వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ అంత‌లా వంగి..వంగి: ఎందుకింత‌లా: ప‌్ర‌ధానికి పాదాభివంద‌న య‌త్నం : టీడీపీ నేత‌ల ట్రోలింగ్‌..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ప‌్ర‌ధానికి జ‌గ‌న్ పాదాభివంద‌న య‌త్నం : టీడీపీ నేత‌ల ట్రోలింగ్‌..! || Oneindia Telugu

ప్ర‌ధాని మోదీ తిరుప‌తి వ‌చ్చారు. స్వాగతం ప‌లికారు. అదే స‌మ‌యంలో ప్ర‌ధానికి వంగి...వంగి దండాలు పెట్టారు. ప్ర‌ధానికి పాదాభివంద‌నం చేయ‌టానికి ప్ర‌య‌త్నించారు. ప్ర‌ధాని వారించారు. జ‌గ‌న్ భుజం త‌ట్టి అభినందించారు. అయితే, జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉండి..ప్ర‌ధానికి అంత‌లా వంగి..వంగి దండాలు పెట్టాల్సిన అవ‌స‌రం ఉందా. గ‌తంలో చంద్రబాబు ఇదే త‌ర‌హాలో చేస్తే ఎంతో మంది విమ‌ర్శించారు. కానీ, ఇప్పుడు జ‌గ‌న్ తిరిగి అదే చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే స‌మ‌యంలో వైసీపీ రివ‌ర్స్ ఎటాక్ మొద‌లు పెట్టింది.

నాడు కోవింద్‌కు..నేడు మోదీకి...

నాడు కోవింద్‌కు..నేడు మోదీకి...

జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిలో గ‌తం కంటే ఎంతో మార్పు. జ‌గ‌న్‌కు అస‌లు పెద్ద‌లంటే లెక్కే లేదు..క‌నీసం గౌర‌వించ‌రు. ఇదీ ప‌దే ప‌దే టీడీపీ నేత‌లు చేసిన ఆరోప‌ణ‌లు. కానీ, కొంత కాలంగా జ‌గ‌న్ శైలిలో ఊహించ‌ని మార్పు. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలో నాడు ఎన్డీఏ ప్ర‌తిపాదించిన రాష్ట్రప‌తి అభ్య‌ర్ది రామ్‌నాద్ కోవింద్ హైద‌రాబాద్ వ‌చ్చారు. అప్ప‌టికే వైసీపీ త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఆ స‌మ‌యంలో రామ‌న్‌నాధ్ కోవింద్‌కు జ‌గ‌న్ పాదాభివంద‌నం చేసారు. దీని పైన టీడీపీ నేత‌లు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసింది. ఇక‌, ఆ త‌రువాత చిన్న జీయ‌ర్ స్వామి.. స్వ‌రూపానంద స‌ర‌స్వ‌తి స్వామి వంటి వారికి సాష్టాంగ న‌మ‌స్కారాలు చేసారు. ఇక‌, ఇప్పుడు ప్ర‌ధాని మోదీ రెండో సారి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత తిరుప‌తికి వ‌చ్చారు. జ‌గ‌న్ సైతం ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత మోదీ ఏపీకీ రావ‌టం మొద‌టి సారి. అయితే, స్వాగ‌త స‌మ‌యంలో జ‌గ‌న్ వంగి..వంగి మోదీకి న‌మ‌స్కారాలు చేసారు. పాదాభివంద‌నం కోసం ప్ర‌య‌త్నించ‌గా..మోదీ వారించారు. భుజం త‌ట్టి అభినందించారు.

