వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విస్తరణ: హరికృష్ణ-కళ్యాణ్ రామ్ హాజరు, కాళ్లుమొక్కిన లోకేష్, తడబడిన అఖిల ప్రియ

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ప్రారంభమైంది. గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: నారా లోకేష్, భూమా అఖిల ప్రియ తదితర పదకొండు మంది ఆదివారం ఉదయం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అమరావతి కేంద్రంగా ప్రమాణ స్వీకారం జరిగింది. లోకేష్‌కు పంచాయతీరాజ్ శాఖ కేటాయించారు.

ఐదుగురు ఔట్, 11మంది ఇన్: వైసిపి నుంచి 4గురు, జ్యోతులకు షాక్, అఖిల శాఖ ఇదే!ఐదుగురు ఔట్, 11మంది ఇన్: వైసిపి నుంచి 4గురు, జ్యోతులకు షాక్, అఖిల శాఖ ఇదే!

ప్రమాణ స్వీకారం సమయంలో భూమా అఖిల ప్రియ, నారా లోకేష్, పితాని సత్యనారాయణ కాస్త తడబడ్డారు. కళా వెంకట్రావు, నారా లోకేష్, పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద బాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సుజయ కృ,కృష్ణరంగా రావు, కాల్వ శ్రీనివాసులు, ఆదినారాయణ రెడ్డి, కేఎస్ జవహర్, అమర్నాథ్ రెడ్డి, అఖిల ప్రియలు ప్రమాణం చేశారు.

హాజరైన హరికృష్ణ, నారా రోహిత్, కల్యాణ్ రామ్

హాజరైన హరికృష్ణ, నారా రోహిత్, కల్యాణ్ రామ్

మంత్రి వర్గ విస్తరణకు మాజీ ఎంపీ హరికృష్ణ, కళ్యాణ్ రామ్, నారా రోహిత్, బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. మంత్రివర్గం నుంచి తొలగించబడిన పీతల సుజాత కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. నారా లోకేష్ మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఆయన భార్య బ్రాహ్మణి తనయుడు దేవాంశ్‌తో కలిసి వచ్చారు.

ప్రమాణం సమయంలో తడబడిన అఖిలప్రియ

ప్రమాణం సమయంలో తడబడిన అఖిలప్రియ

భూమా అఖిల ప్రియ ప్రమాణ స్వీకారం చేశారు. 25 ఏళ్లకే ఈమె రాజకీయ ఆరంగేట్రం చేశారు. 2014లో ఉప ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి గెలుపొందారు. కర్నూలు జిల్లా నుంచి ఈమె తొలి మహిళా మంత్రి. ఏపీ కేబినెట్లో అతి చిన్న వయస్కురాలు. అఖిల ప్రియ ప్రమాణం సమయంలో కొంత తడబడ్డారు. ఆమె ప్రమాణ స్వీకారానికి లేచినప్పుడు అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అఖిల ప్రియ పుట్టిన రోజున నాడే ప్రమాణం చేశారు.

 వైసిపి నుంచి సొంతగూటికి అమర్నాథ్ రెడ్డి

వైసిపి నుంచి సొంతగూటికి అమర్నాథ్ రెడ్డి

మంత్రిగా అమర్నాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. 2007 నుంచి 2012 వరకు టిజడిపి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. 1996 ఉప ఎన్నికల్లో పుంగనూరు ఉప ఎన్నికల్లో గెలుపొందారు. 2009లో పలమనేరు నుంచి గెలుపొందారు. 2012లో వైసిపిలో చేరారు. 2016లో తిరిగి టిడిపిలో చేరారు.

మాస్టారు నుంచి మంత్రిగా.. ప్రమాణం చేసిన జవహర్

జవహర్ కొవ్వూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన మంత్రి నుంచి మాస్టారుగా ఎదిగారు. పసివేదల గ్రామంలో మాస్టారుగా పని చేశారు. మూడేళ్లలో పార్టీకి చేసిన సేవలకు ఈ పదవి గుర్తింపు. వివాదరహితుడు. ప్రమాణం చేసిన అనంతరం జవహర్ సీఎం చంద్రబాబు కాళ్లకు నమస్కరించారు.

వైసిపి నుంచి వచ్చిన ఆదినారాయణ రెడ్డి

వైసిపి నుంచి వచ్చిన ఆదినారాయణ రెడ్డి

ఆదినారాయణ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. 2014లో వైసిపి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. 1995లో రాజకీయ ఆరంగేట్రం. మైలవరం కాలేజీలో లెక్చరర్‌గా పని చేశారు. మాస్టారు నుంచి మంత్రిగా ఎదిగారు. 2004లో జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేశారు.

పాత్రికేయుడి నుంచి మంత్రిగా..

పాత్రికేయుడి నుంచి మంత్రిగా..

కాల్వ శ్రీనివాసులు ప్రమాణం చేశారు. నీటి వనరులపై మంచి పట్టు ఉంది. వివాదరహితుడిగా పేరు ఉంది. పార్టీకి, చంద్రబాబుకు విధేయుడిగా గుర్తింపు. సామాజిక కలంతో ఈయన ప్రస్థానం ప్రారంభమైంది. పాత్రికేయుడి నుంచి ఇప్పుడు మంత్రిగా ఎదిగారు. 1999 పార్లమెంటు ఎన్నికలు ఆయన జీవితాన్ని మలుపు తిప్పాయి. ప్రమాణం అనంతరం కాల్వ శ్రీనివాసులు చంద్రబాబు కాళ్లకు మొక్కారు.

బొబ్బిలి రాజవంశీకుల కుటుంబం.. సుజయ ప్రమాణం

బొబ్బిలి రాజవంశీకుల కుటుంబం.. సుజయ ప్రమాణం

సుజయ కృష్ణ రంగారావు ప్రమాణ స్వీకారం చేశారు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. 2014లో వైసిపి నుంచి పోటీ చేసి గెలిచారు. హ్యాట్రిక్ విజయాలు సాధించారు. 2004లో తొలిసారి అసెంబ్లీకి వచ్చారు. బొబ్బిలి రాజవంశీకుల కుటుంబం.

సోమిరెడ్డి ప్రమాణం

సోమిరెడ్డి ప్రమాణం

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

నక్కా ఆనంద బాబు ప్రమాణం..

నక్కా ఆనందబాబు ప్రమాణం చేశారు. ఆయన 2009లో తొలిసారి పోటీ చేశారు. వివాదరహితుడిగా పేరు ఉంది. పార్టీకి విధేయిడిగా పేరు ఉంది. టిడిపి ఆవిర్భాం నుంచి ఉన్నారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు.

పితాని ప్రమాణం

పితాని ప్రమాణం

పితాని సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం సమయంలో పితాని కొంచం తడబడినట్లుగా కనిపించింది.

ప్రమాణం చేసి కాళ్లు మొక్కిన నారా లోకేష్

ప్రమాణం చేసి కాళ్లు మొక్కిన నారా లోకేష్

నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం లోకేష్ సీఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ కాళ్లకు నమస్కరించారు.

తొలుత కమిడి కళా వెంకట్రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన 1982లో తెలుగుదేశం పార్టీలో చేరారు.

English summary
AP CM Chandrababu Naidu to induct Son Nara Lokesh Into Cabinet on today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X