వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాగ్ రిపోర్ట్‌‌తో కేసులా, మోడీపై ఎన్ని పెట్టాలి, పోలవరాన్ని అడ్డుకొనే కుట్ర: బాబు

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

పవన్ అవగాహనా లేకుండా మాట్లాడ్తున్నాడు

అమరావతి: పట్టిసీమపై కాగ్ రిపోర్ట్‌ ఆధారంగా కేసులు పెడతారా అని బిజెపి నేతలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు.నిన్నటివరకు తమ ప్రభుత్వంపై కన్పించని అవినీతి ఇప్పుడెలా కన్పించిందని బాబు ప్రశ్నించారు.పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా కుట్రలు పన్నుతున్నారని చంద్రబాబునాయుడు ఆరోపించారు.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

ఏపీ అసెంబ్లీలో గురువారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టులను నిర్మించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకొనే ప్రయత్నాలను చేస్తున్నారని ఆయన చెప్పారు.

ఏపీ రాష్ట్రంపై ఉద్దేశ్యపూర్వకంగానే ఆరోపణలు చే.స్తున్నారని బాబు అభిప్రాయపడ్డారు. పోలవరంతో పాటు పురుషోత్తమపట్నం ప్రాజెక్టును అడ్డుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

 కాగ్ రిపోర్ట్ ఆధారంగా కేసులేస్తారా

కాగ్ రిపోర్ట్ ఆధారంగా కేసులేస్తారా

పట్టిసీమపై కాగ్ రిపోర్ట్ ఆధారంగా కేసులు వేస్తారా అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై కూడ కాగ్ రిపోర్ట్‌లో అనేక తప్పులను ఎత్తి చూపుతోందని బాబు ప్రస్తావించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా మోడీ ప్రభుత్వంపై కూడ కేసులు వేస్తారా అని బాబు ప్రశ్నించారు. ఇంతకాలం పాటు తమ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయని బిజెపి నేతలు ఇప్పడే ఎందుకు అవినీతి ఆరోపణలు చేస్తున్నారని బాబు ప్రశ్నించారు.

 పోలవరంపై కుట్రలు

పోలవరంపై కుట్రలు

పోలవరంపై కుట్రలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టును పూర్తికాకుండా చేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం కాంట్రాక్టర్‌ను ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఎంపిక చేసిందని బాబు గుర్తు చేశారు. మరోవైపు ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ముందుకు వచ్చిన నవయుగ కంపెనీకి తాను వత్తాసు పలుకుతున్నానని సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని బాబు చెప్పారు. కేంద్రమే నమయుగ కంపెనీకి ఈ పనులను అప్పగించిందని చెప్పారు.పోలవరం పునరావాసంపై పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లో 2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబునాయుడు ప్రకటించారు.

 ప్రజలను రెచ్చగొట్టారు

ప్రజలను రెచ్చగొట్టారు

పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కూడ ఇదే తరహలో ప్రజలను రెచ్చగొట్టారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.గోదావరి నీళ్ళను రాయలసీమకు తరలిస్తున్నారని ప్రజలను కొందరు రెచ్చగొట్టారని వైసీపీ నేత జగన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఏపీలోని16 ప్రాజెక్టుల నిర్మాణం పురోగతిలో ఉన్నాయని ఆయన చెప్పారు. కుప్పం నియోజకవర్గానికి కంటే ముందుగానే పులివెందుకు నీళ్ళిచ్చినట్టుగా బాబు గుర్తు చేశారు.

ఏపీకి ఏమిచ్చారు

ఏపీకి ఏమిచ్చారు

ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే ఏపీ రాష్ట్రానికి నిధులు ఇచ్చారని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. విభజన చట్టంలో పొందుపర్చిన హమీలను అమలు చేశారా అని బాబు కేంద్రాన్ని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రధానమంత్రి మోడీని కలవడంపై మరోసారి చంద్రబాబునాయుడు సభలో మండిపడ్డారు.

English summary
AP CM Chandrababu Naidu responded on BJLP leader Vishnukumar Raju comments over CAG report on Pattiseema project . Chandrababunaidu addressed in Ap Assembly on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X