వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్ చేస్తే అదే చివరి రోజు, ఉన్మాదులకు రాష్ట్రంలో చోటు లేదు: బాబు

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో ఉన్మాదులకు చోటు లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. అత్యాచారాలకు పాల్పడినవారికి అదే రోజు చివరి రోజు అవుతోందని బాబు హెచ్చరించారు. నిందితులను కఠినంగా వ్యవహరిస్తామన్నారు. భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకొంటామని చెప్పారు.

Recommended Video

గుంటూరు లో దారుణం ....మరో నిర్భయ కేసు

దాచేపల్లి బాధితురాలి తండ్రితో పాటు మరికొందరు శుక్రవారం సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిశారు. దాచేపల్లి ఘటనకు బాధ్యులైన నిందితుడిని అరెస్ట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని చంద్రబాబునాయుడు వివరించారు.

ఈ కేసును 48 గంటల్లో తేల్చిన పోలీసులను చంద్రబాబునాయుడు అభినందించారు. అత్యాచార ఘటనలకు పాల్పడాలంటూ భయపడేలా కఠినంగా వ్యహరిస్తామని బాబు హెచ్చరించారు.

అత్యాచార నిందితులను కఠినంగా శిక్షిస్తాం

అత్యాచార నిందితులను కఠినంగా శిక్షిస్తాం


అత్యాచారానికి పాల్పడితే నిందితులకు అదే రోజు చివరి రోజు అవుతోందని ఏపీ సీఎం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. దాచేపల్లి బాధితురాలిని సోమవారం నాడు పరామర్శించనున్నట్టు చెప్పారు.రాష్ట్రంలో ఉన్మాదులకు చోటు లేదని బాబు చెప్పారు.అత్యాచార ఘటనపై సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అవగాహన ర్యాలీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే చర్యలు

శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే చర్యలు

శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఎవ్వరినీ వదిలి పెట్టము. ఎంతటి వారైనా తప్పించుకోలేరు. నేరం చేసినా ఏమీ జరగబోదనే ధీమా ఎవ్వరిలోనూ ఉండడానికి వీల్లేదు. దాచేపల్లి ఘటనకు ప్రభుత్వం 48 గంటల్లోగా ముగింపు పలికిందని, రాష్ట్రంలో ఉన్మాదులకు చోటులేదని ఆయన హెచ్చరించారు.

బాధితురాలి కుటంబానాకి అండ

బాధితురాలి కుటంబానాకి అండ


దాచేపల్లి బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. విజయవాడలో నిర్వహించే ర్యాలీలో తాను పాల్గొంటానని చంద్రబాబునాయుడు చెప్పారు. బాధితురాలి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్ధిక సహయం అందించింది. స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రూ. 2 లక్షలు చెల్లించారు.

మార్పు రావాలి

మార్పు రావాలి


మీ ఇంట్లో ఎవరైనా ఉన్మాదుల్లా తయారవుతుంటే వారిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.దాచేపల్లి ఘటన బాధితురాలి తండ్రి ఆ రోజు ఏం జరిగిందో బాబుకు వివరించారు. న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతోనే తాను కేసు పెట్టానని బాబుకు బాధితురాలి తండ్రి చెప్పారు.

English summary
Dachepalli victim family members met Ap chief minister Chandrababunaidu on Friday Evening at Amaravathi. He said that Ap government take serious action against rapists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X