అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ రాజధాని రగడ .. కేంద్రం చెప్పింది ఎవరికి అనుకూలం ? ఎవరికి తోచినట్టు వారి ప్రచారం !!

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధానిపై మొన్నటి వరకు నోరు మెదపని కేంద్రం ఎట్టకేలకు నిన్న ఏపీ రాజధాని వ్యవహారంపై తన స్పందన తెలియజేసింది . లోక్ సభలో ఎంపీ గల్లా జయదేవ్ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి రాజధాని అమరావతి విషయంలో కర్ర విరగకుండా, పాము చావకుండా సమాధానం ఇచ్చారు. తాంబూలాలు ఇచ్చాము తన్నుకు చావండి అన్న చందంగా కేంద్రం సమాధానం ఉండటం గమనార్హం .

అమరావతిలో ఆగని పోరు... 50వ రోజుకు ఆందోళనలు .. నేడు రాజధాని గ్రామాల్లో చంద్రబాబు పర్యటనఅమరావతిలో ఆగని పోరు... 50వ రోజుకు ఆందోళనలు .. నేడు రాజధాని గ్రామాల్లో చంద్రబాబు పర్యటన

ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్న టీడీపీ , వైసీపీలు

ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్న టీడీపీ , వైసీపీలు

ఇక అసలు విషయానికి వస్తే అమరావతి రాజధాని అంశంలో కేంద్రం చెప్పిందానికి రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకుంటున్నదానికి పొంతన ఏ మాత్రం లేదు . ఎవరికి నచ్చినట్టు, ఎవరికి తోచినట్టు వారు అర్థం చేసుకుని దానిపై ప్రకటనలు చేస్తున్నారు . కానీ కేంద్రం మాత్రం రాజధాని అంశంపై మాట్లాడిన స్పష్టత మాత్రం ఇవ్వలేదు . కావాలనే గందరగోళంగా సమాధానం చెప్పింది అన్న భావన ఏపీ ప్రజల్లో , రాజకీయ వర్గాల్లో ఉంది.

 రాజధాని అమరావతిని 2015లోనే నోటిఫై చేశామన్న కేంద్రం

రాజధాని అమరావతిని 2015లోనే నోటిఫై చేశామన్న కేంద్రం

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సభలో లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం చెప్పింది కేంద్రం. అందులో రాజధాని అమరావతిని నోటిఫై చేశారని చెప్పింది. రాజధాని వ్యవహారం రాష్ట్రాల పరిధిలోనిదని చెప్పింది . ఇంతకీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసినప్పుడు రాజధాని అమరావతినేనా ? లేకా సీఎం జగన్ తాజాగా తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం రాజధాని వ్యవహారం రాష్ట్రాల పరిధిలోదే అని చెప్పినందుకు రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని తాము మార్చలేమని చెప్పటమా ? అన్నది ఏ మాత్రం అర్ధం కాకుండా సమాధానం ఇచ్చారు. దీంతో సమస్య మరింత జఠిలం అయింది.

అమరావతిని నోటిఫై చేశామని చెప్పటం రాజధానిగా అమరావతినే అన్న సంకేతం అన్న టీడీపీ

అమరావతిని నోటిఫై చేశామని చెప్పటం రాజధానిగా అమరావతినే అన్న సంకేతం అన్న టీడీపీ


ఏపీ రాజధాని వ్యవహారంపై కేంద్రమంత్రి చాలా క్లుప్తంగా సమాధానం ఇచ్చారు. దాని ప్రకారం.. 2015లో రాజధానిగా అమరావతి నోటిఫై చేశామని ఆయన పేర్కొన్నారు . దీన్ని తెలుగుదేశం పార్టీతో పాటు అమరావతి మద్దతుదారులు ఈ పాయింట్ కీలకం అని దీనినే ప్రస్తావిస్తూ రాజధాని అమరావతినే అని కేంద్రం చెప్పిందని చెప్తున్నారు . రాజధానిగా అమరావతిని గుర్తించారని ఇప్పుడు తరలించాడనికి అవకాశం లేదని వారు వాదన . మూడు రాజధానులను ఏర్పాటు చెయ్యాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన సమాధానం చెంప పెట్టు లాంటిదని వారు అంటున్నారు. . ఒక సారి నోటిఫై అయిన రాజధానిని మార్చే హక్కు లేదని కేంద్రం లిఖితపూర్వకంగా చెప్పిందని వారు చెప్పుకుంటున్నారు .