 నాడు చంద్ర‌బాబు..నేడు జ‌గ‌న్

నాడు చంద్ర‌బాబు..నేడు జ‌గ‌న్

ప్ర‌ధాని తొలి సారిగా ప్ర‌ధానిగా ఉన్నంత కాలం దాదాపు మూడేళ్ల‌కు పైగా నాటి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇదే త‌ర‌హాలో మోదీకి ప్రాధాన్య‌త ఇచ్చారు. వంగి..వంగి దండాలు పెట్టారు. మూడేళ్లు బాగానే ఉంది. ఆ త‌రువాత‌నే ఇద్ద‌రి మ‌ధ్య అస‌లు యుద్దం మొద‌లైంది. చంద్ర‌బాబు సైతం ఇదే విష‌యాన్ని పలు మార్లు ప్ర‌స్తావించారు. ప్ర‌ధాని అహం దెబ్బ‌తిన‌కూడ‌ద‌నే తాను ఆయ‌న‌కు లొంగి ఉన్నాన‌ని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు జ‌గ‌న్ సైతం అదే త‌ర‌హాలో
మోదీతో వ్య‌వ‌హ‌రిస్తున్నారా అనే చ‌ర్చ మొద‌లైంది. దీని పైన టీడీపీ నేత‌లు సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్ల‌ను ట్రోల్ చేస్తున్నారు. చంద్ర‌బాబును నాడు విమర్శించారు..నేడు జ‌గ‌న్ చేస్తున్న‌దేంటి అని ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో.. ఇప్పుడు ఈ విష‌యం పైనా వైసీపీ నేత‌లు మాత్ర భిన్నంగా స్పందిస్తున్నారు. జ‌గ‌న్ శైలి గురించి వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

జ‌గ‌న్ ఎందుకు అలా చేసారంటే...

జ‌గ‌న్ ఎందుకు అలా చేసారంటే...

ముఖ్య‌మంత్రి హోదా ఉన్న జ‌గ‌న్ త‌న కంటే వ‌య‌సులో పెద్ద వార‌నే కార‌ణంగానే మోదీకి పాదాభివంద‌నం చేయాల ని భావించార‌ని..అంతే హుందాగా మోదీ సైతం వారించార‌ని చెబుతున్నారు. జ‌గ‌న్ ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం కేంద్రంతో ఎలా వ్య‌వ‌హ‌రించ‌బోయేదీ ఢిల్లీ మీడియా సమావేశంలోనే స్ప‌ష్టం చేసిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. కేంద్రంతో స‌ఖ్య‌త‌గా ఉండి సాధించుకోవ‌టం మిన‌హా..వారికి ఎవ‌రి మ‌ద్ద‌తు అవ‌స‌రం లేద‌ని..వారితో స‌ఖ్య‌త‌గా ఉండం.. బ్ర‌తిమ లాడి ప్ర‌యోజ‌నాలు ద‌క్కించుకోవ‌టం మిన‌హా మ‌రో దారి లేద‌ని స్ప‌ష్టం చేసారు. ఇక‌, ఆత్మౌగౌర‌వం దెబ్బ‌తీస్తే తాను ఏ ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తారో సోనియా విష‌యంతో జ‌గ‌న్ తీరును గుర్తు చేస్తున్నారు. అయితే, జ‌గ‌న్ సుదీర్ఘ కాలం ముఖ్య‌మం త్రిగా ఉండాల‌ని భావిస్తున్నార‌ని..అందులో భాగంగానే...కేంద్ర సాయం కీల‌కం కావ‌టంతో..ప్ర‌ధానికి మ‌రింత గౌర‌వం ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని వివ‌రిస్తున్నారు. దీనికి స్పంద‌న‌గానే ప్ర‌ధాని సైతం పార్టీ స‌మావేశంలో..ద‌ర్శ‌న స‌మ‌యంలో జ‌గ‌న్‌కు ప్రాధాన్య‌త ఇచ్చిన విష‌యాన్ని వివ‌రిస్తున్నారు.

English summary
AP Chief Minister Jagan try to touh Prime Minister feet for blessings in Reception in Tirupathi. But Modi did not given chance. Now this issue causing for trolling in Social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X