అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డెసిషన్ డే..రాజధానులపైన నిర్ణయం: ఉత్కంఠ..ఉద్రిక్తత : ఏపీ..పార్టీల భవిష్యత్ కు నేడే కీలకం..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Cabinet May Take Crucial Decision On Three Capitals Today

ఏపీకి కొత్త రాజధాని అధికారికంగా ఖరారు కానుందా. అయిదేళ్ల పాటు రాజధానిగా ఉన్న అమరావతిని కాదంటారా. అధికారిక నిర్ణయానికి సమయం దగ్గర పడింది. ఏపీ భవిష్యత్ ను నిర్దేశించే కీలకమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు నిర్ణయాలు తీసుకోనుంది. ఏపీలో మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదన..జీఎన్ రావు కమిటీ సిఫార్సుల పైన తుది నిర్ణయం ఖరారు చేయనుంది. దీంతో ఏపీలో ఈ కేబినెట్ సమావేశం పైన ఉత్కంఠ..అదే విధంగా అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. రాజధాని గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మొహరించాయి. రాజధాని రైతులకు న్యాయం చేస్తామ ని చెబుతున్న ప్రభుత్వం..ఏం చేస్తామనేది మాత్రం స్పష్టత ఇవ్వటం లేదు. ఇక..ఈ కేబినెట్ సమావేశంలో తీసుకొనే నిర్ణయాలు ఏపీతో పాటుగా రాజకీయ పార్టీల భవిష్యత్ కు కీలకంగా మారుతోంది.

నేడే కీలక కేబినెట్..

నేడే కీలక కేబినెట్..

ఏపీ రాజధానులు..పాలన వికేంద్రీకరణ పేరుతో జరుగుతున్న కొత్త చర్చ పైన ప్రభుత్వం అధికారికంగా స్పష్టత ఇవ్వనుండి. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి తమ విధానం ఏంటనేది శాసనసభా వేదికగా స్పష్టత ఇచ్చారు. ఇక..మంత్రులు...అధికార పార్టీ నేతలు మానసికంగా ప్రజలను సంసిద్దులను చేసే క్రమంలో తమ విధానం స్పష్టం చేస్తూనే ఉన్నారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నాయి. అమరావతి ఏపికి మధ్య ప్రాంతంలో ఉందని.. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయినా..ప్రభుత్వం మాత్రం పాలన వికేంద్రీకరణ పేరుతో ముందుకే వెళ్తోంది. దీంతో..ఈ కేబినెట్ సమావేశంలో జీఎన్ రావు కమిటీ సిఫార్సులకు ఆమోద ముద్ర లాంఛనంగా కనిపిస్తోంది.

అమరావతికి ఏం చెబుతారు..

అమరావతికి ఏం చెబుతారు..

విశాఖకు పరిపాలనా రాజధాని..కర్నూలుకు హైకోర్టు తరలించాలని నిర్ణయాలకు నేటి కేబినెట్ సమావేశంలో అధికారిక ఆమోదం తెలపనున్నారు. మరి..అమరావతి రైతులకు ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వ నుంది. రైతులతో సంప్రదింపులకు మంత్రివర్గ ఉపసంఘం వేస్తామని చెబుతున్నారు. అంటే..ముందుగానే నిర్ణయం తీసుకొని..ఆ తరువాత రైతులతో చర్చిస్తారా. లేక...నిర్ణయం తీసుకున్నా..రైతులతో చర్చించి .. వారికి స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాతనే నిర్ణయం అమలు చేస్తారా అనేది ఇప్పుడు ఉత్కంఠకు కారణమవుతోంది. రాజధాని ప్రాంతి జిల్లాల నేతలు మంత్రులతో సమావేశమయ్యారు. ఆ ప్రాంత ప్రజల్లో అంత ర్గతంగా ఉన్న మనోభావాలను వారికి వివరించారు. ఏ ప్రాంతాన్ని విస్మరించేది లేదని వారికి నచ్చ చెప్పారు..కానీ, అక్కడ ఏం చేయబోతున్నారనేది మాత్రం స్ఫష్టత లేదు.

రాజధానిలో ఉద్రిక్తతలు..

రాజధానిలో ఉద్రిక్తతలు..

రాజధాని అమరావతికి అనుకూలంగా శుక్రవారం ప్రకటన రాకపోతే కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ప్రజా ప్రతినిధులు రాజీనామా చెయాలని అమరావతి పరిరక్షణ సమితి డిమాండ్‌ చేసింది. అన్ని జిల్లాల్లో ప్రజలు రోడ్లపైకి రావాలని కోరింది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటలవరకు మానవహారాలు నిర్వహించి..ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చింది. కేబినెట్ సమావేశానికి స్థానికుల నుండి సమస్యలు ఎదురు కాకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. రాజధాని తరలింపు పైన నిర్ణయం తీసుకుంటే..శనివారం బంద్ పిలుపుకు సిద్దమయ్యారు. రాజధాని పరిరక్షణ పేరుతో అన్ని పార్టీలు..సంఘాలు జేఏసీగా ఏర్పడ్డాయి. దీంతో..రాజధాని గ్రామాలతో పాటుగా గుంటూరు..విజయవాడలో ఉద్రిక్తత ఏర్పడింది. కేబినెట్ నిర్ణయం తరువాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొని ఉంది,

English summary
AP Cabinet may take crucial decision on capital shifting to day. Hi tension created in Amaravati villages and curiosity in Political parties. Police forces heavily mobilised in Amaravati area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X