంధించిన నోటిఫికేషన్లపైనా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పరిశ్రమలకు కేటాయించాల్సిన భూములు, రాయలసీమలో నిర్మించ తలపెట్టిన భారీ, మధ్య తరహా నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కేటాయింపు వంటి అంశాలు రానున్నట్లు తెలుస్తోంది.

  ప్రీ పోన్: 12నే కేబినెట్: తాజా ఉత్తర్వులు

  ప్రీ పోన్: 12నే కేబినెట్: తాజా ఉత్తర్వులు

  నిజానికి ఈ నెల 13వ తేదీన మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ తొలుత ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం దాన్ని ప్రీపోన్ చేశారు. 12వ తేదీ నాడే మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తాజాగా ఆదేశాలు ఇచ్చారు. మంత్రివర్గ అజెండాలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకవచ్చని అధికా���ులు వెల్లడిస్తున్నారు.

  English summary
  Andhra Pradesh Cabinet led by Chief Minister YS Jagan Mohan Reddy will meet on 13th February on key issues like Three Capital cities and Social welfare schemes. Cabinet will decide the date of Secretariat working from Visakhapatnam.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X