వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

27న ఏపీ కేబినెట్ భేటీ: మండలి రద్దుపై నిర్ణయం: ఆ వెంటనే అసెంబ్లీలో తీర్మానం..!

|
Google Oneindia TeluguNews

ఏపీ కేబినెట్ వారం రోజుల వ్యవధిలో మరో సారి భేటీ కానుంది. ఈ నెల 20న సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గ పరిపాలనా వికేంద్రీకరణ..సీఆర్డీఏ బిల్లు రద్దుకు నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే అసెంబ్లీలో బిల్లుల ను ప్రవేశ పెట్టి..అదే రోజు ఆమోదం పొందేలా చేసింది. ఇక, ప్రస్తుతం ఏపీలో శాసన మండలి రద్దు పైన జోరుగా చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి జగన్ సైతం స్వయంగా శాసనసభలో మండలి రద్దు అవసరమా ..సోమవారం దీని పైన చర్చించి..నిర్ణయం తీసుకుందామని ప్రతిపాదించారు. దీంతో..ఈ నెల 27న ఉదయం 9.30 గంటలకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో..మండలి రద్దు దిశగానే ఈ సమావేశంలో నిర్ణయించి..ఆ వెంటనే అదే రోజు శాసనసభలో తీర్మానం ప్రతిపాదించి..చర్చ తరువాత కేంద్రానికి సిఫార్పు చేస్తూ ఆమోదించే అవకాశం కనిపిస్తోంది.

27న ఏపీ కేబినెట్ భేటీకి నిర్ణయం...

27న ఏపీ కేబినెట్ భేటీకి నిర్ణయం...

ఈ నెల 27న మరో సారి ఏపీ కేబినెట్ మరో సంచలన నిర్ణయం దిశగా సమావేశం కానుంది. ఏపీ ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన మూడు రాజధానులు..సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లును అమోదించారు. ఆ వెంట నే మండలిలో ప్రవేశ పెట్టే సమయం నుండి చివరి నిర్ణయం వరకూ ప్రతిపక్షం అడ్డు పడుతూనే ఉంది. చివరకు మండలి ఛైర్మన్ ప్రతిపక్షం డిమాండ్ మేరకు రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ తీసుకు న్న నిర్ణయం..రాజకీయంగా సంలనంగా మారింది. దీని పైన ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా ఉన్నారు. మండలి ఛైర్మన్ తీరును శాసనసభలోనే తన ప్రసంగంలో తప్పు బట్టారు. తప్పు అని ఒకవైపు చెబుతూనే మరో వైపు సెలెక్ట్ కమిటీకి ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. మండలి నిర్వహణ కోసం సంవత్సరానికి సుమారు రూ 60 కోట్లు ఖర్చు చేస్తున్నామని..మండలి రద్దు చేద్దామని సభలో చర్చ జరిగింది. దీంతో.. ఏపీ ప్రభు త్వం ఈ నిర్ణయం ఆమోదం కోసమే ఈ నెల 27న కేబినెట్ సమావేవం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

అదే రోజు శాసనసభలో తీర్మానం...

అదే రోజు శాసనసభలో తీర్మానం...


కేబినెట్ సమావేశంలో శాసనమండలి రద్దుకు ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. ఆ వెంటనే 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి స్వయంగా మండలి రద్దు ప్రతిపాదన పైన తీర్మానం సభలో ప్రవేశ పెట్టే ఛాన్స్ ఉంది. దీని పైన అధికార..ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన తరువాత ప్రతిపక్ష నేత చంద్రబాబు తమ అభిప్రాయం స్పష్టం చేస్తారు. ఆ తరువాత ముఖ్యమంత్రి మరోసారి తాము ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నామనే అంశాన్ని మరో సారి వివరించి..చివరగా మండలి రద్దు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేస్తూ తీర్మానం ఆమోదించాలని ప్రభుత్వ సిద్దం చేసినట్లు తెలుస్తోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిన వెంటనే మండలి రద్దయినట్లు కాదని విపక్ష నేతలు చెబుతున్నారు. ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం పైన కేంద్రం కేబినెట్ లో చర్చించి..పార్లమెంట్ రెండు సభల్లో నూ ఆమోదించి..రాష్ట్రపతికి నివేదించాల్సి ఉంటుంది. ఆ తరువాతనే అధికారికంగా మండలి రద్దు అయినట్లుగా నోటిఫికేషన్ జారీ అవుతుంది.

మండలి రద్దుకు న్యాయ చిక్కులు ఉన్నాయా..

మండలి రద్దుకు న్యాయ చిక్కులు ఉన్నాయా..

ఇప్పుడు శాసన మండలి రద్దుకు న్యాయ పరమైన చిక్కులు ఉన్నాయని టీడీపీ నేతలు..కొందరు న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే సెలెక్ట్ కమిటీకి కీలక బిల్లులు పంపాలని నిర్ణయం తీసుకున్న సమయంలో మండలి రద్దు చేస్తున్నారంటూ ఎవరైనా న్యాయస్థానం ఆదేశించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, మండలి రద్దు ప్రతిపాదన పంపిన సమయం నుండి పూర్తిగా రద్దయ్యేందుకు దాదాపు ఆరు నెలల నుండి ఏడాది కాలం సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. తుది నోటిఫికేషన్ వచ్చే వరకూ సభతో సహా సెలెక్ట్ కమిటీ బిల్లులు సైతం లైవ్ లోనే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, వైయస్ పునరుద్దరించిన మండలిని..ఇప్పుడు జగన్ రద్దు చేయటం పైనా చర్చ సాగుతోంది. శాసనసభలో మండలి రద్దు తీర్మానం చర్చ సమయంలో మరోసారి అధికార..విపక్ష సభ్యుల మధ్య మూడు రాజధానుల బిల్లులు..మండలిలో చోటు చేసుకున్న పరిణామాలు..మండలి రద్దు నిర్ణయం పైనా వాగ్వాదం చోటు చేసుకొనే పరిస్థితి కనిపిస్తోంది.

English summary
Ap govt decided to conduct cabinet met on 27th of this month to discuss on abolish of council. After that govt may intorduce resolution in Assembly. But, opposition leaders raising doubts on this decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X