రాజధాని విషయంలో నిర్ణయాధికారం రాష్ట్రాలదే .. ఇది వైసీపీ సర్కార్ కు అనుకూలం అని ప్రచారం

రాజధాని విషయంలో నిర్ణయాధికారం రాష్ట్రాలదే .. ఇది వైసీపీ సర్కార్ కు అనుకూలం అని ప్రచారం

ఇక మరో పాయింట్ చెప్పిన కేంద్రం రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రాలదేనని పేర్కొంది. అంటే రాజధాని వ్యవహారంలో కేంద్ర సర్కార్ జోక్యం చేసుకోడాని, రాష్ట్రాలదే నిర్ణయాధికారం అన్న భావన ఈ వ్యాఖ్యల ద్వారా అర్ధం చేసుకున్న వైసీపీ మూడు రాజధానుల విషయంలో కేంద్రం కూడా సానుకూలంగా ఉన్నట్టు, మూడు రాజధానులకు ఓటేసినట్టు ప్రచారం చేసుకుంటుంది . రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదని, అంతా తమ ఇష్టమని వైసీపీ నేతలు చెప్పటం గమనార్హం .

మూడు రాజధానుల గురించి మీడియాలో వింటున్నామన్న కేంద్రం

మూడు రాజధానుల గురించి మీడియాలో వింటున్నామన్న కేంద్రం

ఇక అంతేకాదు మూడు రాజధానుల గురించి మీడియాలో వింటున్నామని కానీ తమ వద్దకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని పేర్కొనటం వైసీపీ ప్రభుత్వం రాజధానుల వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళలేదనే విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. నిన్నా మొన్నటి వరకు అంతా కేంద్రానికి తెలిసే జరుగుతుందని ప్రచారం జరిగిన నేపధ్యంలో అలాంటిదేమీ లేదని కేంద్రం చెప్పటం గుర్తించాల్సిన అంశం . ఇక కేంద్రం చేసిన వ్యాఖ్యలను ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటూ కేంద్రం తమకు అనుకూలంగా చెప్పిందని చంకలు గుద్దుకుంటూ సంబరపడుతున్నారు.

 డిప్లమాటిక్ గా సమాధానం చెప్పిన కేంద్రం

డిప్లమాటిక్ గా సమాధానం చెప్పిన కేంద్రం

కానీ కేంద్రం మాత్రం కర్ర విరగకుండా, పాము చావకుండా సమాధానం చెప్పింది. తన స్పష్టమైన వైఖరి ఏంటి అనేది మాత్రం వెల్లడించలేదు. దీనికి అనుకూలం, దీనికి కాదు అని స్పష్టం చెయ్యలేదు .కనీసం రాజధాని కోసం కేంద్రం నిధులు ఇచ్చింది. వాటి సంగతి ఏంటి అన్న ప్రస్తావన కూడా లేదు . ఏది ఏమైనప్పటికే కేంద్రం సమాధానం చాలా డిప్లమాటిక్ గా ఇస్తే ఎవరికి తగ్గట్టు వారు చెప్పుకునే పనిలో పడ్డారు రాజకీయ నాయకులు . ఇక ఏపీలో రాజధాని అంశం ఎటూ తేలక ప్రజలు మాత్రం తీవ్ర గందరగోళంలో ఉన్నారు .

English summary
The Center did not disclose its clear stance on AP's capital dealings. This is not the case .It was funded by the Center for Capital. There is no mention of them. However, the Center's answer is so diplomatic that it is the politicians who have to work for what they claim to be. In AP, the capital issue, the people are in a serious mess.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X