అమరావతి ఇప్పట్లో తేలదా..: అడ్డు తిరిగిన రైతులు: ఆ కమిటీ రద్దు చేయండంటూ కోర్టుకు..!
ఏపీ రాజధాని అమరావతి వివాదం ఇప్పట్లో తేలదా. ఇదే అనుమానం ప్రభుత్వ వర్గాల్లోనూ కనిపిస్తోంది. ప్రభుత్వంలోని మంత్రులు రాజధాని కొనసాగింపు పైన అనుమానం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలతో గందర గోళం మొదలైంది. ఇదే సమయంలో ప్రభుత్వం రాజధానితో పాటుగా ఇతర ప్రాంతాల్లో పాలనా వికేంద్రీకరణ కోసం సలహాలు కోరుతూ రిటైర్డ్ ఐఏయస్ జీఎన్ రావు నేతృత్వంలో ఇతర నిపుణులతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ప్రజాభిప్రాయ సమయం సైతం ముగిసింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా రాజధాని పైన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదే సమయంలో అసలు ఆ కమిటీ పైన రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కమిటీని రద్దు చేయాలని అభ్యర్ధించారు. ఇక..ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. ఇక, ఈ వ్యవహారం కోర్టుకు చేరటంతో..అమరావతి వ్యవహారం ఇప్పట్లో తేలుతుందా..
రాజధాని నిర్మాణంపై ప్రజలకు స్పష్టత ఉంది... చంద్రబాబుకే లేదు: బోత్స

రాజధాని కమిటీని రద్దు చేయండి..
రాష్ట్ర రాజధాని సహా ఇతర ప్రాంతాల అభివృద్ధిపై సిఫారసులు చేసేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా బోరుపాలెం గ్రామానికి చెందిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ సీఆర్డీఏ చట్ట నిబంధనలకు విరుద్ధంగా కమిటీని ఏర్పాటు చేశారని పిటీషన్ పేర్కొన్నారు. చట్టసభ ద్వారా ఏర్పాటైన సీఆర్డీఏపై పునఃసమీక్ష జరిపే అధికారం కూడా ఈ కమిటీకి లేదని పిటిషన్లో వివరించారు. ఈ నేపథ్యంలో కమిటీని నియమిస్తూ జారీచేసిన జీవోను రద్దు చేయాలని అభ్యర్థించారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిని తరలించినా, నిర్మాణం ఆలస్యం చేసినా భూములిచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు. దీంతో..ఇప్పుడు కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయినా నివేదిక మీద కోర్టు జోక్యం ఆధారంగా కమిటీ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం..
ప్రభుత్వం మాత్రం తాము నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే రాజధాని పైన నిర్ణయం ఉంటుందని స్పష్టం చేస్తోంది. రాజధానిలో నిర్మాణాలకు అనుకూలమైన ప్రాంతం కాదని చెబుతూనే.. అధికార వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

రాజధాని మార్పు
తాజాగా జీఎన్ రావు కమిటీని కలిసిన రాజధాని ప్రాంత రైతులు తమకు రాజధాని మార్పు ఉండదనే నమ్మకం కలిగిందని వ్యాఖ్యానించారు. ఇంతలోనే కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.
ఇప్పటికే అమరావతి స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ నుండి సింగపూర్ సంస్థలు తప్పుకున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు పూర్తిగా నిలిపివేసారు.
ఇక, అమరావతి ఏపీ రాజధానిగా గుర్తిస్తూ గత ప్రభుత్వం గెజిట్ సైతం విడుదల చేయలేదు. అదే విధంగా ప్రస్తుత ప్రభుత్వం సైతం దీనిని విడుదల చేసేందుకు సిద్దంగా లేదు. దీంతో..
ఇప్పుడు అమరావతి వ్యవహారం పైన సందిగ్దత ఏర్పడింది. ఫిబ్రవరి తరువాతనే ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!