వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను తప్పిస్తే.. నారాయణను కూడా తప్పించాల్సిందే: టీడీపీ మంత్రి ఆసక్తికరం!

సీఎం మాత్రం సిద్దా రాఘవరావు వ్యాఖ్యలను అంతగా చెవిన పెట్టలేదని తెలుస్తోంది. చూద్దాంలే అంటూ ఆయన దాటవేత ప్రయత్నం చేయడంతో.. సిద్దా రాఘవరావు మంత్రి పదవిపై కత్తి వేలాడుతున్నట్లే అని టీడీపీలో అంతర్గత చర్చ న

|
Google Oneindia TeluguNews

అమరావతి : ఏపీ మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో టీడీపీ నాయకుల్లో గుబులు రేగుతోంది. మంత్రి పదవులు నిలుపుకునేదెవరు? ఉద్వాసనకు గురయ్యెదెవరు? అన్న దానిపై మీమాంస నెలకొంది. ఈ విషయంలో అధినేతదే తుది నిర్ణయం కావడంతో ఆయన గురి ఎవరిపై ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.

వేటు పడే మంత్రుల జాబితాలో మంత్రులు పీతల సుజాత, రావెల కిశోర్ బాబు, సిద్దా రాఘవరావు వంటి నాయకుల పేర్లు వినిపస్తున్నాయి. వీరందరిలోకి ఉద్వాసనకు గురయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉన్నది రవాణా శాఖ మంత్రి సిద్దా రాఘవరావే అన్న వాదన కూడా బలంగా వినిపిస్తున్నది. ఏళ్లుగా టీడీపీని అంటిపెట్టుకున్న రాఘవరావుకు లేకలేక మంత్రి పదవి అవకాశం ఇస్తే.. దానికి ఆయన తగిన న్యాయం చేయలేకపోయారని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లుగా సమాచారం.

ap cabinet reshuffle: is minister sidda raghavarao fearing on his ministry

ఈ క్రమంలోనే ఆయన్ను మంత్రిపదవి నుంచి తొలగించాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై తన సన్నిహితులతో వాపోతున్న సిద్దా రాఘవరావు దీనిపై ఆసక్తికరంగా స్పందించినట్లు చెబుతున్నారు. తనను గనుక మంత్రివర్గం నుంచి తప్పిస్తే.. మంత్రి నారాయణను కూడా తప్పించాలని సిద్దా రాఘవరావు వాపోతున్నారట. అంటే, తన పదవి ఊడబీకిన పర్వాలేదు గానీ నారాయణను కూడా మంత్రివర్గంలో లేకుండా చేయాలన్నది ఆయన వాదన.

ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు వద్ద సిద్దా రాఘవరావు వాపోయారట. నెల్లూరు జిల్లా నేతలందరిని కలుపుకుని తాను పనిచేశానని, తన పనితనం గురించి చెప్పుకున్నారట. అయితే సీఎం మాత్రం సిద్దా రాఘవరావు వ్యాఖ్యలను అంతగా చెవిన పెట్టలేదని తెలుస్తోంది. చూద్దాంలే అంటూ ఆయన దాటవేత ప్రయత్నం చేయడంతో.. సిద్దా రాఘవరావు మంత్రి పదవిపై కత్తి వేలాడుతున్నట్లే అని టీడీపీలో అంతర్గత చర్చ నడుస్తోంది.

English summary
AP ministers are feeling the tension due to Cabinet expansion, the date was almost fixed on April 2nd may expansion will happen
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X